హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశంలోని తమ కస్టమర్ల కోసం 'బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. హోండా యజమానులు తమ కారుకి ఏదైనా నష్టం జరిగి ఉన్నట్లయితే, వాటిని మరమ్మత్తు చేయించుకోవటానికి ఇదొక గొప్ప అవకాశం అని కంపెనీ పేర్కొంది.

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

హోండా కస్టమర్ల కోసం బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్ సెప్టెంబర్ 14వ తేదీ నుండి ప్రారంభమై సెప్టెంబర్ 26, 2020 వరకూ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీస్ క్యాంప్ భారతదేశంలోని అన్ని అధీకృత హోండా సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది కంపెనీ వివరించింది.

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

మొత్తం 13 రోజుల పాటు జరిగే ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా, హోండా తమ కస్టమర్లకు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కస్టమర్లు ఇప్పుడు పెయిడ్ బాడీ మరియు పెయింట్ రిపేర్‌పై ఆకర్షణీయమైన ఆఫర్‌లు అలాగే బంపర్స్, విండ్‌షీల్డ్ మరియు సైడ్ మిర్రర్ వంటి విడిభాగాలపై తగ్గింపులను పొందవచ్చు.

MOST READ:త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లయింగ్ కార్లు ఇవే.. మీరు చూసారా ?

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

ఈ ఆఫర్లలో భాగంగా ఇంటీరియర్ ఎన్‌రిచ్మెంట్, పెయింట్ ట్రీట్మెంట్ మరియు బ్యూటిఫికేషన్ డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, సర్వీస్ సెంటర్‌కు తీసుకువచ్చే హోడా కార్లను కంపెనీ పూర్తిగా శానిటైజ్ కూడా చేస్తుంది. ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా టాప్ వాష్, అడిషనల్ బ్యాటరీ బైబ్యాక్ ఆఫర్ మరియు బాడీ అండ్ పెయింట్ ఎస్టిమేషన్ వంటి ఉచిత సేవలను కూడా కంపెనీ తమ వినియోగదారులకు అందించనుంది.

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

ఈ సర్వీస్ క్యాంప్ గురించి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "మా కస్టమర్లకు కొనుగోలు మరియు గొప్ప యాజమాన్య అనుభవాన్ని అందించే మా నిబద్ధతకు కట్టుబడి ఉండటంలో భాగంగా, భారతదేశం అంతటా హోండా డీలర్లందరూ ఈ బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత కస్టమర్లు తమ కార్లను మెయింటైన్ చేయటానికి మరియు వాటి రూపాన్ని పునరుద్ధరించడానికి ఈ సర్వీస్ క్యాంప్ వారికి సహాయపడుతుందని" ఆయన అన్నారు.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

హోండా డీలర్‌షిప్‌లను సందర్శించే ముందు కస్టమర్లు సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవాలని హోండా చెబుతోంది. హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా లేదా బ్రాండ్ యొక్క హోండా కనెక్ట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా డీలర్‌షిప్‌ను నేరుగా సంప్రదించడం ద్వారా ఈ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా, హెచ్‌సిఐఎల్ డీలర్‌షిప్‌లు మరియు వర్క్‌షాప్‌లు కూడా అన్ని రకాలు భద్రతా చర్యలు మరియు మార్గదర్శకాలను పాటిస్తున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన సేవలను అందించడానికి తగినంత సామాజిక దూరం కూడా పాటిస్తున్నారు.

MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 10 లక్షల లోపు ఉన్న టాప్ 5 కొత్త కార్లు

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

హోండాకి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే.. హోండా తాజాగా తమ మునుపటి (నాల్గవ) తరం హోండా సిటీ సెడాన్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ ఇప్పుడు కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే 'ఎస్‌వి ఎమ్‌టి' మరియు 'వి ఎమ్‌టి' లభ్యం కానుంది. ఐదవ తరం (2020) హోండా సిటీతో పాటుగా నాల్గవ తరం సిటీ అమ్మకాలు కూడా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హోండా కస్టమర్ల కోసం 'బాడీ, పెయింట్ సర్వీస్ క్యాంప్' - డీటేల్స్

హోండా కార్స్ ఇండియా బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలోని హోండా వినియోగదారుల కోసం కొత్త బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్‌ను ప్రకటించింది. ఈ సర్వీస్ క్యాంప్ సాయంతో హోండా వినియోగదారులు తమ కార్లపై దెబ్బతిన్న భాగాలను తక్కువ ఖర్చుతో మరమ్మత్తులు చేయించుకోవచ్చు.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Limited announced a 'Body & Paint Service Camp' for its customers in the country. The company is giving its customers a chance to get their cars to repair for any damage. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X