కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ అందిస్తున్న కార్నివాల్ ఎమ్‌పివిలో కంపెనీ ఓ కొత్త 2021 వెర్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ 'ఇదివరకటి కథనం' లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు కియా మోటార్స్ తమ సరికొత్త 2021 'కార్నివాల్' ఎమ్‌పివిని పూర్తిగా ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా విడుదల చేసింది. ఈ సరికొత్త కియా కార్నివాల్ ఎమ్‌పివి 4వ తరానికి చెందినది.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్లలో అనూహ్యమైన మార్పులు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇప్పుడు సరికొత్త స్టైల్ మరియు ఫీచర్లతో రావటంతో దీనికి ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

ముందుగా ఈ కారు డిజైన్‌ని గమనిస్తే, 2021 కియా కార్నివాల్ మరింత షార్ప్‌గా కనిపించే స్క్వేర్డ్-ఆఫ్ అంచులు మరియు ఆకృతులతో వస్తుంది, ప్రస్తుత తరం మోడల్‌లో ఇవి గుండ్రంగా, సాఫ్ట్ లైన్స్ కలిగి ఉంటుంది. కియా లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌తో తయారైన ఈ కొత్త కారు ఇదివరకటి మోడళ్ల కన్నా మరింత ఎక్కువ రోడ్ ప్రెజన్స్‌ను ఆఫర్ చేస్తుంది, ఇందుకు ఫ్రంట్ స్టయిలింగ్‌కు ధన్యవాదములు.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కొత్త కార్నివాల్ ఎమ్‌పివిలో కూడా అన్ని కియా కార్ల మాదిరిగానే ఈ బ్రాండ్ సిగ్నేచర్ ‘టైగర్-నోస్' గ్రిల్ కనిపిస్తుంది. అయితే, ఇందులో కొత్త డైమండ్ ప్యాటర్న్ గ్రిల్, కారు ముందు భాగానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కారులో పూర్తి కొత్తగా కనిపించే హెడ్‌ల్యాంప్ యూనిట్, కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో పాటుగా వ్రాప్ అరౌండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కనిపిస్తాయి. ముందు భాగంలో ఉన్న ఇతర మార్పులను చూస్తే, బంపర్ క్రింది భాగంలో ఎస్‌యూవీ నుండి స్పూర్తి పొందిన ఫాక్స్ స్కఫ్ ప్లేట్‌తో పాటు సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్స్‌ను జోడించారు.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కొత్త కార్నివాల్ సైడ్ ప్రొఫైల్‌ని కూడా అప్‌డేట్ చేశారు. స్లైడింగ్ డోర్స్ కారణంగా ఈ కారు సైడ్స్‌లో మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, క్రీజ్ లైన్స్ ఇప్పుడు మరింత షార్ప్, ప్రధానంగా కనిపిస్తాయి. కొత్త కార్నివాల్‌ను ఎమ్‌పివి లేదా‘గ్రాండ్ యుటిలిటీ వెహికల్'గా పిలవడానికి ఇష్టపడే కియా, ఇందులో సరికొత్త ఎల్ఈడి టెయిల్ లైట్లను డిజైన్ చేసింది, ఈ రెండు టెయిల్ లైట్స్‌ను మధ్యలో ఓ సన్నటి లైట్ బార్ కలుపుతూ ఉంటుంది.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కియా మోటార్స్ ప్రస్తుతానికి ఎక్స్‌టీరియర్ చిత్రాలను మాత్రమే విడుదల చేసింది, కాబట్టి ఇంటీరియర్స్‌లో ఎలాంటి మార్పులున్నాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మా అంచనా ప్రకారం, క్యాబిన్‌లో కూడా కీలకమైన మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కొత్త కియా కార్నివాల్ ఇంజన్ ఆప్షన్స్‌ని కూడా కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుత తరం కార్నివాల్ ఎమ్‌పివిలో ఉపయోగిస్తున్న 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌, 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లనే కొత్త ఎమ్‌పివిలో కూడా కొనసాగించే ఆస్కారం ఉంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 1.6-లీటర్ హైబ్రిడ్ వెర్షన్ కూడా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

ఈ కొత్త 2021 కియా కార్నివాల్ ముందుగా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది. కియా మోటార్స్ గడచిన ఫిబ్రవరి నెలలో భారత్‌లో ప్రస్తుత తరం కార్నివాల్ ఎమ్‌పివిని విడుదల చేసిన నేపథ్యంలో, ఈ సరికొత్త కార్నివాల్ మన దేశంలో విడుదల కావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఆవిష్కరణ - ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో కియా ఈ ఏడాది ప్రారంభంలో 3వ తరం కార్నివాల్ ఎమ్‌పివిని విడుదల చేయడంతో, ఈ 4వ తరం ఇప్పట్లో మన మార్కెట్లో విడలయ్యే అవకాశాలు లేవు. కాస్తంత ఆలస్యమైన ఈ సరికొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి మాత్రం ఖచ్చితంగా భారత మార్కెట్‌కు వచ్చి తీరుతుంది. ముందుగా కొరియన్ మార్కెట్‌లో విక్రయించబడుతుంది, ఆ తర్వాత ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల అవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2020, 18:10 [IST]
English summary
Kia Motors have released the first set of images unveiling the 2021 Carnival MPV for the global markets. The 2021 Kia Carnival will be the fourth-generation iteration of the premium MPV/minivan once introduced in international markets. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+