భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi (ఆడి) భారతీయ మార్కెట్లో ఇప్పటికే అనేక లగ్జరీ వాహనాలను విడుదల చేసి, అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ తరుణంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మరొక కొత్త సెకండ్ జనరేషన్ 2021 Audi Q5 Facelift (2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్) ను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

2021 Audi Q5 Facelift ను గత ఏడాది జూన్‌లో కంపెనీ ఈ కారును ప్రపంచవ్యాప్తంగా వెల్లడించింది. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఈ Q5 Facelift లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది. కంపెనీకి అందిన సమాచారం ప్రకారం, 2021 Audi Q5 Facelift నవంబర్‌లో భారతదేశంలో విడుదల కానుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

2021 Audi Q5 Facelift చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కొత్త Facelift మునుపెన్నడూ లేని విధంగా స్పోర్టియర్‌గా కనిపిస్తోంది. ఈ కారు యొక్క ముందు భాగంలో హనీ కూంబ్ నమూనాతో పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఉంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

2021 Audi Q5 Facelift యొక్క ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కస్టమైజ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లతో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. వీటితో పాటు కారు యొక్క టెయిల్‌గేట్ కూడా మార్చబడింది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

Audi Q5 Facelift యొక్క వెనుక భాగం కూడా చాలా స్పోర్టీగా ఉంటుంది. ఈ కొత్త కారు మునుపటి మోడల్ కంటే కూడా చాలా వెడల్పుగా కనిపిస్తుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ అల్ట్రా బ్లూ మరియు డిస్ట్రిక్ట్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ కొత్త Audi Q5 Facelift చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

Audi Q5 Facelift యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, సాధారణ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్యాబిన్ మరియు కొత్త క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ మధ్య చాలా పోలికలు ఉండవచ్చు. అయితే, సెంటర్ కన్సోల్‌లోని డ్యూయల్-డిస్‌ప్లే సెటప్ తొలగించబడింది. అయితే ఇందులో లేటెస్ట్ 10.1 ఇంచెస్ ఎమ్ఎమ్ఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

ఇవి మాత్రమే కాకుండా ఇందులో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కొత్త 2021 ఆడి క్యూ 5 ఫేస్‌లిఫ్ట్‌లో అందించబడతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగారూలకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

Audi కంపెనీ ఇప్పటికే తన Q5 Facelift ను ఐరోపా మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో విడుదల చేసింది. కానీ భారతదేశంలో లాంచ్ చేయబడే 2021 Q5 Facelift పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే లాంచ్ చేయబడే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త కారులో 12-వోల్ట్ లైట్ వెయిట్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇది A6 వలె, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో, కంపెనీ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజిన్ శక్తిని తన నాలుగు చక్రాలకు ప్రసారం చేస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త 2021 Audi Q5 Facelift; వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Audi Q5 Facelift ధర అధికారికంగా ప్రకటించబడలేదు, కానీ ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 55 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదల చేసే అవకాశం ఉంటుంది. భారతీయ మార్కెట్లో Audi Q5 Facelift కొత్త Mercedes-Benz GLC (మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్), BMW X3 (బీఎండబ్ల్యూ ఎక్స్3), Lexus NX (లెక్సస్ ఎన్ఎక్స్) మరియు Volvo XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Audi కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త Audi e-Tron GT (ఆడి ఈ-ట్రోన్ జిటి) మరియు Audi RS e-Tron GT (ఆడి ఆర్ఎస్ ఈ-ట్రోన్ జిటి) ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. Audi RS e-Tron GT ధర రూ. 1.80 కోట్లు (ఎక్స్-షోరూమ్) కాగా, Audi RS e-Tron GT ధర రూ. 2.05 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, October 1, 2021, 11:57 [IST]
English summary
2021 audi q5 facelift launch timeline officially revealed features engine details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+