రెనో కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.70,000 వరకూ డిస్కౌంట్స్!
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో భారత మార్కెట్లో అమ్మకాల పరంగా వెనుకంజలో ఉంది. గడచిన నెలలో కంపెనీ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగలేదు. దీంతో రెనో ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్ల క్రింద తమ ఉత్పత్తులపై భారీ మొత్తంలో రూ.70,000 వరకూ డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది.

రెనో ఈ డిసెంబర్ నెలలో తమ అమ్మకాలను పెంచుకునేందుకు భారత విపణిలో విక్రయిస్తున్న మూడు మోడళ్ల (క్విడ్, ట్రైబర్, డస్టర్)పై ఆకర్షణీయమైన తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను ప్రకటించింది. ఈ మూడు మోడళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, వివిధ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు మరియు అనేక ఇతర ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది.

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ డిసెంబర్ నెలలో గరిష్టంగా రూ.70,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటుగా పలు రకాల ఫైనాన్స్ ఆప్షన్లు కూడా కంపెనీ అందిస్తోంది. ఈ డిసెంబర్ నెలలో రెనో అందిస్తున్న మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి:

రెనో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.45,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి. ఇవే కాకుండా, రెనో క్విడ్‌పై కంపెనీ రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.

రెనో ఇండియా అందిస్తున్న బడ్జెట్-ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎమ్‌పివి రెనో ట్రైబర్‌పై కంపెనీ గరిష్టంగా రూ.50,000 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి. లభిస్తుంది. రెనో క్విడ్ మాదిరిగానే, ట్రైబర్ ఎమ్‌పివిపై కూడా కంపెనీ రూ.9,000ల కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

రెనో అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్‌పై కంపెనీ అత్యధిక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో టర్బో వేరియంట్‌పై రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో కార్పొరేట్ డిస్కౌంట్ రూ.30,000 మరియు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఈజీ కేర్ ప్యాకేజీ ఇవ్వబడుతోంది. ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 వరకు నగదు తగ్గింపు మరియు రూ.20,000 వరకూ లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి.

ఇకపోతే, రెనో డస్టర్ డీజిల్ వేరియంట్లపై కంపెనీ రూ.50,000 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 కార్పోరేట్ డిస్కౌంట్‌తో పాటు, రూ.20,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉన్నాయి. కాకపోతే, డీజిల్ వేరియంట్లపై కంపెనీ ఎలాంటి క్యాష్ డిస్కౌంట్లను ఆఫర్ చేయడం లేదు.

రెనో ఇండియా అందిస్తున్న ఈ మూడు మోడళ్లపై కేవలం నగదు తగ్గింపులు, వివిధ రకాల ప్రయోజనాలనే కాకుండా, కంపెనీ వీటిపై ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. పైన పేర్కొన్న అన్ని డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు ఆఫర్లు డిసెంబర్ 1, 2020వ తేదీ నుండి డిసెంబర్ 31, 2020వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయి.

రెనో ఇండియా గడచిన నెలలో కూడా దీపావళి పండుగ సందర్భంగా తమ ఉత్పత్తులపై ఇదేరకమైన ఆఫర్లను ప్రకటించింది. అయినప్పటికీ, రెనో అమ్మకాల పరంగా నవంబర్ 2020లో వెనుకంజలో ఉంది. అయితే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే (నవంబర్ 2019) మాత్రం కంపెనీ అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు.

మరోవైపు రెనో, భారత మార్కెట్లో తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఓ సరికొత్త మాస్ ప్రోడక్ట్‌ని దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అదే రెనో కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. రెనో ఇండియా ఇప్పటికే ఈ మోడల్‌కి సంబంధించిన కాన్సెప్ట్ వివరాలను అధికారికంగా వెల్లడి చేసింది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రెనో కిగర్ మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.

కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రెనో అనుబంధ సంస్థ నిస్సాన్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగానే ముందుగా భారత మార్కెట్లో విడుదల చేసి, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నారు. రెనో నుండి అత్యంత పాపులర్ అయిన ట్రైబర్ కాంపాక్ట్ ఎమ్‌పివి మాదిరిగానే కిగర్‌ను అదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ట్రైబర్ మాదిరిగానే కిగర్ కూడా మంచి విజయాన్ని సాధించగలదని కంపెనీ ధీమాగా ఉంది.


Click it and Unblock the Notifications








