మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2020 మహీంద్రా థార్ బ్రోచర్‌ను కంపెనీ తాజాగా అప్‌డేట్ చేసింది. ఈ బ్రోచర్ నుండి కంపెనీ తమ 6-సీటర్ బేస్ వేరియంట్ థార్‌ను తొలగించి వేసింది.

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

అప్‌డేట్ చేయబడిన బ్రోచర్‌లో కంపెనీ థార్ ఎస్‌యూవీ యొక్క ఆరు-సీట్ల బేస్-స్పెక్ ఏఎక్స్ వేరియంట్‌ను పేర్కొనలేదు. మునుపటి నివేదికలు మరియు అప్‌డేట్ చేయబడిన బ్రోచర్ ఆధారంగా చూస్తే, కంపెనీ థార్‌లో ఆరు-సీట్ల వేరియంట్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభంలో మూడు వేరియంట్లలో విడుదల చేశారు. అవి: ఏఎక్స్, ఏఎక్స్ (ఆప్షనల్) మరియు ఎల్ఎక్స్. కాగా, ఇప్పుడు ఇది కేవలం ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ వేరియంట్లలో మాత్రమే లభిస్తోంది.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

ఈ మోడల్ ప్రారంభ సమయంలో దీనిని ఏఎక్స్ వేరియంట్ రూపంలో 6-సీట్ల కాన్ఫిగరేషన్‌తో అందించారు. ముందు వరుసలో రెండు సీట్లు మరియు వెనుక వరుసలో రెండు సైడ్ ఫేసింగ్ సీట్లను జోడించారు. వెనుస వరుసలో ఒక్కోసీటుకి ఇద్దరు చొప్పున నలుగు, ముందు సీట్లలో ఇద్దరు మొత్తం ఆరుగురు ఇందులో ప్రయాణించేందుకు వీలుగా ఉండేది.

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే కంపెనీ ఇందులోని బేస్ వేరియంట్ (ఏఎక్స్) కోసం బుకింగ్స్ స్వీకరించడాన్ని నిలిపివేసింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎక్కువ మంది వినియోగదారులు టాప్-స్పెక్ ఎల్ఎక్స్ వేరియంట్‌ను ఎంచుకుంటున్న నేపథ్యంలో బేస్ వేరియంట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

MOST READ:బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

మరోవైపు ఇటీవల గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఫార్వార్డ్ సీట్లు కలిగిన 4-సీటర్ మహీంద్రా థార్‌ని మాత్రమే ఉపయోగించారు. ఈ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా 6-సీటర్ థార్‌ను నిలిపివేసి ఉండచ్చని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా, మహీంద్రా థార్ వేరియంట్ లైనప్‌లో చేసిన మార్పులపై కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

మహీంద్రా మొదట్లో థార్‌ను రూ.9.80 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. తాజాగా అప్‌డేట్ చేసిన బ్రోచర్ ప్రకారం, ఇప్పుడు థార్ ప్రారంభ ధర రూ.11.90 లక్షలుగా ఉంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎల్ఎక్స్ ధర రూ.13.75 లక్షలుగా ఉంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:మళ్ళీ ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీస్.. ఎప్పటినుండో తెలుసా ?

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో వయోజనుల సేఫ్టీ విషయంలో కొత్త 2020 మహీంద్రా థార్ 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లు సాధించింది. ఇక పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్ల స్కోరును సాధించి మొత్తంగా 4-స్టీర్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ ఎస్‌యూవీని గంటకు 64 కి.మీ వద్ద స్టాండర్డ్ ఫ్రంటల్-ఆఫ్‌సెట్ కొల్లజైన్ క్రాష్ టెస్ట్ నిర్వహించారు. - దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

మహీంద్రా థార్‌ను కొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

ఈ రెండు ఇంజన్లు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కానీ లభిస్తాయి. ఈ రెండు వేరియంట్లు షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి.

మహీంద్రా థార్ 6-సీటర్ డిస్‌కంటిన్యూ; కొత్త బేస్ వేరియంట్ రానుందా?

ఇదిలా ఉంటే మహీంద్రా ఇప్పుడు ఓ కొత్త రకం థార్ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఆన్‌లైన్‌లో లీకైన చిత్రాల ప్రకారం, మహీంద్రా ఓ కొత్త సిల్వర్ కలర్ వేరియంట్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇప్పటి వరకూ మహీంద్రా థార్‌లో కంపెనీ సిల్వర్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టలేదు. బహుశా ఇది కొత్త బేస్ వేరియంట్ అయి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Mahindra To Launch New Base Variant Thar; 6 Seat Variant Discontinued. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X