కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఓ పెర్ఫార్మెన్స్ సెడాన్, ఫుల్-సైజ్ ఎస్‌యూవీ, ఎమ్‌పివిలతో మరికొన్ని కార్లను భారత మార్కెట్లో ప్రదర్శన కోసం ఉంచిన సంగతి తెలిసినదే. ఎమ్‌జి మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో హెక్టర్ ఎస్‌యూవీని మరియు ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూని మాత్రమే విక్రయిస్తోంది. భారత్‌లో మరిన్ని వాహనాలను విడుదల చేసేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ఎమ్‌జి మోటార్స్ గడచిన ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించిన ఎమ్‌జి జి10 (పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్‌ను మాక్సస్ జి10 అని కూడా పిలుస్తారు) ఎమ్‌పివి వాహనాన్ని భారత్‌లో కియా కార్నివాల్ ఎమ్‌పివికి పోటీగా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సరికొత్త తరం 2020 జి10 ఎమ్‌పివిని ఎమ్‌జి మోటార్స్ ఇటీవలే చైనీస్ మార్కెట్లో విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

చైనీస్ మార్కెట్లో విడుదలైన ఎమ్‌జి జి10 ధర భారత కరెన్సీతో పోల్చుకుంటే సుమారు రూ.15 లక్షల వరకూ ఉంటుంది. అయితే, ఇండియన్ మార్కెట్లోకి వచ్చే సరికి దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కియా కార్నివాల్ మాదిరిగానే ఎమ్‌జి జి10 ఎమ్‌పివి కూడా విభిన్న రకాల సీటింగ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. తొమ్మిది మంది కూర్చునేందుకు వీలుగా ఇందులో నాలుగు వరసల సీటింగ్ ఆప్షన్ కూడా లభిస్తుంది.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

భారత మార్కెట్లో కియా కార్నివాల్ ఎమ్‌పివి నేరుగా పోటీనిచ్చేలా ప్రీమియం ఎమ్‌పివి సెగ్మెంట్లో జి10 ఎమ్‌పివిని ఎమ్‌జి మోటార్స్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ఈ చైనీస్ వెర్షన్ ఎమ్‌జి జి10 ఎమ్‌పివి అక్కడి మార్కెట్లో రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అందులో మొదటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 223 బిహెచ్‌పిల శక్తిని మరియు 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ఇకపోతే రెండవది 2.0 డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని మరియు 375 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎమ్‌జి మోటార్స్ కొత్తగా విడుదల చేసిన 2020 ఎమ్‌జి జి10లో 7 మరియు 9 సీటర్లకు అదనంగా కొత్తగా 8-సీటర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులోని ఇంటీరియర్లను కూడా చాలా వరకు మార్చారు.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, వెనుక ప్యాసింజర్లకు కూడా అందుబాటులో ఉండేలా పెద్ద స్ప్లిట్ సన్‌రూఫ్ (రెండు ఉంటాయి), సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్స్ వంటి అనేక ఫీచర్లతో కొత్త 2020 ఎమ్‌జి జి10 ఎమ్‌పివిని అప్‌గ్రేడ్ చేశారు.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ఇకపోతే ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో వచ్చే నెలలో మరో సరికొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ అనే కొత్త వేరియంట్‌ను జులైలో ప్రవేశపెట్టడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీని పొడగించిన బడిన వెర్షన్‌గా హెక్టర్ ప్లస్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో కొత్తగా మూడో వరుస సీటింగ్‌ను జోడించనున్నారు.

కియా కార్నివాల్‌కు పోటీగా ఎమ్‌జి మోటార్స్ జి10 ఎమ్‌పివి!

ఎమ్‌జి మోటార్స్ ఎమ్‌జి జి10 ఎమ్‌పివిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో దేశంలో పర్సనల్ మొబిలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఇలాంటి అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన కార్లకు భారత్‌లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎమ్‌జి మోటార్స్ తమ జి10 ఎమ్‌పివిని భారత్‌లో విడుదల చేసినట్లయితే, ఇది తప్పకుండా కియా కార్నివాల్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లకు పెను సవాల్ విసురుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

More from DriveSpark

Article Published On: Friday, June 12, 2020, 14:30 [IST]
English summary
MG Motor India had showcased a host of new models at the 2020 Auto Expo including performance sedan, full-size SUV, MPV and more. One among the many models that were showcased was the MG G10 which is also called Maxus G10 depending on the market. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+