Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 12 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 15 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మూడు కొత్త పేర్లను ట్రేడ్‌మార్క్ చేసిన స్కొడా; కొత్త కార్లు రాబోతున్నాయ్..
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో భారత మార్కెట్లో తమ 'ప్రాజెక్ట్ 2.0'లో భాగంగా రానున్న రోజుల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ మూడు కొత్త పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. భారత మార్కెట్‌లో భవిష్యత్తులో విక్రయించబోయే మోడళ్లకు ఈ కొత్త పేర్లను ఉపయోగించనున్నారు.

స్కొడా ట్రేడ్‌మార్క్ చేసిన మూడు పేర్లు ఇలా ఉన్నాయి: కోస్మిక్, కార్మిక్ మరియు కుషాక్. రిజిస్ట్రీ వివరాల ప్రకారం, కోస్మిక్ మరియు కార్మిక్ పేర్లను ఈ ఏడాది జనవరిలో ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేయగా, కుషాక్ అనే పేరు కోసం సెప్టెంబర్‌లో ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేయబడింది. కాగా, ఇప్పుడు ఈ మూడు పేర్లకు ఆమోదం కూడా లభించింది.

ప్రస్తుతం స్కొడా ఆటో భారత మార్కెట్లో ర్యాపిడ్, ఆక్టావియా, సూపర్బ్ అనే మూడు సెడాన్ మోడళ్లను మరియు కరోక్ అనే ఎస్‌యూవీని విక్రయిస్తోంది. సమీప భవిష్యత్తులో స్కొడా నుండి భారత మార్కెట్లో మరో కొత్త ఉత్పత్తి కూడా విడుదల కానుంది, అదే విజన్ ఇన్ ఎస్‌యూవీ.
MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

స్కొడా తమ విజన్ ఇన్ ఎస్‌యూవీని ఇప్పటికే భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే, త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కొడా రిజిస్టర్ చేసిన ఈ మూడు పేర్లలో ఒకదానిని విజన్ ఇన్ ఎస్‌యూవీ పెట్టొచ్చని సమాచారం.

అయితే, స్కొడా ఇతర రెండు పేర్లను ఎందుకు నమోదు చేసిందనే దానిపై ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవు. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీలో ఓ ప్రొడక్షన్ వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా, రాబోయే నెల్లో కంపెనీ దాని నేమ్‌ప్లేట్‌ను వెల్లడించే అవకాశం ఉంది.
MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో స్కొడా ఆటో తొలిసారిగా తమ విజన్ ఇన్ ఎస్‌యూవీని కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచింది. స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క బ్రాండ్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ప్రవేశపెట్టొచ్చని అంచనా. దీనిని స్కొడా కరోక్ మోడల్‌కు దిగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

విజన్ ఇన్ ఎస్‌యూవీని స్కొడా ఆటో తన ‘ఇండియా 2.0' ప్రాజెక్టులో భాగంగా భారత్‌లో విడుదల చేయనుంది. ఇది ఈ ప్రాజెక్టులో బ్రాండ్ నుండి వస్తున్న మొదటి మోడల్‌గా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

కొత్త స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీలో ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్ (ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు మరియు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్), 19 ఇంచ్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వర్చువల్ కాక్‌పిట్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.