మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ స్మాల్ కార్ 'సెలెరియో' (Celerio) లో కంపెనీ సైలెంట్‌గా ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బిఎస్6 నిబంధనలకు అనుకూలంగా మోడిఫై చేసిన ఇంజన్‌తో మారుతి సుజుకి సెలెరియో బిఎస్6 సిఎన్‌జి మోడల్‌ను రూ.5.61 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ప్రవేశపెట్టింది.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ సెలెరియోతో పోల్చుకుంటే ఈ సిఎన్‌జి వెర్షన్ సెలెరియో ధర రూ.81,000 అధికంగా ఉంటుంది. సెలెరియో సిఎన్‌జి వెర్షన్ రెండు వేరియంట్లలో (విఎక్స్ఐ, విఎక్స్ఐ(ఆప్షనల్)) లభ్యం కానుంది. ఇవి రెండు మిడ్-స్పెక్ వేరియంట్లు.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ రెండు వేరియంట్లతో పాటుగా 'మారుతి సెలెరియో టూర్' అనే కొత్త వేరియంట్‌ను కూడా సిఎన్‌జి ఆప్షన్‌తో విడుదల చేశారు. కాకపోతే, ఇది కేవలం టాక్సీ ఆపరేటర్లకు మాత్రమే పరిమితం చేశారు. సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్ మినహా కొత్త సెలెరియోలా ఎలాంటి అదనపు మార్పులు చేర్పులు లేవు.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

పెట్రోల్ వెర్షన్ సెలెరియో కార్లలో లభించే అన్ని ఫీచర్లను సిఎన్ వెర్షన్ సెలెరియోలో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఇదివరకటి 1.0 లీటర్ ఇంజన్‌నే బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా రీఫైన్ చేశారు. సిఎన్‌జి ఇంధనంతో నడిచే ఈ ఇంజన్ గరిష్టంగా 58 బిహెచ్‌పిల శక్తిని, 79 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

అదే పెట్రోల్ వెర్షన్ ఇంజన్ అయితే గరిష్టంగా 68 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌తో పోల్చుకుంటే సిఎన్‌జి వెర్షన్ పెర్ఫార్మెన్స్ పరంగా తక్కువే అయినప్పటికీ, మైలేజ్ విషయంలో మాత్రం సిఎన్‌జి వెర్షనే బెటర్‌గా ఉంటుంది.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి సెలెరియో కారులో ముందు వైపు, వెనుక వైపు డోర్లకు అన్ని పవర్ విండోస్ ఉంటాయి. ఇంకా ఇందులో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, హై-స్పీడ్ అలెర్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి కీలకమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి అందిస్తున్న సిఎన్‌జి వెర్షన్లలో సెలెరియో కారే ముందుగా లేటెస్ట్ బిఎస్6 సిఎన్‌జి ఇంజన్‌ను పొందింది. వ్యాగన్ఆర్, ఆల్టో, ఎర్టిగా వంటి కార్లు కూడా ఎస్-సిఎన్‌జి టెక్నాలజీతో లభిస్తున్నాయి. త్వరలోనే ఈ మోడళ్లలో కూడా బిఎస్6 వెర్షన్లను విడుదలయ్యే అవకాశం ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి మొత్తం లక్ష సిఎన్‌జి కార్లను విక్రయించి కొత్త మైలురాయిని అధిగమించింది.

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సిఎన్‌జి ఇంధనం అందుబాటులో ఉండే నగరాల్లో ఉండే వారికి సిఎన్‌జి ఇంజన్ కలిగిన కార్లు నిజంగా ఓ గొప్ప వరమనే చెప్పాలి. ఇవి పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా స్వచ్ఛమైన కార్లు, తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు అధిక మైలేజీనిస్తాయి. కొత్త సెలెరియో సిఎన్‌జి ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్‌కు పోటీ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 13, 2020, 16:28 [IST]
English summary
Maruti Suzuki has launched the S-CNG variant of its Celerio hatchback in the Indian market. The new Maruti Suzuki Celerio BS6 CNG model is offered at a starting price of Rs 5.61 lakh, ex-showroom (Delhi). This translates to a difference of Rs 81,000 compared to the hatchback's petrol-powered counterparts. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+