ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

ఎంజి మోటార్ భారత మార్కెట్లో ఒక సంవత్సరానికి పైగా ఉంది మరియు సంస్థ కొత్త బ్రాండ్‌గా స్థిరపడింది. ఎంజి మోటార్ లాక్‌డౌన్‌లో కూడా అమ్మకాలలో మంచి పనితీరుని కనపరిచింది. ఎంజి మోటార్ గత నెలలో తన కొత్త మోడల్ హెక్టర్ ప్లస్‌ను విడుదల చేసింది.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

ఎంజి మోటార్ జూలై 2020 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం కంపెనీ గత నెలలో 2,105 యూనిట్లను విక్రయించింది. గతేడాది జూలైలో కంపెనీ 1508 వాహనాలను విక్రయించింది. దీనివల్ల ఈ ఏడాది అమ్మకాలు 40% పెరిగాయి.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

ఎంజి మోటార్ ప్రస్తుతం హెక్టర్ ఎస్‌యూవీ మరియు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ని విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్స్ బాగా అమ్ముడవుతున్నాయి. అమ్మకాలలో హెక్టర్ ఎస్‌యూవీ అగ్రస్థానంలో ఉండగా, ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో జెడ్‌ఎస్ ఇవి బాగా అమ్ముడవుతోంది.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

అనేక స్థాయిల లాక్ డౌన్ కారణంగా ఆటోమొబైల్ మార్కెట్ అనిశ్చితంగా ఉందని కంపెనీ సేల్స్ డైరెక్టర్ తెలిపారు. ఇది చెన్నైలో విడిభాగాల సరఫరాను ప్రభావితం చేసింది. ఈ సవాళ్లన్నీ ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం కొంత ఎక్కువగానే ఉన్నాయి.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

ఎంజీ మోటార్ తన మూడవ మోడల్ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని గత నెలలో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.13.49 లక్షలు కాగా, ఇందులో టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 18.54 లక్షలు.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

ఈ ఎస్‌వియును నాలుగు మోడళ్లలో కంపెనీ విడుదల చేసింది. ఎంజి మోటార్ కొత్త ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని మూడు ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఈ ఇంజన్లలో పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ ఇంజన్లు ఉన్నాయి. 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 143 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

డీజిల్ మరియు హైబ్రిడ్ మోడళ్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండగా, పెట్రోల్ మోడల్‌లో డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఎంజి హెక్టర్ ప్లస్‌లో హెక్టర్ కంటే కొంచెం ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి.

ఎంజి మోటార్స్ జులై అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా ?

ఎంజీ హెక్టర్ ప్లస్‌లో 10.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ ఎసి కంట్రోల్, థర్డ్ రో ఎసి వెంట్ మరియు యుఎస్‌బి పోర్ట్‌లను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 1, 2020, 19:17 [IST]
English summary
MG Motor releases sales report for the month of July 2020. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+