మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ఆల్ట్రా ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ "మినీ" భారత మార్కెట్లో ఓ కొత్త కన్వర్టిబుల్‌ కారును విడుదల చేసింది. మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్‌ ఎడిషన్‌ పేరిట కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌ను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారతదేశంలోకి దిగుమతి చేసుకోనున్నారు. భారత మార్కెట్లో కేవలం 15 యూనిట్ల మినీ కన్వర్టిబల్ సైడ్ ఎడిషన్ కార్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు.

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

కొత్త మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్ 2007లో తొలిసారిగా ప్రారంభించబడిన ఈ లైన్ యొక్క మొదటి ప్రత్యేక ఎడిషన్ ఆధారంగా రూపొందించబడింది. ఇది స్టాండర్డ్ కన్వర్టిబుల్ మోడల్‌తో పోలిస్తే లోపల మరియు వెలుపల కాస్మెటిక్ మార్పులను కలిగి ఉంటుంది. కంపెనీ స్పెషల్ ఎడిషన్ మోడల్‌కు డీప్ లగున మెటాలిక్ అనే ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌తో పరిచయం చేసింది.

MOST READ:ప్రధాని మోదీ ఉపయోగించనున్న లేటెస్ట్ ప్లైట్ ఇదే.. చూసారా !

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

ఇందులోని సాఫ్ట్-టాప్ ఎలక్ట్రిక్ రూఫ్‌ను స్టాండర్డ్ మోడల్ నుండి గ్రహించారు, ఇది కేవలం 20 సెకన్లలో తెరుచుకుంటుంది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన 17 ఇంచ్ సిజర్ స్పోక్ డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. ఈ పరిమిత ఎడిషన్ మోడల్‌లో రెండు వైపులా ఫ్రంట్-వీల్ వంపు వెనుక ఉంచిన ‘సైడ్‌వాక్ ఎడిషన్' బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది.

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

మినీ సైడ్‌వాక్ ఎడిషన్‌లో ఇతర విలక్షణమైన ఫీచర్లలో బ్రష్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడిన డోర్ సిల్ ఫినిషర్లు, బానెట్‌పై సున్నితమైన పిన్‌స్ట్రిప్స్‌తో కూడిన చారలు దీనికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. ఇంకా ఇందులో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా ?

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

ఇంటీరియర్స్‌లో ‘ఆంత్రాసైట్' లెథర్ సీట్లు, ‘డార్క్ పెట్రోల్' మెటీరయల్‌తో అల్లిన పైపింగ్ మరియు మినీ యువర్స్ లెదర్ లాంజ్ నుండి ‘ఎనర్జిటిక్ ఎల్లో' యాక్సెంట్స్ సీమ్స్ ఉంటాయి. ఈ క్యాబిన్‌కు గొప్ప మరియు ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా హైలైట్ చేయడానికి ఇంటీరియర్‌లకు ప్రత్యేక ప్రకాశం (ఇల్యుమినేషన్) లభిస్తుంది. అదనంగా, స్టీరింగ్ వీల్‌ను లెథర్‌తో చుట్టబడి ఉంటుంది మరియు సైడ్‌వాక్ లోగో మరియు కాంట్రాస్ట్ సీమ్‌లు కూడా ఉంటాయి.

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

ఇంజన్ విషయానికి వస్తే, మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌లో 2.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 191 బిహెచ్‌పి పవర్‌ను మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు పాడిల్ షిఫ్టర్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 7.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 230 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

MOST READ:ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌లో ఎమ్ఐడి మోడ్, స్పోర్ట్ మోడ్ మరియు గ్రీన్ మోడ్ వంటి బహుళ డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. మినీ డ్రైవింగ్ మోడ్‌లు ప్రాధాన్యత ప్రకారం రైడ్ సౌకర్యం, స్పోర్ట్‌నెస్ లేదా సామర్థ్యంపై దృష్టి సారించేలా వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) వెహికల్ సెటప్‌తో వస్తాయి.

మినీ సైడ్‌వాక్ ఎడిషన్‌లో ఉండే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో బహుళ ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, త్రీ-పాయింట్ సీట్ బెల్ట్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రాష్ సెన్సార్, ఏబిఎస్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు రన్-ఫ్లాట్ ఇండికేటర్ మొదలైనవి ఉన్నాయి.

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ, "మినీ ఒక సంక్షోభం నుండి పుట్టింది. ఇది బ్రేవ్ అండ్ డేరింగ్ బ్రాండ్, ఇది ప్రామాణికమైన ఆవిష్కరణ మరియు ఆశాజనకంగా ఉంటుంది. ఇది ప్రజలను మరియు సమాజాలను ఒకచోట చేర్చి, వారికి ప్రత్యేకమైన మరియు వడకట్టని అనుభవాలను కూడా అందిస్తుంది. మినీ కన్వర్టిబుల్‌ సైడ్‌వాక్‌ ఎడిషన్‌, బ్రాండ్ ఫిలాసఫికీ మరియు ప్రస్తుత కాలపు సవాళ్లకు సంపూర్ణ నివాళిగా ఉంటుందని" అన్నారు.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా థార్ : ధర & ఇతర వివరాలు

మినీ కన్వర్టిబల్ సైడ్‌వాక్ ఎడిషన్ విడుదల; ధర వింటే షాక్ అవుతారు!

భారత మార్కెట్లో మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్ ధరను రూ.44.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించారు.

మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మినీ కన్వర్టిబుల్ సైడ్‌వాక్ ఎడిషన్‌ను భారతదేశంలో కేవలం 15 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే దేశంలో కేవలం 15 మంది కస్టమర్ల వద్ద మాత్రమే ఈ విశిష్టమైన మోడల్ ఉండబోతుందన్నమాట. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో కంపెనీ కొన్ని కాస్మెటిక్ మార్పులను కూడా చేసింది. ఇవి కారు యొక్క మొత్తం రూపాన్ని మార్చడంలోనూ మరియు డ్రైవింగ్ అనుభూతిని పెంచడంలోనూ సహకరిస్తాయి.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
MINI has launched a new limited edition variant called the Sidewalk Edition of its Convertible model in the Indian market. The Convertible Sidewalk Edition is priced at Rs 44.90 lakh (ex-showroom, India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X