'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలు పెంచుతామని ప్రకటించింది. భారత మార్కెట్లో టాటా మోటార్స్ అందిస్తున్న మొత్తం వాణిజ్య వాహన పోర్ట్‌ఫోలియో ధరలను జనవరి 1, 2021 నుండి పెంచుతామని కంపెనీ పేర్కొంది.

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

కాగా, ఇప్పటికే ఈ విభాగంలో వాహనాలను అందిస్తున్న మహీంద్రా, ఇసుజు బ్రాండ్‌లు కూడా తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

ముడి పదార్థాల ధరలు పెరగడం ఫలితంగా, ఇన్‌పుట్ ఖర్చులు అధికం కావటం అలాగే, ఫోరెక్స్ ప్రభావం మరియు వాహనాలను బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం వంటి పలు కారణాల వలన ధరలను పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ తెలిపింది.

MOST READ:3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్‌లో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ కార్ ఏదో మీరూ చూడండి

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

ఈ మేరకు టాటా మోటార్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో "కంపెనీ ఇప్పటివరకు ఖర్చులను అదనంగా గ్రహిస్తోంది, కానీ మార్కెట్ ధోరణికి అనుగుణంగా అవి స్థిరంగా పెరగడంతో, ధరల పెరుగుదలలో కొంత భాగాన్ని తగిన ధరల సవరణల ద్వారా వినియోగదారులకు బదిలీ చేయటం అత్యవసరం" అని పేర్కొంది.

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

అయితే, టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల ధరలను ఎంత మేర పెంచుతామనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఇందుకు సమాధానంగా కంపెనీ ‘తగిన' మేర ధరలను సవరిస్తామని పేర్కొంది. ఈ ధరల పెరుగుదల మోడల్, వేరియంట్ మరియు ఎంచుకున్న ఇంధన రకంపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోలో మీడియం మరియు హెవీ కమర్షియల్ వెహికల్స్ (ఎమ్ అండ్ హెచ్‌సివి), ఇంటర్మీడియట్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఐ అండ్ ఎల్‌సివి), చిన్న వాణిజ్య వాహనాలు (ఎస్‌సివి) మరియు బస్సులను భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

కాగా, టాటా మోటార్స్ భారత మార్కెట్లో తమ ప్యాసింజర్ వాహనాల విభాగానికి సంబంధించి ధరల పెంపును ఇంకా ప్రకటించలేదు. దేశంలోని ఇతర కార్ బ్రాండ్ల మాదిరిగానే టాటా మోటార్స్ కూడా కొత్త సంవత్సరంలో తమ వాహనాల ధరను పెంచవచ్చని తెలుస్తోంది. త్వరలోనే కంపెనీ దీనిపై కూడా ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

ప్యాసింజర్ వాహన విభాగంలో ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా. హ్యుందాయ్ ఇండియా వంటి కంపెనీలు జనవరిలో తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. అలాగే, లగ్జరీ కార్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు కూడా వచ్చే నెల నుంచి ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే.

'తగిన' మేర పెరగనున్న టాటా వాహనాల ధరలు; వివరాలు

ఇక టాటా మోటార్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, టాటా హారియర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో గ్రావిటాస్ పేరిట ఓ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. కంపెనీ ఈ కారును తొలిసారిగా ఎలాంటి క్యామోఫ్లేజ్‌ లేకుండా టెస్ట్ చేస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:టైటానిక్ షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Tata Motors To Increase Its Entire Commercial Vehicle Range Prices In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X