గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే

భారత మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పుడు పూర్తిగా సరికొత్త మోడళ్లతో నిండి ఉంది. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, హోండా డబ్ల్యూఆర్-వి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యువి300 మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లు ఇప్పటికే ఈ విభాగంలో విజయాల బాటలో ఉండగా, తాజాగా ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో నుండి కిగర్ అనే మోడల్ మార్కెట్లోకి రావటానికి సిద్ధంగా ఉంది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

దేశంలో ఓవైపు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని వాహనాలకు ఆదరణ పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడాన్ని కూడా మనం గమనించవచ్చు. తాజాగా, స్వీడన్ కార్ బ్రాండ్ వోల్వో కూడా భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. గత వారంలోని టాప్ కార్ న్యూస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

రెనో కిగర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఎట్టకేలకు, భారత్‌లో తమ సరికొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క కాన్సెప్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ప్రొడక్షన్ వెర్షన్‌లో ఏయే ఫీచర్లు ఉండవచ్చనేది ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ద్వారా వెల్లడి అయ్యాయి.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

రెనో కిగర్ రెండు పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ ఎన్ఏ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఇదే రకమైన ఇంజన్ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

నిస్సాన్ మాగ్నైట్ విడుదల తేదీ

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ నుండి భారత్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ డిసెంబర్ 2, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్ వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడి చేసింది.

MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

నిస్సాన్ మాగ్నైట్ రెండు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. లోయర్-స్పెక్ యూనిట్‌లో న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 70 బిహెచ్‌పి మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హై-స్పెక్ వేరియంట్లలో టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. - నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్ వారీ ఫీచర్ల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ @ 20,000 మార్క్

భారత్‌లో కొత్త తరం హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసినప్పటి నుండి 20,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం హ్యుందాయ్ అధికారికంగా బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించినప్పటి నుండి కేవలం 20 రోజుల్లోనే 20,000 యూనిట్లు నమోదు చేయబడినట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:కొత్త స్టైల్‌లో సోనెట్ ఎస్‌యూవీ డెలివరీ చేసినా కియా మోటార్స్.. ఎలాగో తెలుసా ?

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

మార్కెట్లో కొత్త హ్యుందాయ్ ఐ20ని రూ.6.79 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ రూ.11.18 లక్షల వరకు ఉంది. (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). కాగా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ మోడల్ ధరలు పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

స్వీడన్ కార్ కంపెనీ వోల్వో ఇటీవలే తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌సి40 రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్‌ను కంపెనీ భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఆల్-ఎలక్ట్రిక్ వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ విజయవంతంగా అమ్ముడవుతోంది.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ ; వివరాలు

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

తాజా మీడియా నివేదికల ప్రకారం, వోల్వో తమ మొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌సి40 రీఛార్జ్‌ని జూలై 2021 నాటికి భారత మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. ఈ కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎస్‌యూవీలో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లను ప్రతి యాక్సెల్ వద్ద అమర్చబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

2021 జీప్ కంపాస్ ఆవిష్కరణ

అమెరికన్ ఐకానిక్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్, ఇటీవలే తమ కొత్త 2021 జీప్ కంపాక్ ఎస్‌యూవీని ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. చైనాలో జరుగుతున్న 2020 గ్వాంగ్జౌ ఆటో షోలో జీప్ తమ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ ఎక్స్‌పోలో అప్‌డేట్ చేసిన జీప్ కంపాస్ ఎస్‌యూవీ యొక్క స్టాండర్డ్ మరియు ట్రైల్‌హాక్ వేరియంట్‌లను కంపెనీ ప్రదర్శించింది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

కొత్త 2021 జీప్ కంపాస్ కంపెనీ నుండి మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను అందుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ఈ మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో రీడిజై చేయబడిన ఫ్రంట్ బంపర్‌లు మరియు హెడ్‌ల్యాంప్‌లతో ఇది సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

ఈ వారం టాప్ కార్ న్యూస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం హాటెస్ట్ స్పేస్‌లో ఉంది. ఈ విభాగంలో కొనుగోలుదారులకు ప్రత్యేకమైన ఉత్పత్తులను అందించేందుకు అనేక కార్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అలాగే, ఈ నెలలో అమ్మకాలలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి టాటా ఆల్ట్రోజ్ మరియు కొత్తగా విడుదలై హ్యుందాయ్ ఐ20లు పోటాపోటీగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Top Car News Of The Week, Top Highlights In Four-Wheeler Market From Previous Week. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X