ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కారును మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 (ఐపిఎల్)కు అధికారిక భాగస్వామిగా చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఐపిఎల్ భాగస్వామిగా టాటా మోటార్స్ కొనసాగటం వరుసగా ఇది మూడవసారి.

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

అసోసియేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ)తో టాటా మోటార్స్ గడచిన 2018 మరియు 2019 సంవత్సరాల్లో కూడా భాగస్వామిగా కొనసాగింది. 2018లో టాటా నెక్సాన్ మరియు 2019లో టాటా హారియర్ ఎస్‌యూవీలతో కంపెనీ ఈ భాగస్వామ్యాన్ని అనుసరించింది.

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

ఐపిఎల్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన టి20 క్రికెట్ లీగ్‌లలో ఒకటి, ఈ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మంది అభిమానులు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ సెప్టెంబర్ 19వ తేదీ నుండి ప్రారంభం కానుంది మరియు ఇది 50 రోజుల వ్యవధిలో యుఏఈలోని మూడు (దుబాయ్, షార్జా మరియు అబుదాబి) ప్రదేశాలలో జరుగుతుంది.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

ఈ అసోసియేషన్‌లో భాగంగా, టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని మూడు స్టేడియాలలో జరిగే అన్ని మ్యాచ్‌లలో ప్రదర్శనకు ఉంచుతారు. టాటా మోటార్స్ ఐపిఎల్ 2020 సీజన్ వ్యవధిలో ఆల్ట్రోజ్ స్ట్రైకర్ అవార్డులను కూడా నిర్వహించనున్నారు. క్రికెటర్లు మరియు అభిమానులు ఇద్దరూ ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో ప్రతిరోజూ నగదు బహుమతులు మరియు మొత్తం సీజన్ కోసం ఓ విజేతను ఎంచుకోవటం జరుగుతుంది.

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మన్‌కు ఆల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ట్రోఫీతో పాటు రూ.1 లక్ష నగదు బహుమతి ఇవ్వబడుతుంది. సీజన్ చివర్లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్‌మన్‌కు కూడా టాటా ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 10 లక్షల లోపు ఉన్న టాప్ 5 కొత్త కార్లు

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

అభిమానులు ఈ పోటీలో పాల్గొనడానికి ఆల్ట్రోజ్ సూపర్ స్ట్రైక్ మొబైల్ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆటలో రోజువారీ విజేతలకు 5000 రూపాయల విలువైన వోచర్లు ఇస్తారు. అలాగే, సీజన్ మొత్తానికి విజేతగా నిలిచిన వారికి ఆల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ట్రోఫీని మరియు రూ.1 లక్ష వోచర్‌ను ఇస్తారు.

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

టాటా ఆల్ట్రోజ్ కారుకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఓ కొత్త పవర్‌ఫుల్ టర్బో వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో అని పిలువబడే కొత్త వేరియంట్‌ను టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి విడుదల చేయాలని చూస్తోంది.

MOST READ:త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లయింగ్ కార్లు ఇవే.. మీరు చూసారా ?

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌ను ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. తాజాగా విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, మహారాష్ట్ర టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న బ్లూకలర్ ఆల్ట్రోజ్ కారును టాటా మోటార్స్ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఐపిఎల్ 2020 పార్ట్‌నర్‌గా టాటా ఆల్ట్రోజ్; వరుసగా ఇది మూడవసారి!

ఐపిఎల్ 2020 భాగస్వామిగా టాటా ఆల్ట్రోజ్ కొనసాగటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ వరుసగా మూడవ సంవత్సరం కూడా బిసిసిఐ మరియు ఐపిఎల్‌తో బ్రాండ్ అసోసియేషన్‌ను కొనసాగిస్తోంది. ఈసారి టాటా ఆల్ట్రోజ్ కారును కంపెనీ ఈ ప్రచారం కోసం ఎంచుకుంది. ఐపిఎల్ 2020 ప్రపంచంలోనే అతిపెద్ద టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఒకటి కావడంతో, టాటా ఆల్ట్రోజ్ భారత మార్కెట్లో అమ్మకాల పరంగా మంచి ప్రోత్సాహాన్ని పొందవచ్చని తెలుస్తోంది.

MOST READ:కియా సోనెట్‌లో అందరూ మెచ్చుకునే టాప్ 8 ఫీచర్లు ఏంటో తెలుసా?

Most Read Articles

English summary
The Tata Altroz premium hatchback has been announced as the official partner for the upcoming Indian Premier League 2020 (IPL). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X