టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో, భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, స్కొడా భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. 'స్కొడా విజన్ ఇన్' అని పిలువబడే ఈ ఎస్‌యూవీని కంపెనీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో స్కొడా ఆటో తమ విజన్ ఇన్ ఎస్‌యూవీని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క బ్రాండ్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ప్రవేశపెట్టనున్నారు. దీనిని స్కొడా కరోక్ మోడల్‌కు దిగువన ఆఫర్ చేయనున్నారు.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

స్కొడా విజన్ ఇన్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగా కంపెనీ ఈ కారుని భారత రోడ్లపై వివిధ పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇలా ముంబైలో టెస్టింగ్ చేస్తున్న విజన్ ఇన్ ఎస్‌యూవీని ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు.

MOST READ:టీవీఎస్ కంపెనీ అమ్మకాల హవా.. భారీగా పెరిగిన నవంబర్ సేల్స్, ఎంతో తెలుసా ?

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

విజన్ ఇన్ ఎస్‌యూవీ వివరాలను తెలియకుండా ఉంచేందుకు కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసింది. అయినప్పటికీ, ఇందులోని కొన్ని డిజైన్ వివరాలు అస్పష్టంగా వెల్లడి అవుతున్నాయి. స్కొడా ఆవిష్కరించిన కాన్సెప్ట్ వెర్షన్ విజన్ ఇన్‌కు మరియు ప్రొడక్షన్ వెర్షన్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీలో కొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను గమనించవచ్చు. ఇది ఉత్పత్తి దశకు సిద్ధంగా ఉన్న మోడల్‌గా తెలుస్తోంది మరియు ఇందులో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు కూడా లభించవచ్చని అంచనా.

MOST READ:ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

స్కొడా నుండి రాబోయే విజన్ ఇన్, ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న స్కోడా కమిక్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో స్కొడా విజన్‌ను విడుదల చేసిన తర్వాత ఈ కారుకి కోస్మిక్ అని పేరు పెట్టవచ్చని మునుపటి నివేదికలు సూచిస్తున్నాయి.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

స్కోడా విజన్ ఇన్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ మరియు రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్. అయితే, ఈ విభాగంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు కంపెనీ ఈ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మాత్రమే ఆఫర్ చేయవచ్చని సమాచారం.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

ఇదే 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టిఎస్ఐ ఇంజన్‌ను స్కొడా బ్రాండ్ లైనప్‌లోని రాపిడ్ సెడాన్‌లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎమ్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని అంచనా.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో 1.5-లీటర్ ఇంజన్ టిఎస్ఐ ఇవో ఫోర్-సిలిండర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ ప్రస్తుతం స్కొడా అందిస్తున్న కరోక్ ఎస్‌యూవీలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

కొత్త స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ అనేక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉండొచ్చని అంచనా.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

అంతేకాకుండా ఈ ఎస్‌యూవీలో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు బ్లైండ్-స్పాట్ మోనటరింగ్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

స్కొడా విజన్ ఇన్ లేదా స్కొడా కోస్మిక్ ఎస్‌యూవీని స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇండియా 2.0' ప్రాజెక్ట్‌లో భాగం వస్తున్న తొలి మోడల్ కానుంది. స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీని కూడా అత్యంత పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

టెస్టింగ్‌లో కెమెరాకి చిక్కిన స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీ; త్వరలో లాంచ్!

స్కొడా విజన్ ఇన్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

స్కొడా తమ విజన్ ఇన్ ఎస్‌యూవీ టెస్టింగ్ ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. స్కొడా నుండి రాబోయే ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్ కోసం స్కొడా-ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు కలిసి తయారు చేస్తున్న మొదటి మోడల్‌గా నిలుస్తుంది. స్కొడా ఈ మోడల్‌ను విడుదల చేసినప్పుడు, దీని ధరను పోటీదారుల కన్నా సరసంగా అందుబాటులో ఉంచినట్లయితే, ఇది మార్కెట్లో అద్భుతాలు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda will soon launch a new SUV that is specifically made for the Indian market. The SUV was unveiled in its concept form earlier this year called the Vision IN. Ahead of its launch, the SUV has been spotted several times testing in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X