భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi (ఆడి) భారతీయ మార్కెట్లో తన కొత్త Audi e-Tron GT (ఆడి ఈ-ట్రోన్ జిటి) మరియు Audi RS e-Tron GT (ఆడి ఆర్ఎస్ ఈ-ట్రోన్ జిటి) ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోడల్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటాయి. కంపెనీ యొక్క Audi RS e-Tron GT ధర రూ. 1.80 కోట్లు (ఎక్స్-షోరూమ్) కాగా, Audi RS e-Tron GT ధర రూ. 2.05 కోట్లు (ఎక్స్-షోరూమ్). Audi కంపెనీ ఇడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసినఈ కొత్త మోడల్స్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలు

చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్ నుండి లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే రూ. 10 లక్షల ముందస్తు బుకింగ్స్ తో బుక్ చేసుకోవాలి.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

Audi కంపెనీ తన Audi e-Tron GT మరియు Audi RS e-Tron GT లను ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తోంది. Audi కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్స్ తో కంపెనీ ఫోర్డ్ ఫోలియోలో నాలుగు కార్లు చేరాయి. కంపెనీ ఇదివరకు దేశీయ మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్ మరియు ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్స్ లో అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ డిజైన్ అందించింది. ఇందులోని ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్ లేజర్ మరియు డైనమిక్ లైట్ సీక్వెన్సింగ్‌తో ఉపయోగించబడింది. బోనెట్ పొడవుగా ఉంది. ఇందులో బూట్ స్పేస్ కూడా వినియోగదారులకు అనుకూలంగా ఉంది.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

బోనెట్ ముందు భాగంలో స్టైలిష్ ఆడి లోగో ఇవ్వబడింది. ఇందులోని హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ చాలా సొగసైనది మరియు ఈ యూనిట్‌లో టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్ లో ఎక్కువ భాగం బ్లాక్ ఫినిష్‌లో ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. అంతే కాకుండా ఇందులో యాక్టివ్ రియర్ స్పాయిలర్, ఫిక్స్‌డ్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్‌ఈడీ రియర్ కాంబినేషన్ లాంప్‌తో డైనమిక్ టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రికల్, అడ్జస్టబుల్, ఫోల్డింగ్, మెమరీతో ఆటో డిమ్మింగ్, హీటెడ్ ఎగ్జిట్ మిర్రర్‌లను పొందుతుంది. ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క డిజైన్ ని మరింత ఆకర్శణీయంగా చేస్తాయి.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

ఇక ఈ ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ క్వాలిటీ ప్యాకేజీ, నప్పా లెదర్ అపోల్స్ట్రే, మసాజ్ మరియు ఫ్రంట్ సీట్ వెంటిలేషన్‌తో 18-వే అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సీట్స్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ, 3-జోన్ ఎయిర్ కండిషనింగ్ మరియు కంఫర్ట్-కీ ఫీచర్స్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

ఇవి మాత్రమే కాకుండా, ఇందులో ఆడి వర్చువల్ కాక్‌పిట్, 3 డి సౌండ్‌తో బి అండ్ ఓ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఆడి ఫోన్ బాక్స్ వంటి అధునాతన ఫీచర్స్ అన్నీ కూడా కంపెనీ ఇందులో అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్, ESC, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా మరియు లేన్ డిపార్చర్ అలెర్ట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుని భద్రతను నిర్దేశిస్తాయి.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

కొత్త Audi e-Tron GT వెర్షన్ లో 83.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 475 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం 245 కిమీ/గం.

భారత్‌లో విడుదలైన Audi e-Tron GT మరియు RS e-Tron GT; ధర & వివరాలు

అదేవిధంగా కంపెనీ యొక్క Audi RS e-Tron GT వేరియంట్ 93.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది దాని ఎలక్ట్రిక్ మోటార్ తో 590 బిహెచ్‌పి పవర్ మరియు 830 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇది చాలా వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్స్. ఈ-ట్రోన్ జిటి పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుండగా, ఆర్‌ఎస్ ఈ-ట్రోన్ జిటి 481 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi launched 2021 e tron gt in india find here price feature details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X