ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

చైనాకు చెందిన ప్రముఖ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ అతి తక్కువ సమయంలోనే మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది. అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షనీయమైన ధరతో వచ్చిన ఎమ్‌జ్ హెక్టర్ ఎస్‌యూవీని కస్టమర్లు ఇప్పుడు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ మోడల్‌కు 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

ఎమ్‌జి మోటార్స్ తమ హెక్టర్ ఎస్‌యూవీని హలోల్‌లోని తమ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఇటీవల ప్రకటించిన లాక్‌డౌన్ నేపథ్యం, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి వలన ఎమ్‌జి హెక్టర్ ఉత్పత్తిలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ మోడల్‌కు వెయింటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

ఎమ్‌జి హెక్టర్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు రాగా ఇప్పటి వరకూ 20,000 లకు పైగా యూనిట్లను కంపెనీ తమ కస్టమర్లకు డెలివరీ చేసింది. అంటే సుమారు 30,000 మందికి పైగా కస్టమర్లు ఇంకా ఈ మోడల్ డెలివరీల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ చేసేందుకు హలోల్ ప్లాంట్‌లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

ఈ ఏడాది ఆరంభంలో ఎమ్‌జి మోటార్స్ తమ హెక్టర్ ఎస్‌యూవీలో బిఎస్6 పెట్రోల్ వెర్షన్ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.12.77 లక్షలుగా ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.44 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. అప్‌డేట్ చేసిన బిఎస్6 పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే కంపెనీ బిఎస్6 డీజిల్ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

బిఎస్6 ఎమ్‌జి హెక్టర్ డీజిల్ వేరియంట్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ .13.88 లక్షల నుంచి రూ .17.77 లక్షల (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

ఇందులోని ఇంజన్ వివరాలను గమనిస్తే, ఎమ్‌జి హెక్టర్‌లోని బిఎస్6 పెట్రోల్ ఇంజన్ 1.5-లీటర్ టర్బో యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 143bhp శక్తిని మరియు 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవెన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

ఇకపోతే, ఇందులో బిఎస్6 డీజిల్ వేరియంట్‌ను గమనిస్తే, ఇందులో 2.0 లీటర్ ఫియట్-సోర్స్డ్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168.4bhp శక్తిని మరియు 350Nm గరిష్ట టార్క్‌ని (బిఎస్ 4 మోటారు మాదిరిగానే ఉంటుంది) ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

ఈ చైనా ఎస్‌యూవీని తెగ కొనేస్తున్నారు, ఇప్పటికే 50,000 లకు పైగా బుకింగ్స్

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ 50,000 యూనిట్ల బుకింగ్‌లను రిసీవ్ చేసుకోవటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అత్యంత సరసమైన ధరతో సెగ్మెంట్లో కెల్లా అధునాతనమై ఫీచర్లతో ఎమ్‌జి హెక్టర్ మార్కెట్లో విడుదలైంది. ఈ ఫుల్లీ ఫీచర్డ్ కారు కొనుగోలుదారులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటోంది. ఎమ్‌జి హెక్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లోని కియా సెల్టోస్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 3, 2020, 13:06 [IST]
English summary
MG Motors launched the all-new Hector last year in the Indian market. Soon enough, the SUV started gaining a lot of traction due to its attractive pricing. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+