ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహన వ్యాపారంలో 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది.

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్‌లో 49 శాతం వాటాను యూరోపియన్ లేదా ఆసియా ఆధారిత సంస్థకు విక్రయించేందుకు చర్చలు జరుపుతోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చేందుకు టాటా మోటార్స్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

చైనాకి చెందిన గీలే, మరియు వోల్వో కార్ బ్రాండ్‌ను కలిగిన చెరి సంస్థలతో టాటా మోటార్స్ చర్చలు జరుపుతోందనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో కూడా 50 శాతం వాటాను విక్రయించేందుకు కూడా కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు సూచించాయి.

MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

ఈ ఊహాగానాలపై టాటా మోటార్స్ స్పందిస్తూ విడుదల చేసిన ప్రకటన ప్రకారం "నిజానికి మీరు సూచించిన నివేదికలు పూర్తిగా తప్పు, ఇవన్నీ ఊహాజనితమైనవి మరియు తప్పుదోవ పట్టించేవి. టాటా మోటార్స్ తన పివి (ప్యాసింజర్ వెహికల్) బిజినెస్‌లో 49 శాతం వాటాను విక్రయించడం గురించి ప్రచురించిన వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం మరియు ఇవి సంభావ్య భాగస్వాములు / పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేవి." అని పేర్కొంది.

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో టాటా మోటార్స్ కొత్త భాగస్వాములను తీసుకురావాలని యోచిస్తున్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. టాటా మోటార్స్ వీటిని ఖండిస్తూ, ఇవన్నీ మీడియా ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేసింది.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

ఈ ప్రకటనలో, "మొదటగా, టిఎమ్ఎల్ భారతదేశంలో అగ్రగామిగా ఎదిగిన ఆటోమొబైల్ కంపెనీ. ఇది దాని ఉత్పత్తులు మరియు అత్యుత్తమ తరగతి భద్రత, స్టైలిష్ డిజైన్ మరియు అత్యుత్తమ డ్రైవబిలిటీతో బలమైన కస్టమర్ స్పందనను కలిగి ఉంది. సంవత్సరాలుగా, టాటా మోటార్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు ఆటో రంగాన్ని బలోపేతం చేయాలన్న దాని సంకల్పం కోసం బ్రాండ్ కట్టుబడి ఉంటుంది." అని పేర్కొన్నారు.

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

పెట్టుబడులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, నిర్మాణాలు, ఉత్పత్తులు మరియు కొత్త ఇంజన్‌లకు యాక్సెసబిలిటీని అందించే వ్యూహాత్మక పొత్తులను నిర్ధారించే దిశగా ఈ ఏడాది మార్చిలో బ్రాండ్ తన ప్రైవేట్ వాహన వ్యాపారానికి సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది.

MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ వ్యాఖ్యానిస్తూ ఒక కూటమి అనేది భవిష్యత్తును భద్రపరచడానికి ఒక అవకాశం మాత్రమేనని, ప్రస్తుతానికి అది అంత అత్యవసరమైనది కాదని తెలిపింది.

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

ఇక టాటా మోటార్స్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ త్వరలో గ్రావిటాస్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని అమ్మట్లేదు: టాటా మోటార్స్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విక్రయంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్‌కు కేవలం వాహనాల వ్యాపారం మాత్రమే కాదు, దేశంలో అనేక పరిశ్రమల్లో ఈ కంపెనీకి వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోని బహుళ పరిశ్రమలలో ముందంజలో ఉన్న కొన్ని స్వదేశీ సంస్థలలో టాటా మోటార్స్ కూడా ఒకటి. మరీ కష్ట కాలం వస్తే తప్ప టాటా మోటార్స్ తన వాటాలను విక్రయించే అవకాశం లేదు. ఈ విషయంలో వచ్చిన పుకార్లపై టాటా మోటార్స్ స్పందించడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
Mumbai based auto manufacturer Tata Motors Limited has denied reports of plans to sell up to 49 percent stake in the brand's domestic passenger vehicle business. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X