పెట్రోల్ ఇంజన్‌తో ఎమ్‌జి జిఎస్ ఎస్‌యూవీ; బ్రాండ్ నుండి భారత్‌లో ఐదవ మోడల్!
ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్ కోసం తమ ఐదవ ఉత్పత్తిని కూడా సిద్ధం చేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే, ఎమ్‌జి హెక్టర్, హెక్టర్ ప్లస్ మరియు జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత్‌లో విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే ఎమ్‌జి మోటార్స్ నాల్గవ ప్రోడక్ట్ గ్లోస్టర్ కూడా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో, కంపెనీ భారత్‌లో తమ ఐదవ ఉత్పత్తిగా మరో ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎమ్‌జి మోటార్స్ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ వెర్షన్ ఎమ్‌జి జిఎస్ మోడల్‌లో కంపెనీ ఓ పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

పెట్రోల్‌తో నడితే ఎమ్‌జి జిఎస్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా ఆటోకార్ఇండియా లీక్ చేసిన చిత్రాల ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ భారతదేశంలో జిఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టింగ్ వాహనంపై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఉండటాన్ని చూస్తుంటే, ఇది ఉత్పత్తి సిద్ధంగా ఉన్న మోడల్‌గా కనిపిస్తోంది.

వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఇంతకుముందు లీకైన డాక్యుమెంట్ ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ దేశంలో జిఎస్ మోడల్‌ను పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసే అకాశం ఉందని కూడా వెల్లడైంది. ఎమ్‌జి మోటార్స్ ఇప్పటికే ఈ ఎస్‌యూవీ వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విభిన్న ఇంజన్ ఆప్షన్లతో కంపెనీ విక్రయిస్తోంది.

ఈ ఇంజన్ ఆప్షన్లలో ఒకటి 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్, ఇది గరిష్టంగా 109.4 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు ఇప్పటికే యూరో- VI ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఇవి మనదేశంలో బిఎస్6 నిబంధనలకు సమానమైన ఉద్గార ప్రమాణం. దీన్ని బట్టి చూస్తుంటే, ఎమ్‌జి మోటార్స్ ఈ రెండు ఇంజన్ ఆప్షన్లను భారత మార్కెట్లో విడుదల చేయటానికి లైన్ క్లియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికొస్తే, సాంప్రదాయ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే గ్లోబల్-స్పెక్ మోడల్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ మాత్రం సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. భారత మార్కెట్లో విడుదలయ్యే మోడల్‌లో కూడా ఇదే రకమైన గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చని అంచనా.

ఎమ్‌జి జిఎస్ గ్లోబల్ వెర్షన్ ఎస్‌యూవీలో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌లతో కూడిన బ్రాండ్ యొక్క సిగ్నేచర్ హనీకోంబ్ గ్రిల్ ఉంటుంది. రెండు చివర్లలో ఉంచిన అల్యూమినియం స్కిడ్ ప్లేట్‌లతో వ్రాప్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, గ్లోబల్ వెర్షన్ ఎస్‌యూవీలో క్యాబిన్‌కు మరింత ప్రీమియం రూపాన్ని మరియు అనుభూతిని అందించే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క తాజా ఐస్‌మార్ట్ కనెక్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంటుంది.

గ్లోబల్-స్పెక్ మోడళ్లను ఎమ్‌జి బ్రాండ్ పైలట్ డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్‌తో అందిస్తున్నారు, ఇందులో యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అధునాతన సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్లు ఇండియన్ వెర్షన్ జిఎస్‌లో ఉంటాయో లేదో చూడాలి.
ఎమ్‌జి జిఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఎస్‌యూవీలకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎమ్‌జి మోటార్స్ వీలైనంత త్వరగా ఈ మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎమ్‌జి జిఎస్ కారు కొత్త ఇంజన్ ఆప్షన్లతో పాటుగా చూడటానికి ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న జిఎస్ ఈవి ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ మాదిరిగానే అనిపిస్తుంది. ఈ విభాగంలో, ఇది హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








