టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్'లో కంపెనీ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడిచే ఈ టాటా నెక్సాన్ ఈవి ఇప్పుడు మార్కెట్లో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. టాటా మోటార్స్ తమ ప్లాంట్ నుండి 1000వ నెక్సాన్ ఈ.వి. కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

టాటా నెక్సాన్ ఈవి దేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మారింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ విభాగంలో టాటా నెక్సాన్ ఈవి అగ్రస్థానంలో ఉంది. నెక్సాన్ ఈవి మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసిన కేవలం 6 నెలల వ్యవధిలోనే టాటా మోటార్స్ ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.14 లక్షల నుండి రూ.16 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ మోడల్‌ను మొదటిసారిగా 2020 మార్చ్ నెలలో మార్కెట్లో విడుదల చేశారు. అప్పటి నుండి, ఈ ఎస్‌యూవీకి మార్కెట్లో సానుకూల స్పందన లభింటింది. టాటా నెక్సాన్ ఈవి ప్రస్తుతం ఈ విభాగంలో 62 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

టాటా నెక్సాన్ ఈవి విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ డ్రైవింగ్ రేంజ్ అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది, ఫలితంగా వాస్తవ వినియోగంలో ఈ రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని రియల్-వరల్డ్ మైలేజ్ 250 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పునరుత్పత్తి బ్రేకింగ్ (బ్రేక్ రీజనరేషన్) టెక్నాలజీ కూడా ఉంటుంది. బ్రేకింగ్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఫలితంగా డ్రైవింగ్ పరిధి పెరుగుతుంది.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

ఈ కారులోని కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పూర్తి-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

ప్రస్తుతం మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. టాటా నెక్సాన్ ఈ.వి. భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంది.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

నెక్సాన్ ఈవి ప్రొడక్షన్ మైల్‌స్టోన్ గురించి టాటా మోటార్స్ లిమిటెడ్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, "దేశంలో కస్టమర్లు ఈవీలను వేగంగా అంగీకరిస్తున్నారు. ఈ విభాగంలో డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ప్రత్యేకించి టాటా నెక్సాన్ ఈవిపై దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఆసక్తి పెరుగుతోంది. దేశంలో కోవిడ్-19 సవాళ్లు ఉన్నప్పటికీ, అతి తక్కువ సమయంలోనే 1000వ నెక్సాన్ ఈవిని విడుదల చేయడం చూస్తుంటే, ఈవిల వ్యక్తిగత విభాగంలో కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతుందని తెలుస్తోంద"ని అన్నారు.

టాటా నెక్సాన్ ఈవి కొత్త రికార్డ్; ప్లాంట్ నుంచి 1000వ యూనిట్ విడుదల

టాటా నెక్సాన్ ఈ.వి. ప్రొడక్షన్ మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా నెక్సాన్ ఈ.వి భారత మార్కెట్లో అదికొద్ది సమయంలో మంచి సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా కంపెనీ సాధించిన ఈ ఉత్పత్తి మైలురాయే దీని విజయానికి నిదర్శనంగా ఉంది. టాటా మోటార్స్ రాబోయే నెలల్లో మరిన్ని నెక్సాన్ ఈవి కార్లను విక్రయించే అవకాశం ఉంది. ఇది భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఓ మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, August 20, 2020, 14:18 [IST]
English summary
Tata Motors has announced a new production milestone in the Indian market. The company recently announced the roll-out of the 1000th unit of their Nexon EV SUV in the country. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+