పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు
జపనీస్ బ్రాండ్ టొయోటా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి (మల్టీ పర్సప్ వెహికల్) ఇన్నోవా క్రిస్టా (Innova Crysta)లో కొత్తగా బిఎస్6 వెర్షన్లను విడుదల చేసింది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త బిఎస్6 టొయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు వేరియంట్‌ను బట్టి రూ.25,000 నుండి రూ.60,000 మధ్యలో పెరిగాయి.

మార్కెట్లో ప్రస్తుతం బిఎస్6 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ప్రారంభ ధర వేరియంట్ ధర రూ.15.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.23.63 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

వేరియంట్ల వారీగా లభిస్తున్న టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు ఇలా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ):
| పెట్రోల్ | |
| 2.7 GX MT 7 సీటర్ | ₹15.66 లక్షలు |
| 2.7 GX MT 8 సీటర్ | ₹15.71 లక్షలు |
| 2.7 GX AT 7 సీటర్ | ₹17.02 లక్షలు |
| 2.7 GX AT 8 సీటర్ | ₹17.07 లక్షలు |
| 2.7 VX MT 7 సీటర్ | ₹19.00 లక్షలు |
| 2.7 ZX AT 7 సీటర్ | ₹21.78 లక్షలు |
| డీజిల్ | |
| 2.4 G MT7 సీటర్ | ₹16.44 లక్షలు |
| 2.4 G MT8 సీటర్ | ₹16.49 లక్షలు |
| 2.4 G+ MT 7 సీటర్ | ₹17.09 లక్షలు |
| 2.4 G+ MT 8 సీటర్ | ₹17.14 లక్షలు |
| 2.4 GX MT 7 సీటర్ | ₹17.47 లక్షలు |
| 2.4 GX MT 8 సీటర్ | ₹17.52 లక్షలు |
| 2.4 GX AT 7 సీటర్ | ₹18.78 లక్షలు |
| 2.4 GX AT 8 సీటర్ | ₹18.83 లక్షలు |
| 2.4 VX MT 7 సీటర్ | ₹20.89 లక్షలు |
| 2.4 VX MT 8 సీటర్ | ₹20.94 లక్షలు |
| 2.4 ZX MT 7 సీటర్ | ₹22.43 లక్షలు |
| 2.4 ZX AT7 సీటర్ | ₹23.63 లక్షలు |
MOST READ: 2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

ధరలు మరియు కాలుష్య నిబంధనలు మినహా బిఎస్6 వెర్షన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో కొత్తగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. మునపటి లానే ఇది 18 వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, వినియోగదారుల కోసం ఇందులో 7-సీటర్ లేదా 8-సీటర్ ఆప్షన్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మొత్తం 18 వేరియంట్లలో 6 వేరియంట్లు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంటే మిగిలిన 12 వేరియంట్లు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతున్నాయి. పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే ఇందులో 2.7 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 164 బిహెచ్‌పిల శక్తిని, 245 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ ఇంజన్ వేరియంట్లలో ఉపయోగించిన 2.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పిల శక్తిని మరియు 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక గేర్ బాక్స్ (ట్రాన్సిమిషన్) విషయానికి వస్తే ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
కాగా.. టొయోటా ఇటీవలే తమ పాపులర్ ప్రీమియం ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ బిఎస్6 (Fortuner BS6) వెర్షన్ ధరలను కూడా సుమారు రూ.48,000 వరకూ పెంచిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.28.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

అంతేకాకుండా.. టొయోటా ఇటీవలే తమ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో సరికొత్త 2021 మోడల్‌ను థాయ్‌ల్యాండ్ మార్కెట్లో ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లు, సరికొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చూడటానికి మరింత అందంగా, నడపటానికి మరింత సౌకర్యంగా మరియు విలాసవంతంగా ఉండేలా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేశారు. త్వరలోనే ఈ మోడల్ భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో టొయోటా ఇన్నోవాకి ఉన్న క్రేజే వేరు. ఎమ్‌పివి సెగ్మెంట్లో అత్యధికంగా అమ్మడవుతున్న మోడల్ ఇది. పీపుల్స్ క్యారియర్‌గా, బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పివిగా, క్యాబ్ డ్రైవర్లు మెచ్చే వాహనంగా దీనికి మంచి డిమాండే ఉంది. ధరలు పెరిగినప్పటికీ ఈ మోడల్ మీద క్రేజ్ మాత్రం తగ్గదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మరి కస్టమర్లు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








