Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 22 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Sports
RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశవ్యాప్తంగా 'స్మార్ట్ కేర్ క్లినిక్' సర్వీస్ క్యాంపైన్‌ను ప్రకటించిన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ వినియోగదారుల కోసం దేశవ్యాప్తంగా స్మార్ట్ కేర్ కార్ క్లినిక్ సర్వీస్ క్యాంపైన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్యాంపైన్ డిసెంబర్ 14వ తేదీ నుండి ప్రారంభమై డిసెంబర్ 23, 2020 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉన్న 1288 కి పైగా అధీకృత హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లు ఈ క్యాంపైన్‌లో పాల్గొంటున్నాయి. ఈ సమయంలో హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లకు తీసుకువచ్చే వాహనాల సర్వీస్ మరియు స్పేర్స్‌పై కంపెనీ ప్రత్యేకమైన తగ్గింపులను అందిస్తోంది.

లేబర్ చార్జీలు, విడిభాగాలు మరియు యాక్ససరీలపై ఈ తగ్గింపులు వర్తిస్తాయి. ఇందుయా హ్యుందాయ్ కస్టమర్లు రిసెప్షన్ డెస్క్‌కు కాల్ చేయడం ద్వారా లేదా హ్యుందాయ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కానీ తమ అపాయింట్‌మెంట్‌ను ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్ సర్వీస్ క్యాంపైన్‌లో భాగంగా, కంపెనీ తమ కస్టమర్లకు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో కస్టమర్లు ఉచితంగా ఒక సంవత్సరం పొడిగించిన వారంటీ (లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడిన 200 మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది)ని కూడా పొందే అవకాశం ఉంది.

అంతేకాకుండా, కంపెనీ కాంప్లిమెంటరీ అమెజాన్ వోచర్లు లేదా 2,000 రూపాయల విలువైన ఇంధన కూపన్లను (1,000 మంది వినియోగదారులకు మాత్రమే) కూడా కంపెనీ అందించనుంది. ఈ సమయంలో సర్వీస్ కోసం వచ్చే ప్రతి కారుకు ఉచిత ఎక్స్టీరియర్ వాష్‌ను కూడా అందిస్తోంది.
MOST READ:దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ ; వివరాలు

వాహనాల మరమ్మత్తులో అవసరమయ్యే మెకానికల్ భాగాలపై 10 శాతం తగ్గింపును మరియు లేబర్ చార్జీలపై 20 శాతం తగ్గింపును కంపెనీ అందిస్తోంది. అదే సమయంలో, అన్ని విలువ ఆధారిత సేవలపై (వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్)పై కస్టమర్లకు 20 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

పైన పేర్కొన్న సమయంలో హ్యుందాయ్ ఆధీకృత సర్వీస్ సెంటర్లకు వచ్చే అన్ని వాహనాల కోసం కాంప్లిమెంటరీ 50 పాయింట్ కార్ చెకప్ కూడా చేయబడుతుంది. ఒకవేళ కస్టమర్లు తమ వాహనాన్ని సర్వీస్ సెంటర్‌కు తీసుకురాలేక పోయినట్లయితే, డీలర్‌షిప్‌ల వద్ద డ్రైవర్ లభ్యతను బట్టి వారి వాహనాన్ని సదరు కస్టమర్ పేర్కొన్న లొకేషన్‌లో పికప్ చేసుకోవటం లేదా డ్రాప్ చేయటం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ ఈ డిసెంబర్ 2020 నెలలో భాగంగా, ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ విక్రయిస్తున్న శాంత్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా మరియు ఎలంట్రా మోడళ్లపై నగదు తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ అందిస్తున్న ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లలో కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి కస్టమర్లు గరిష్టంగా రూ.1 లక్ష వరకు విలువై ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 31, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయి. - మోడల్ వారీగా లభిస్తున్న ఆఫర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు