సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మహీంద్రా భారత మార్కెట్ కోసం కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి సరికొత్త 2021 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మోడల్ త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోంది.

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

మహీంద్రా ఇప్పటికే, ఈ కొత్త తరం మోడల్‌ను భారత రోడ్లపై పరీక్షిస్తుండగా, అనేక సార్లు కెమెరాకు చిక్కిన సంగతి తెలిసినదే. తాజాగా, ఫేస్‌బుక్‌లో లీకైన స్పై చిత్రాల ప్రకారం, తాత్కాలిక తమిళనాడు నెంబర్ ప్లేట్‌ను కలిగిన ఉన్న కొత్త ఎక్స్‌యూవీ500 వాహనాన్ని కంపెనీ హిమాచల్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. శీతాకాలపు వాతావరణ పరీక్షల నిమిత్తం ఈ మోడల్‌ను మంచు ఉండే ప్రదేశంలో టెస్ట్ చేస్తున్నారు.

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 పూర్తిగా సరికొత్త డిజైన్‌తో రానుంది. ఈ మోడల్‌లో ఇప్పటివరకూ చిన్నపాటి అప్‌డేట్స్ మినహా డిజైన్ పరంగా ఎలాంటి మేజర్ అప్‌గ్రేడ్స్ లేవు. ఈ నేపథ్యంలో, కొత్తగా వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మునుపటి కన్నా మరింత పెద్దగా, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎక్స్‌టీరియర్ ఓవరాల్ డిజైన్‌ను యధావిధిగా చిరుత నుండి ప్రేరణ పొందిన మొదటి తరం మోడల్ డిజైన్ సిల్హౌట్ మాదిరిగానే కొనసాగించే అవకాశం ఉంది. అయితే దీని బోనెట్, బంపర్, గ్రిల్, హెడ్‌ల్యాంర్ సెటప్, అల్లాయ్ వీల్స్ మరియు వెనుక డిజైన్లలో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

ఇంటీరియర్స్‌లో కూడా కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం లెదర్ అప్‌హోలెస్ట్రీ, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, రియర్ ఏసి వెంట్స్, 50:50 స్ప్లిట్ రియర్ సీట్‌తో పాటుగా అనేక ఇతర ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ:మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

ఇంజన్ పరంగా కొత్త తరం ఎక్స్‌యూవీ500లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుత తరం మోడల్‌లో ఉపయోగిస్తున్న అదే 2.0-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లనే కంపెనీ కొత్త తరం మోడల్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది.

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

ఇవే ఇంజన్లను కొత్త తరం మహీంద్రా థార్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రెండు ఇంజన్ల పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. కాగా, కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా లభ్యం కానుంది.

MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో ఇతర మిడ్-సైజ్ ఎస్‌యూవీలైన కియా సెల్టోస్, జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, ఎమ్‌జి హెక్టర్ ప్లస్, ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ మరియు టాటా మోటార్స్ నుండి రానున్న కొత్త టాటా గ్రావిటాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

సరికొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని చూశారా? స్పై పిక్స్

మహీంద్రా థార్ డిస్‌కంటిన్యూ

మహీంద్రా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్‌ను కంపెనీ తాజాగా అప్‌డేట్ చేసింది. ఈ బ్రోచర్ నుండి కంపెనీ తమ 6-సీటర్ బేస్ వేరియంట్ థార్‌ను తొలగించింది. అప్‌డేట్ చేయబడిన బ్రోచర్ ఆధారంగా చూస్తే, కంపెనీ థార్‌లో ఆరు-సీట్ల వేరియంట్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

Most Read Articles

English summary
All-New Mahindra XUV500 Spied Again While Testing; New Details And Spy Pics. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X