Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా కార్లపై ఇండిపెండెన్స్ డే ఆఫర్లు
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అందిస్తున్న ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని మోడళ్లపై ఆగస్ట్ నెల ఆఫర్లలో భాగంగా భారీ డిస్కౌంట్‌లను మరియు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ అల్ట్యురాస్ జి4 ప్రీమియం-ఎస్‌యూవీపై అత్యధికంగా ఈ ఆగస్టు నెలలో రూ.3.65 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తున్నారు.

ఆగస్ట్ నెలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ఆఫర్‌లలో భాగంగా, నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు బ్రాండ్ లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై కార్పొరేట్ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2020 వరకు చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా కెయువి 100
మహీంద్రా కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి బ్రాండ్ లైనప్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్. ఈ మోడల్‌పై కంపెనీ ఆగస్ట్ నెలలో కంపెనీ మొత్తం రూ.62,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.33,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ.5,000 ఇతర ఆఫర్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి.
MOST READ:మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

మహీంద్రా ఎక్స్‌యూవీ 300
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 బ్రాండ్ పోర్ట్‌ఫోలియో నుండి లభిస్తున్న కాంపాక్ట్-ఎస్‌యూవీ ఇది. ఈ ఎస్‌యూవీపై మొత్తం రూ.29,500 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,500 కార్పోరేట్ బోనస్‌లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో ఎస్‌యూవీపై కంపెనీ రూ.13,500 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.3,500 కార్పోరేట్ బోనస్‌లు ఉన్నాయి. బొలెరోని అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి.
MOST READ:మీకు తెలుసా.. ఈ కార్ ఒకే ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణిస్తుంది

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న మరో మోడల్ స్కార్పియో ఎస్‌యూవీ. కంపెనీ ఇటీవలే ఇందులో బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మోడల్‌పై కంపెనీ ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.

ఈ ఎస్‌యూవీపై మొత్తం రూ.60,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 కార్పోరేట్ బోనస్ ఉన్నాయి. అదనంగా, ఇందులోని ఎస్5 వేరియంట్‌పై మహీంద్రా రూ.20,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.
MOST READ:వైకల్యాన్ని అధిగమించి స్కూటర్ తయారుచేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా ?

మహీంద్రా ఎక్స్‌యూవీ 500
మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఎస్‌యూవీపై వేరియంట్‌ను బట్టి రూ.48,800 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. వీటితో పాటు ఈ ఎస్‌యూవీపై అదనంగా రూ.14,800 ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు.

మహీంద్రా అల్టురాస్ జి 4
మహీంద్రా అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ అల్ట్యురాస్ జి4పై ఈ నెలలో కంపెనీ అత్యధికంగా రూ.3.05 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.2.4 లక్షల నగదు తగ్గింపు, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 కార్పోరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి.
MOST READ:వర్షంలో ఒకే చోట 8 గంటలు నిలబడిన వృద్ధ మహిళ, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

సరికొత్త థరం మహీంద్రా థార్ విడుదల
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహీంద్రా తమ కొత్త తరం 2020 థార్‌ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. దేశంలో విస్తృతంగా పరీక్షించిన మీదట ఈ న్యూ-జెన్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీని కంపెనీ ఎట్టకేలకు ఆగస్టు 15, 2020వ తేదీన డిజిటల్ ఈవెంట్ రూపంలో ఆవిష్కరించనున్నారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మహీంద్రా ఆగస్ట్ నెల ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మహీంద్రా తన లైనప్‌లోని అన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు మరియు ప్రయోజనాలను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవంలో అమ్మకాలను పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్లో మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీతో సహా మరికొన్ని ఇతర మోడళ్లను కంపెనీ ఇంకా అప్‌డేట్ చేయాల్సి ఉంది. ఇందులో కొత్త థార్‌ను 15వ తేదీన ప్రదర్శించనున్నారు.