Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్పుడే అమ్ముడైపోయిన ఎమ్‌జి గ్లోస్టర్; కొత్తది కావాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే!
చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో విడుదల చేసిన తమ ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీ మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడుపోయినట్లు ప్రకటించింది. ఈ మోడల్ కోసం ఇప్పటికే భారత్‌లో 2000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయని, వీటిని సప్లయ్ చేయటానికి ప్రస్తుత సంవత్సరం సరిపోతుందని కంపెనీ పేర్కొంది.

ఇకపై కొత్తగా బుకింగ్ చేసుకునే వారు మాత్రం తమ ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీని అందుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ వేచి ఉండక తప్పదు. ఎమ్‌జి మోటార్స్ తమ గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీని అక్టోబర్ 2020లో మార్కెట్లో ప్రవేశపెట్టింది. మార్కెట్లో విడుదలైన కేవలం ఒక్క నెలలోనే గ్లోస్టర్ ఎస్‌యూవీ మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయింది.

బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో, ఈ సెగ్మెంట్లో కెల్లా సరసమైన ధరకే ఎమ్‌జి గ్లోస్టర్‌ను మార్కెట్లో విడుదల చేశారు. దీని అగ్రెసివ్ ధర కారణంగా ఎమ్‌జి గ్లోస్టర్ దేశీయ మార్కెట్ నుండి అనూహ్య స్పందనను పొందింది. భారత మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ పరిచయ ప్రారంభ ధర రూ.28.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించారు. ఈ మోడల్‌ను సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ అనే నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ శావీ ధర రూ.35.38 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.
MOST READ:ఇష్టమైన కారు ఆకారంలో వాటర్ ట్యాంక్ నిర్మించిన కారు ప్రేమికుడు.. ఎక్కడో తెలుసా ?

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో హై-ఎండ్ డ్రైవర్-అసిస్టెడ్ లెవల్ 1 అటానమస్ సిస్టమ్‌ను ఉంటుంది. దీని సాయంతో డ్రైవర్ చాలా తక్కువ ప్రయత్నంతో ఆటో పార్క్ అసిస్ట్‌ను ఉపయోగించి పెద్ద గ్లోస్టర్ ఎస్‌యూవీని విజయవంతంగా పార్క్ చేయవచ్చు. అటానమస్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్‌లో భాగమైన ఇతర ఫీచర్లలో ఆటో పార్క్ అసిస్ట్, ఆటో బ్రేకింగ్, కొల్లైజన అవైడెన్స్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ బ్రాండ్ యొక్క అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడిఏఎస్) టెక్నాలజీలో భాగంగా ఉంటాయి.

ఏడిఏఎస్ టెక్నాలజీతో పాటు, ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఆల్‌రౌండ్ ఎల్ఈడి లైటింగ్, 19 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫాగ్ లాంప్స్, డబుల్ బారెల్ క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్ మొదలైన ఫీచర్లతో లభిస్తుంది.
MOST READ:దీపావళి ఆఫర్స్ ప్రకటించిన హీరో మోటోకార్ప్

గ్లోస్టర్ ఇంటీరియర్స్‌లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇరువైపులా అనలాగ్ డయల్‌లతో కూడిన 8 ఇంచ్ ఎమ్ఐడి డిస్‌ప్లే కూడా ఉంటుంది.

ఇంకా ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ముందు మరియు వెనుక ప్రయాణీకులకు వ్యక్తిగత వాతావరణ నియంత్రణ (టెంపరేచర్ కంట్రోల్ యూనిట్), పానోరమిక్ సన్‌రూఫ్, పడల్ ల్యాంప్స్, 12 వోల్ట్ సాకెట్‌లతో పాటు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.
MOST READ:హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

వేరియంట్‌ను బట్టి ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీని రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. ఇందులో మధ్య-వరుసలో రెండు కెప్టెన్ సీట్లు లేదా ఒక బెంచ్ సీట్ ఆప్షన్‌తో మొత్తం సిక్స్ లేదా సెవన్ సీట్స్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీని అగేట్ రెడ్, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 216 బిహెచ్‌పి శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో సింగిల్ టర్బో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పి శక్తిని మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు జెడ్ఎఫ్ నుండి గ్రహించిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.
MOST READ:కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, ఏంటో తెలుసా ?

ఎమ్‌జి గ్లోస్టర్ మొదటి బ్యాచ్ సోల్డ్ అవుట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురాస్ జి4 వంటి మోడళ్లతో పోటీగా నిలుస్తుంది. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే అనేక పాపులర్ బ్రాండ్లు ఉన్నప్పటికీ, లేటెస్ట్‌గా వచ్చిన గ్లోస్టర్ దాని అద్భుతమైన ఫీచర్లు మరియు సరసమైన ధర కారణంగా ఈ పోటీలో ముందంజలో కొనసాగుతోంది.