టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోలో కంపెనీ ఓ కొత్త పవర్‌ఫుల్ టర్బో వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా టియాగో టర్బో అని పిలువబడే కొత్త వేరియంట్‌ను టాటా మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని అంచనా.

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన తాజా స్పై చిత్రాలను గమనిస్తే, ఇందులో టాటా మోటార్స్ భారత రోడ్లపై టెస్ట్ చేస్తున్న టియాగో హ్యాచ్‌బ్యాక్ టర్బో వేరియంట్‌ను చూడొచ్చు. అయితే, ఈ టెస్టింగ్ వాహనం వివరాలు తెలియకుండా కంపెనీ పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, టర్బో వేరియంట్ డిజైన్ కూడా మారే అవకాశం కనిపిస్తోంది.

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

ఈ నివేదికల ప్రకారం, టెస్టింగ్‌లో గుర్తించిన టియాగో టర్బో హ్యాచ్‌బ్యాక్‌ను బాష్ ఇంజనీర్లు పరీక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్నట్లుగా గుర్తించారు.

టాటా మోటార్స్ నుంచి కొత్తగా రాబోయే టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో టర్బో-పెట్రోల్ ఇంజన్ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక నివేదికలు లేవు. అయితే, కంపెనీ టియాగోపై టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేయటం ఇదేం మొదటిసారి కాదు.

MOST READ:ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన కొత్త ఎస్‌యూవీ, ఇదే

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

భారత మార్కెట్లో టాటా మోటార్స్ ఇటీవలే నిలిపివేసిన టియాగో మరియు టిగోర్ జెటిపి మోడళ్లలో టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేశారు. ఆ మోడళ్లలో 1.2-లీటర్ యూనిట్ బిఎస్4 కంప్లైంట్ ఇంజన్‌ను ఉపయోగించే వారు. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ రివైజ్డ్ గేర్ రేషియోలతో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండేది.

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

అయితే, టాటా మోటార్స్ ఈ హ్యాచ్‌బ్యాక్‌లో మరింత శక్తివంతమైన మోడళ్లను విడుదల చేయాలనే ఉద్దేశ్యం లేనందున, కంపెనీ ఈ 1.2-లీటర్ ఇంజన్‌ను తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది టాటా మోటార్స్ బ్రాండ్ నుండి కొత్తగా రానున్న చిన్న-సామర్థ్యపు ఇంజన్ అయ్యే అవకాశం ఉంది.

MOST READ:ట్రైయంప్ బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్ విడుదల: ధర, ఫీచర్లు

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

ఇకపోతే, కంపెనీ అందిస్తున్న 1.0-లీటర్, త్రీ సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా బాగా ప్రాచుర్యం పొందిన ఇంజన్. ఇది పనితీరు మరియు ఇంధన సామర్థ్యం మధ్య సంపూర్ణ సమతుల్యతను అందిస్తుంది, అదే సమయంలో మంచి శుద్ధీకరణను (రీఫైన్) కూడా అందిస్తుంది.

తక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన టర్బో ఇంజన్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, టాటా మోటార్స్ తమ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌పై కంపెనీ పనిచేసే అవకాశం ఉంది.

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

దేశంలో బిఎస్6 అప్‌డేట్ తరువాత, మార్కెట్లో టాటా టియాగో ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇందులో రెగ్యులర్ 1.2 లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 85 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

టియాగో ప్రస్తుతం టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంది. మార్కెట్లో దీని ధరలు రూ.4.69 లక్షల నుండి రూ.6.73 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఆగస్ట్ నెల ఆఫర్లలో భాగంగా, కంపెనీ కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఈజీ ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది.

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

ఇక టాటా మోటార్స్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్‌లో కూడా కంపెనీ ఓ కొత్త టర్బో వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టర్బో ఇంజన్‌ను మరింత స్పోర్టీ డ్రైవ్ అనుభూతి కోసం ప్యాడిల్ షిఫ్టర్లతో ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడండి

టాటా టియాగోలో కొత్తగా రానున్న టర్బో పెట్రోల్ వేరియంట్ - వివరాలు

టాటా టియాగో టర్బో వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో బిఎస్6 ఉద్గార నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో, కార్ల తయారీ కంపెనీలు దేశంలో ఖరీదైన డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా టర్బో పెట్రోల్ ఇంజన్లపై దృష్టి సారించారు. పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు టాటా మోటార్స్ కూడా ఈ విభాగంలో వీలైనన్ని టర్బో వేరియంట్లను విడుదల చేయాలని చూస్తోంది.

Source: Team BHP

Most Read Articles

English summary
Tata Motors will be introducing a host of new models later this year and early next year as well. This includes full-size SUVs, compact-SUVs and a powerful variant of the brand's premium hatchback. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X