భారతదేశంలో ప్రారంభమైన టాటా నెక్సాన్ డెలివరీలు
టాటా నెక్సాన్ EV డెలివరీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిలను దేశవ్యాప్తంగా వినియోగదారులకు పంపిణీ చేశారు. టాటా నెక్సాన్ ఇవి ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అతి తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ ఎస్‌యువి.

టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ ఇవి ని ప్రారంభించకముందే 2019 డిసెంబర్ లో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 న కంపెనీ నెక్సాన్ ఇవి ని ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు. మరియు టాప్-స్పెక్ వేరియంట్ రూ.15.99 లక్షలకు రిటైల్ అవుతుంది (ఎక్స్-షోరూమ్, ఇండియా).

టాటా నెక్సాన్ 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది మరియు ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడింది. ఇది 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ EV ఒకే ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అంటే సరాసరి 250 నుంచి 300 కిలోమీటర్ల మధ్య పరిధిని అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఇవి కొనుగోలుదారులకు సంస్థ ఏర్పాటు చేసిన కాంప్లిమెంటరీ హోమ్ ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా పొందుతారు. ఇవి కొనుగోలుదారులకు మరింత అనుభవాన్ని మెరుగుపరచడానికి టాటా మోటార్స్ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తుంది.

హోమ్ ఛార్జర్ లో పూర్తి ఛార్జ్ కోసం 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ నెక్సాన్ ఇవి బ్యాటరీలను కేవలం 60 నిమిషాల్లో 0 - 80% నుండి ఛార్జ్ చేస్తుంది. నెక్సాన్ EV పునరుత్పత్తి బ్రేకింగ్‌ను కలిగి ఉంది.

టాటా నెక్సాన్ EV లో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఫుల్-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రివర్స్ పార్క్ అసిస్ట్ వంటివి ఉంటాయి.

టాటా నెక్సాన్ ఇవి భారత మార్కెట్లో ఎంజి జెడ్ఎస్ ఇవి మరియు హ్యుందాయ్ కోనాలకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు అధిక ధరను కలిగి ఉంటాయి. ఏదేమైనా టాటా నెక్సాన్ ఇవి మంచి పనితీరుని కలిగి ఉంటుంది. అంతే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది దాని ప్రత్యర్థులకంటే తక్కువ ధరను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
భారతదేశంలో ఇప్పుడు విద్యుత్ విప్లవం మొదలైంది. దీనిలో భాగంగా టాటా నెక్సాన్ ఈ ఎలెక్ట్రిక్ విభాగంలో ఒకటిగా చేరింది. సాధారణంగా వినియోగదారులు మంచి వాహనాన్ని ఎంచుకుంటారు. ఏది ఏమైనా ఎలెక్ట్రిక్ విభాగంలో టాటా నెక్సాన్ మంచి ఎంపికే అవుతుంది. ఇది వినియోగదారునికి చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందించడమే కాకుండా అతి తక్కువ సమయంలో ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications








