Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కియా సోనెట్ కాస్కో.. రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది..
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కిగర్' కాన్సెప్ట్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్ల కోసం తయారు చేసిన రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది.

గతంలో రెనో ఇండియా అనుబంధ సంస్థ నిస్సాన్ ఇండియా కూడా తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయంలో చేసినట్లుగానే రెనో కూడా ముందుగా కాన్సెప్ట్ వాహనాన్ని ఆ తర్వాత ప్రొడక్షన్ వెర్షన్ వాహనాన్ని విడుదల చేయనుంది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ వాహనమే అయినప్పటికీ, దీని సాయంతో ప్రొడక్షన్ వెర్షన్‌లో ఏయే ఫీచర్లు ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు.

రెనో కిగర్ డిజైన్‌ను గమనించినట్లయితే, ఈ కాన్సెప్ట్ వాహనం ముందు భాగంలో డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది, ప్రతి హెడ్‌ల్యాంప్‌లో మూడు స్ప్లిట్ ఎల్ఈడి ల్యాంప్స్ కనిపిస్తాయి. హెడ్‌ల్యాంప్ సెటప్ పైభాగంలో సన్నటి ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ సెటప్ బానెట్ పొడవునా కనిపిస్తుంది.
MOST READ:రోడ్డుపైకి రానున్న మరో రేస్ కార్ లంబోర్ఘిని హురాకాన్ ఎస్టిఓ ; వివరాలు

డేటైమ్ రన్నింగ్ లైట్లను ఫ్రంట్ గ్రిల్ పైభాగంలో అమర్చారు, ఈ లైట్ల మధ్య పెద్ద రెనో లోగో ఉంటుంది. ఫ్రంట్ బంపర్ మధ్యలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా ఉంది, దాని క్రింది భాగంలో సిల్వర్ కలర్‌లో ఫినిష్ చేసిన స్కిడ్ ప్లేట్లు కూడా ఉన్నాయి.

ఈ ఎస్‌యూవీ బోనెట్ మరియు సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, దానిపై మజిక్యులర్ క్రీజ్ లైన్స్ కనిపిస్తాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత రగ్గడ్ లుక్‌ని ఇస్తాయి. ఎస్‌యూవీ చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ కనిపిస్తుంది, ఇది ఫ్రంట్ బంపర్ దిగువ భాగం నుండి కారు చుట్టూ విస్తరించబడి ఉంటుంది.
MOST READ:పబ్జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో ఫినిష్ చేసిన సైడ్ మిర్రర్స్ ఉన్నాయి, వాటిపై టర్న్ ఇండికేటర్స్‌ను అమర్చారు. డోర్ హ్యాండిల్స్‌ను కూడా డ్యూయెల్ టోన్ కలర్‌లో ఫినిష్ చేశారు. ఇందులో ఎక్కువ భాగం బాడీ కలర్, మిగిలిన భాగం బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంది. ఇందులో రూఫ్ ట్రాక్స్‌ను కూడా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు.

వెనుక ప్రొఫైల్‌ను గమనించినట్లయితే, సి-ఆకారపు ఎల్ఈడి టెయిల్ లైట్లతో పాటు, రూప్-మౌంటెడ్ స్పాయిలర్‌ను ఇందులో చూడొచ్చు. రూఫ్ స్పాయిలర్‌లో హై-మౌంట్ స్టాప్ లాంప్ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీలో వెనుక బంపర్ మధ్యలో అమర్చిన సైలెన్సర్ సెటప్‌ను చూడొచ్చు. అయితే, ఇది ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉండకపోవచ్చని తెలుస్తోంది.
MOST READ:భారత్‌లో జీప్ రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడో తెలుసా?

కాగా.. రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్ మినహా, కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఎక్స్‌టీరియర్స్ మాత్రమే వెల్లడయ్యాయి, ఇంటీరియర్స్ వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, ప్రొడక్షన్ వెర్షన్ రెనో కిగర్ ఎస్‌యూవీలో పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఇతర ఫీచర్లు మరియు పరికరాలు కూడా ఉంటాయని మేము ఆశిస్తున్నాము.
MOST READ:కవాసకి బైక్ ఇంజిన్‌తో నడిచే హెలికాఫ్టర్.. మీరు చూసారా !

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, రెనో కిగర్ రెండు పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుందని అంచనా, అవి: 1.0-లీటర్ ఎన్ఎ యూనిట్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్. నిస్సాన్ మాగ్నైట్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే కాస్తంత ట్యూన్ చేసి, ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది.

రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 2021 మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో అడుగు పెట్టిన తర్వాత, రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.