Just In
Don't Miss
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన న్యూ హోండా సిటీ
యూరో న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కార్ల యొక్క భద్రతను ధృవీకరిస్తుంది. అంతే కాకుండా కంపెనీ కార్ల పూర్తి నాణ్యతను కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రాష్ టెస్ట్ లో న్యూ హోండా సిటీ ఎంత రేటింగ్ సాధించింది అనేదాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..!

కొత్త హోండా సిటీ కారు ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. హోండా సిటీ కారు 5 స్టార్ రేటింగ్‌ను పొందటం ఇది మూడవ సారి.

కొత్త హోండా సిటీ కారు యొక్క ఫ్రంట్ ఆఫ్‌సెట్ ఇంపాక్ట్ మరియు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో గరిష్టంగా 100 లో 86.54 స్కోర్ చేసింది. అడల్ట్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ (ఎఓపి) పై హోండా సిటీ 44.83, ట్రావెలింగ్ చైల్డ్ సేఫ్టీ (సిఓపి) పై 22.85, సేఫ్టీ టెక్నాలజీ (సాట్) పై 18.8 స్కోర్లు సాధించింది.

హోండా తన 2020 సిటీ కారును ఈ నెల 16 న భారతదేశంలో విడుదల చేయనుంది. కానీ కరోనా వ్యాప్తి కారణంగా కొత్త హోండా సిటీ కారు విడుదల వచ్చే నెలకు వాయిదా పడింది.

కొత్త హోండా సిటీ యొక్క కొలతలను గమనించినట్లైతే దీని పొడవు 4,549 మిమీ, వెడల్పు 1,784 మిమీ, ఎత్తు 1,489 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ. కొత్త హోండా సిటీ ప్రస్తుత మోడల్ కంటే చాలా పొడవుగా మరియు వెడల్పును కలిగి ఉంది.

2020 హోండా సిటీ షార్పర్‌లో కారు ముందు మరియు వెనుక భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్లు, హోండా సిగ్నేచర్ క్రోమ్ బార్, కూపే స్టైల్ పైకప్పు మరియు పెద్ద ఓఆర్‌విఎం వంటివి ఉన్నాయి.

కొత్త హోండా కారులో షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ సెగ్మెంట్ మరియు చక్కని బూట్ క్యాప్ ఉన్నాయి. కొత్త హోండా సిటీ కారు లోపలి భాగంలో డ్యూయల్ టోన్ సిస్టమ్, అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
MOST READ:లాక్ డౌన్ ఉన్నప్పటికీ తండ్రి కర్మ క్రియలకు వెళ్లిన వ్యక్తి, ఎలా వెళ్లాడంటే.. ?
ఎంజీ హెక్టర్ మరియు కియా సెల్లోస్‌లలో కనిపించే కనెక్టివిటీ టెక్నాలజీలను ఇందులో చేర్చడం సాధ్యపడుతుంది. హోండా తన ప్రసిద్ధ సిటీ సెడాన్ కారును భారత్‌తో సహా ప్రధాన యూరోపియన్ దేశాలలో కూడా విడుదల చేయనుంది.
కొత్త హోండా సిటీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయుయబడింది. ఈ ఇంజన్ 119 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

కొత్త హోండా సిటీ ఇండియన్ మార్కెట్లో విడుదలైన తరువాత మారుతి సియాజ్, టయోటా యారిస్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.