టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సెప్టెంబర్ నెల ఫెస్టివ్ ఆఫర్లలో భాగంగా తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా, క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

సెప్టెంబర్ నెలలో మొత్తం రూ.80,000 వరకు ప్రయోజనాలు టాటా మోటార్స్ అందిస్తోంది, కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి ఇవి మారుతు ఉంటాయి. టాటా మోటార్స్ డిజిటల్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ 'క్లిక్ టు డ్రైవ్' ద్వారా కూడా కస్టమర్లు ఈ డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా కంపెనీ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

టాటా టియాగో

కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగోపై మొత్తం రూ.32,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో మీ పాత కారును డీలర్‌కు విక్రయించేటప్పుడు రూ.15,000 నగదు తగ్గింపు మరియు రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

వీటితో పాటు, అర్హతను బట్టి రూ.7,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, కోవిడ్-19 వారియర్ల కోసం కంపెనీ రూ.3,000 ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

టాటా టిగోర్

టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్-సెడాన్ టాటా టిగోర్‌పై కంపెనీ రూ.37,000 వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. కస్టమర్ అర్హతను బట్టి రూ.7,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీ మోడళ్లలో టాటా నెక్సాన్ ఒకటి. టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో నెక్సాన్ ముందంజలో ఉంది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్‌లపై కంపెనీ రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు అర్హతను బట్టి రూ.10,000 వరకు అదనపు నగదు తగ్గింపును అందిస్తున్నారు.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌లపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదు. అయితే, టాటా ఉద్యోగులు లేదా కార్పోరేట్ కంపెనీలో పనిచేసే వినియోగదారులకు కంపెనీ గరిష్టంగా రూ.5,000 అదనంగా నగదు తగ్గింపు లభిస్తుంది.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

టాటా హారియర్

టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా హారియర్‌పై కంపెనీ గరిష్టంగా రూ.80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంజనీర్లతో కలిసి రూపొందించిన ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ.25,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు అర్హతను బట్టి రూ.15,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

పైన పేర్కొన్న ఆఫర్ స్పెషల్ డార్క్ ఎడిషన్ మోడళ్లతో పాటు ఎక్స్‌జెడ్+ మరియు ఎక్స్‌జెడ్ఏ+ వేరియంట్లకు వర్తించవు. ఈ వేరియంట్లపై కంపెనీ రూ.40,000 వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో అదే ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర వేరియంట్లతో అందించే కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

టాటా కార్లపై సెప్టెంబర్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

టాటా మోటార్స్ సెప్టెంబర్ మంత్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు, టాటా మోటార్స్ కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈసారి టాటా నెక్సాన్‌పై కూడా కంపెనీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే, కోవిడ్ వారియర్ల కోసం ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. కస్టమర్ల కొనుగోలుకు సహకరించేందుకు టాటా మోటార్స్ ప్రత్యేక ఫైనాన్స్ సదుపాయాలను కూడా అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 9, 2020, 18:02 [IST]
English summary
Tata Motors have announced attractive discounts and special offers on its select models range this month. The company is offering cash discounts, exchange bonuses, and corporate discounts. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+