మారుతి కార్లపై జూన్ నెల ఆఫర్స్ - స్పెషల్ డిస్కౌంట్స్
మారుతి సుజుకి ఇండియా తమ వినియోగదారుల కోసం జూన్ నెల ఆఫర్లను ప్రకటించింది. ఈనెలలో మారుతి సుజుకి కారును కొనుగోలు చేసే కస్టమర్లు రూ.30,000 వరకూ (మోడల్‌ను బట్టి) ప్రయోజనాలను పొందవచ్చు. కంపెనీ అందిస్తున్న నెక్సా సిరీస్ మోడళ్లయిన సియాజ్, ఎక్స్ఎల్6, బాలెనో మకియు ఇగ్నిస్ కార్లపై ఈ ప్రయోజనాలను అందిస్తున్నారు. డీలరును బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉంది.

కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి 'మారుతి సుజుకి ఎక్స్ఎల్6' పై రూ.10,000ల ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో కె15బి 1.5 లీటర్, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104.69 బిహెచ్‌పిల శక్తిని మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 138 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ స్టాండర్డ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో డ్యూయెల్ బ్యాటరీతో కూడిన మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. దురదృష్టవశాత్తు ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

'మారుతి సుజుకి సియాజ్' సెడాన్ కారుపై కంపెనీ గరిష్టంగా రూ.35,000 వరకూ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారులో మారుతి సుజుకి స్వతహాగా అభివృద్ధి చేసిన తొలి 1.5 లీటర్ కె15-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పిల శక్తిని, 138 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇక 'మారుతి సుజుకి బాలెనో' హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే.. ఈ చిన్న కారుపై రూ.28,000 తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు. ఈ కారులో 1.2 లీటర్ వివిట పెట్రోల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వివిటి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండూ వరుసగా 81.8 బిహెచ్‌పి మరియు 88.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి రెండూ ఒకరేకమైన టార్క్ (113 ఎన్ఎమ్)ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో వివిటి ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది. డ్యూరాజెట్ డ్యూయెల్ వివిటి మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ ఆఫర్లలో చివరగా, కాంపాక్ట్ కారైన 'మారుతి సుజుకి ఇగ్నిస్' మోడల్‌పై గరిష్టంగా రూ.28,000 వరకూ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నారు. ఈ కారులో కూడా 1.2 లీటర్ బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని మరియు 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో ఆప్షనల్ 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కోవిడ్-19 తర్వాత దేశంలో కార్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది. పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు కూడా తమ కార్లపై మంచి డిస్కౌంట్‌లను వివిధ ఇతర ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశంలోని వివిధ మారుతి సుజుకి డీలర్లు కూడా పలు మోడళ్లపై వేరియంట్‌ను బట్టి తగ్గింపులను అందిస్తున్నారు. మీరు కూడా మారుతి కార్లను కొనే ఆలోచన ఉంటే డీలర్ల వద్ద బేరమాడటానికి సంకోచించకండి.


Click it and Unblock the Notifications








