గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ ఈ ఏడాది తన కొత్త పుల్ సైజ్ ఎస్‌యూవీ ఎంజి గ్లోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా దేశీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ అయినా ఈ ఎంజి మోటార్స్ కంపెనీ ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టింది.

గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

ఇవి కాకుండా 6 సీట్లు, 7 సీట్ల ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీని మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ నాలుగు వేరియంట్లలో సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు సావి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్పర్మేషన్ ప్రకారం, ఈ పుల్ సైజ్ ఎస్‌యూవీని డెలివరీ చేయడం కంపెనీ ప్రారంభించింది.

గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

ఎంజి గ్లోస్టర్ యొక్క బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుండి 2 వేల యూనిట్లను దాటింది మరియు సంస్థ యొక్క అదనపు సమాచారం ప్రకారం, ఈ సంవత్సరానికి ఎంజి గ్లోస్టర్ అమ్మకాలు పూర్తయ్యాయి. కంపెనీ ఈ ఎస్‌యూవీని రూ. 29.98 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరతో ప్రారంభించింది.

గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 35.58 లక్షల రూపాయలు. ఈ 7 సీట్ల లగ్జరీ ఎస్‌యూవీ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధరను ఎంజి మోటార్స్ ఇటీవల లక్ష రూపాయల వరకు పెంచినట్లు తెలిపింది. అయితే ఈ పెరిగిన ధరతోనే వచ్చే ఏడాదికి బుకింగ్‌లు స్వీకరించబడతాయి.

గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

అదే సమయంలో, దాని మిడ్-స్పెక్ వేరియంట్లయిన స్మార్ట్ మరియు షార్ప్ ధరలను వరుసగా రూ. 50,000 మరియు రూ. 30,000 పెంచారు. ఇది కాకుండా, దాని టాప్-స్పెక్ వేరియంట్ గ్లోస్టర్ సావీ ధరను రూ. 20,000 పెంచినట్లు సమాచారం.

గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, క్వాడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, 19-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, సెగ్మెంట్-ఫస్ట్ అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఇఎస్‌పి, టిసి, హెచ్‌హెచ్‌సి, హెచ్‌డిసి , 360-డిగ్రీ కెమెరా, ప్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, 12 వే పవర్ సర్దుబాటు డ్రైవర్ సీటు వంటివి ఇందులో ఉంటాయి.

గ్లోస్టర్ ఎస్‌యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

ఎంజి గ్లోస్టర్ పెద్ద ప్రీమియం ఎస్‌యూవీ, ఇది 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో సహా ఒకే ఇంజన్ ఎంపికతో కంపెనీ దీన్ని విడుదల చేసింది. ఈ ఇంజన్ 215 బిహెచ్‌పి శక్తిని, 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించబడుతుంది.

Image Courtesy: MG Delhi East And MG Cochin

More from DriveSpark

Article Published On: Friday, November 20, 2020, 19:41 [IST]
English summary
MG Gloster SUV Delivery Begins Sold Out For Current Year Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+