ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మోటార్స్ 2020 ఈ ఏఢాది ఆరంభంలో తమ కొత్త బిఎస్6 వెర్షన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని రూ.29.55 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ సరికొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి - టైటానియం 4x2 ఏటి, టైటానియం+ 4x2 ఏటి మరియు టైటానియం+ 4x4 ఏటి.

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

ఫోర్డ్ మోటార్స్ ఇదివరకే ఈ మోడల ధరను పెంచాలని నిర్ణయించినప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ధరల పెంపుదలను కంపెనీ ఆలస్యం చేసింది. తాజాగా బిఎస్6 కంప్లైంట్ ఫోర్డ్ ఎండీవర్ ధరలను కంపెనీ వేరియంట్‌ను బట్టి రూ.44,000 నుంచి రూ.1.20 లక్షల మేర పెంచింది.

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

తాజా పెంపు తర్వాత ఫోర్డ్ ఎండీవర్ టైటానియం 2.0 4X2 ఏటి ధర రూ.29.99 లక్షలు కాగా, టైటానియం+ 2.0 4X2 ఏటి ధర రూ.32.75 లక్షలు, టైటానియం+ 2.0 4X4 ఏటి ధర రూ.34.45 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

MOST READ:ఇది చూసారా.. ఆడి కార్ గుర్రపు బండిగా మారింది, ఎందుకో తెలుసా

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో ఆల్-ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీ ‘ఫోర్డ్‌పాస్'తో ఉంటుంది, ఇది వాహన యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా నియంత్రించడానికి మరియు వాహన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తుంది. అంతేకాకుండా ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

ఇవే కాకుండా, పానోరమిక్ సన్‌రూఫ్, టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 కారులో కొత్త 2.0-లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 168 బిహెచ్‌పి శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఇంజన్ లో-ఎండ్ టార్క్‌లో 20 శాతం పెరుగుదలను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:వరద నీటిలో చేపలాగా ఈదుతున్న ఎలక్ట్రిక్ కారు

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

ఈ కొత్త బిఎస్6 ఇంజన్ మరింత రీఫైన్ చేయబడినది మరియు పాత మోడళ్ల కంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ తరహా గేర్‌బాక్స్ భారతదేశంలోనే మొట్టమొదటిదని కంపెనీ తెలిపింది. ఈ గేర్‌బాక్స్‌లో ప్రోగ్రెసివ్ రేంజ్ సెలెక్ట్ లేదా సెలెక్ట్ షిఫ్ట్ కూడా ఉంటుంది.

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలోని 192 నగరాల్లో 226 సర్వీస్ సెంటర్లను మరియు 194 షోరూమ్‌లను కలిగి ఉంది. ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా 420 కస్టమర్ టచ్‌పాయింట్లు కూడా ఉన్నాయి.

MOST READ:కియా సోనెట్ ఎస్‌యూవీ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది

ఫోర్డ్ ఎండీవర్ బిఎస్6 ధరల పెంపు - వివరాలు

ఫోర్డ్ ఎండీవర్ ధర పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోర్డ్ ఎండీవర్ ఎల్లప్పుడూ ఫోర్డ్ మోటార్స్‌కు విజయవంతమైన మోడల్‌గా ఉంది మరియు తాజాగా పెరిగిన ధరలు ఈ ఎస్‌యూవీ అమ్మకాలను ప్రభావితం చేయవనేది మా అభిప్రాయం. భారతీయ మార్కెట్లో మహీంద్రా అల్టురాస్ జి4 మరియు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ వంటి మోడళ్లకు ఫోర్డ్ ఎండీవర్ పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
American auto manufacturer, Ford Motors has now hiked the prices of the BS6-compliant Endeavour by Rs 44,000 to Rs 1.20 lakh, based on the choice of the variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X