సరికొత్త కియా ఎమ్‌పివి టీజర్ విడుదల, మారనున్న కార్నివాల్ రూపురేఖలు!
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఓ సరికొత్త ఎమ్‌పివి టీజర్‌ని ఆవిష్కరించింది. ఈ కంపెనీ అందిస్తున్న కార్నివాల్ ఎమ్‌పివిలో ఓ కొత్త తరం మోడల్‌ని మార్కెట్లోకి తీకురావటానికి సూచకంగా కాన్సెప్ట్ డిజైన్ టీజర్‌ను కియా విడుదల చేసింది.

ఈ ఏడాది చివరి నాటికి కియా మోటార్స్ తమ 2020 కార్నివాల్ ఎమ్‌పివిని ప్రపంచానికి పరిచయం చేయనుంది. గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన కొద్ది రోజులకే నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివాల్ అంతర్జాతీయ విపణిలో విడుదల కానుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కార్నివాల్ ఎమ్‌పివితో పోల్చుకుంటే మరించ ఫ్యూచరిస్టిక్ లుక్, లగ్జరీ అండ్ కంఫర్ట్ ఫీచర్లతో ఈ కొత్త ఎమ్‌పిని డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంనజ్లలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి.

భారత్‌లో అమ్ముడవుతున్న కియా కార్నివాల్ ఎమ్‌పివిని అంతర్జాతీయ మార్కెట్లలో కియా సెడోనా పేరుతో విక్రయిస్తున్నారు. ఈ టీజర్ ఇమేజ్‌ని చూస్తుంటే, సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో మరింత అధునాతంగా కనిపించేలా ఈ ఎమ్‌పివిని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత షార్ప్ స్టయిలింగ్, మోడ్రన్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది.

కియా బ్రాండ్ సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్‌ను అలాగే ఉంచుతూ, ఆ గ్రిల్‌లో కలిసి పోయినట్లుగా ఉండేలా అనిపించే సన్నటి ఎల్‌ఈడి హెడ్‌లైట్ల డిజైన్‌ను ఈ టీజర్‌లో చూడొచ్చు. హెడ్‌లైట్ క్లస్టర్‌లోనే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా జోడించారు.

సైడ్ ప్రొఫైల్‌ని మరీ గంభీరంగా లేకుండా సింపుల్ బాడీ లైన్స్‌తో ఉంచారు. స్లైడింగ్ డోర్స్ కారణంగా సైడ్స్‌లో అతి తక్కువ స్టయిలింగ్‌తో క్లీన్ డిజైన్ ఉండబోతోందని అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కార్నివాల్ మాదిరిగానే అన్ని పిల్లర్లను కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో చేయనున్నారు, ఫలితంగా ఇది ఫ్లోటింగ్ రూఫ్‌ని తలపిస్తుంది.

ఈ టీజర్ ఇమేజ్ మినహా కియా మోటార్స్ తమ సరికొత్త కార్నివాల్ ఎమ్‌పివికి సంబంధించి ఎలాంటి ఇతర సమాచారాన్ని విడుదల చేయలేదు. అయితే, ఇంటీరియర్లలో మాత్రం పూర్తిగా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. డ్యాష్ బోర్డ్ మొదలుకొని రియర్ సీట్స్ వరకూ పలు రకాలు మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.

నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివాల్ ఎమ్‌పివిలో ఎలాంటి ఇంజన్లను ఉపయోగించనున్నారనే విషయాన్ని కంపెనీ గోప్యంగా ఉంచింది. అయితే, ఇందులో ఏషియన్ మార్కెట్ల కోసం అప్‌డేటెడ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం సొరెంటోలో ఉపయోగిస్తున్న 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొద్దిగా ట్యూన్ చేసి కొత్త కార్నివాల్ ఉపయోగించవచ్చని అంచనా.

ఇక భారత్ విషయానికి వస్తే.. కియా మోటార్స్ గడచిన ఫిబ్రవరిలోనే తమ కొత్త కార్నివాల్ ఎమ్‌పివిని ఆటో ఎక్స్‌పో 2020 వేదికగా దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. భారత మార్కెట్లో కియా కార్నివాల్ అతి తక్కువ సమయంలో అశేష ఆదరణ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివాల్ ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైనా, భారత్‌లో ఇది విడుదల కావటానికి మరికొంత అదనపు సమయం పట్టే ఆస్కారం ఉంటుందని అంచనా.

నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివాల్ ఎమ్‌పివి టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఈ టీజర్ ఇమేజ్‌ని బట్టి చూస్తుంటే, కొత్త తరం కియా కార్నివాల్ ఎమ్‌పివి సరికొత్త టెక్నాలజీ, డిజైన్, ఇంటీయర్, కంఫర్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియా మోటార్స్‌కు భారత్‌లోనే ఉత్పత్తి కేంద్రం ఉన్న నేపథ్యంలో, ఈ మోడల్ ధర కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








