టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి తర్వాత, మార్కెట్లో ఆటోమోటివ్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్ కాలంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఆటోమోటివ్ తయారీదారులు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో తయారీదారులు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అప్‌డేటెట్ బిఎస్6 వాహనాలను విడుదల చేయటాన్ని మనం గమనించాం. గడచిన వారంలో దేశీయ ఆటో రంగంలో జరిగిన కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి:

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ విడుదల

మారుతి సుజుకి ఇండియా తమ సరికొత్త 2020 ఎస్-క్రాస్ పెట్రోల్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఇప్పుడు కేవలం బిఎస్6 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఇప్పుడు 1.5-లీటర్ కె15 సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. భారత్‌బెంజ్ ఎక్స్ఛేంజ్ స్కీమ్ స్టార్ట్ చేసింది

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

ఇందులో బ్రాండ్ యొక్క ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడో జోడించారు. ఈ ఇంజన్ ఆప్షనల్ 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటుగా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని బేస్ సిగ్మా వేరియంట్ ధర రూ.8.39 లక్షలుగా ఉండగా టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్ ధర రూ.12.39 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి స్పెషల్ ఎడిషన్ విడుదల

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి పేరుతో భారత మార్కెట్లో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.34.98 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది.

MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

రెండు ఆటోమేటిక్ వెర్షన్లలో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను టొయోటా అందిస్తోంది. అవి - టూ-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్-డ్రైవ్. స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే కొత్త 2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్ అనేక కొత్త ఫీచర్లు, కాస్మోటిక్ మార్పులను కలిగి ఉంటుంది, ఇంజన్‌లో ఎలాంటి మార్పులు లేవు. టాప్-స్పెక్స్ టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి ఫోర్-వీల్-డ్రైవ్ మోడల్ ధర రూ.36.88 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రొడషన్ వెర్షన్ కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పరదాలను కంపెనీ తొలగించింది. కియా నుంచి వస్తున్న ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నారు.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

హ్యుందాయ్ వెన్యూ కారులో ఉపయోగించిన ఇంజన్ ఆప్షన్లను కియా సోనెట్‌లో కూడా ఆఫర్ చేయనున్నారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ఉన్నాయి. ఈ మూడు ఇంజన్లు బిఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇవి హ్యుందాయ్ వెన్యూ మాదిరిగానే అదే పవర్ మరియు టార్క్ ఫిగర్స్ ఉత్పత్తి చేస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

ఆగస్ట్ 15న కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా తమ సరికొత్త ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ 2020 థార్‌ను ఆగస్ట్ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సరికొత్త మహీంద్రా థార్ టీజర్ వీడియోను విడుదల చేసింది. సరికొత్త టెక్నాలజీ, కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లలో ఫుల్లీ లోడెడ్ ఆఫ్-రోడర్‌గా ఇది మార్కెట్లోకి రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

పూర్తిగా సరికొత్తగా పునర్జన్మ ఎత్తనున్న మహీంద్రా థార్ దాని సాటిలేని ఆఫ్-రోడ్ సామర్ధ్యం మరియు ఐకానిక్ జీప్ డిజైన్ వంటి ప్రధాన సామర్థ్యాలపై ఏ విషయంలోనూ రాజీపడదని కంపెనీ పేర్కొంది. కొత్త తరం థార్ ఔత్సాహికులను ఆకర్షించడమే కాకుండా, సమకాలీన ఎస్‌యూవీ కోసం వెతుకుతున్న కొనుగోలుదారులను కూడా ఆకర్షిస్తుందని మహీంద్రా తెలిపింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

భారత్ కోసం టొయోటా అర్బన్ క్రూజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా (టికెఎమ్) భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 'అర్బన్ క్రూయిజర్' పేరిట కంపెనీ ఓ కొత్త ఎస్‌యూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం టొయోటా నుంచి విడుదలైన మొదటి అధికారిక టీజర్ ఇది.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

టొయోటా నుంచి రానున్న సరికొత్త అర్బన్ క్రూయిజర్, కంపెనీ యొక్క మొట్టమొదటి సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీగా ఉంటుంది. ఈ జపనీస్ బ్రాండ్ అందిస్తున్న ఐకానిక్ ‘ల్యాండ్ క్రూయిజర్' పేరు నుండి ప్రేరణ పొంది, ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి టొయోటా అర్బన్ క్రూయిజర్ అనే నేమ్‌ప్లేట్‌ను ఖరారు చేశారు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై దీనిని తయారు చేశారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ - ఎస్-క్రాస్, ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల, కియా సోనెట్ ఆవిష్కరణ..

ఈ వారం టాప్ కార్ న్యూస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, వాహన తయారీదారులు తమ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించారు. ఇప్పటి వరకూ భారీ హంగామా చేస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వాహనాలను విడుదల చేసిన కార్ కంపెనీలు ఇప్పుడు కొత్తగా డిజిటల్ రూపంలో విడుదల చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
The automotive sales are gradually picking up during these post-COVID times. We are noticing automotive manufacturers getting ready to cater to the growing demand during the festive season. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X