మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు
'మారుతి సుజుకి' అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు 'ఎస్-ప్రెసో'లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను సైలెంట్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్-సిఎన్‌జి టెక్నాలజీతో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ అమర్చిన ఎస్-ప్రెసో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ప్రారంభ ధర రూ .4.84 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

మారుతి సుజుకి దేశీయ విపణిలో విక్రయిస్తున్న సిఎన్‌జి కార్లలో ఎస్-ప్రెసో సిఎన్‌జి తాజాగా వచ్చి చేరిన కొత్త మోడల్. కంపెనీ ఇప్పటికే వ్యాగన్ఆర్, ఆల్టో, ఎర్టిగా, మొదలైన మోడళ్లలో కూడా సిఎన్‌జి పవర్డ్ వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఓ) అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

ఇందులో బేస్ వేరియంట్ ఎస్-ప్రెసో సిఎన్‌జి ఎల్ఎక్స్ఐ ధర రూ.4.84 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ఎస్-ప్రెసో సిఎన్‌జి విఎక్స్ఐ (ఓ) ధర రూ.5.13 లక్షలుగా ఉంది. మిడ్-స్పెక్ వేరియంట్లయిన ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) ధర రూ.4.90 లక్షలు మరియు విఎక్స్ఐ వేరియంట్ ధర రూ.5.07 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ).

కొత్త మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్లో 998సీసీ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. సిఎన్‌జితో పనిచేసే ఈ ఇంజన్ గరిష్టంగా 5500rpm వద్ద 58bhp శక్తిని మరియు 3500rpm వద్ద 70Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

అదే పెట్రోల్ ఇంజన్‌తో పోల్చినట్లయితే, పెట్రోల్ శక్తితో పనిచేసే మోడల్ 5500rpm వద్ద 67bhp శక్తిని మరియు 3500rpm వద్ద 90Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిఎన్‌జి వేరియంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాకపోతే, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో ఆప్షనల్‌గా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు.

మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ బిఎస్ 6-కంప్లైంట్ మరియు 55 లీటర్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. మారుతి సుజుకి పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ కేజీకి 31.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఈ సిఎన్‌జి వెర్షన్ మారుతి సుజుకి ఎస్-ప్రెసో కారులో ఇంజన్ మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్లలో లభించే అన్ని ఫీచర్లు, సదుపాయాలు ఇందులో కూడా లభిస్తాయి.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి వెర్షన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
సిఎన్‌జి విరివిగా లభించే మెట్రో నగరాల్లో ఈ మోడళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. సిఎన్‌జి ఇంధనం తక్కువ ధరకు లభించడమే కాకుండా, పెట్రోల్/డీజిల్ కార్ల కన్నా అధిక మైలేజీని ఆఫర్ చేస్తాయి. మారుతి సుజుకి ఇప్పటికే వ్యాగన్ఆర్, ఆల్టో, ఎర్టిగా మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను ఆఫర్ చేస్తుండగా, ఈ జాబితాలోకి తాజాగా ఎస్-ప్రెసో వచ్చి చేరింది. ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ శాంత్రో కారుతో పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications








