Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi India గడచిన జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రోన్ (e-Tron) లో కంపెనీ ఇప్పుడు GT వేరియంట్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఇందులో భాగంగా కంపెనీ నేటి (సెప్టెంబర్ 8, 2021వ తేదీ) నుండి Audi e-Tron GT (ఆడి ఇ-ట్రోన్ జిటి) కోసం బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ బుకింగ్ అడ్వాన్స్ ను రూ. 10 లక్షలుగా నిర్ణయించింది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు రూ. 10 లక్షల టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ e-Tron కన్నా ఎక్కువ శక్తిని కలిగిన పెర్ఫార్మెన్స్ వేరియంట్ గా ఉంటుంది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ లో ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత మార్కెట్ కు దిగుమతి చేసుకోనున్నారు.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

అంతర్జాతీయ మార్కెట్లలో Audi ఇప్పటికే ఈ రెండు వేరియంట్లను విక్రయిస్తోంది. Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారులో 85 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు స్టాండర్డ్ మోడల్ 469 hp శక్తిని విడుదల చేస్తుండగా, RS వేరియంట్ 590 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

స్టాండర్డ్ ఫోర్-డోర్ల కూప్ EV పూర్తి ఛార్జ్‌ పై 487 కిమీ డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా RS ట్రిమ్ పూర్తి చార్జ్ పై 471 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Audi e-Tron GT కేవలం 4.1 సెకన్లలో సున్నా నుండి గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. స్టాండర్డ్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 245 కిమీ గా ఉంటుంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

కాగా, ఇందులోని ఆర్ఎస్ వెర్షన్ కేవలం 3.3 సెకన్లలో ఈ వేగాన్ని సాధించగలదు. అలాగే, ఈ స్పోర్టీయర్ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 250 కిమీ గా ఉంటుంది. Audi మరియు Porsche సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు బరువు సుమారు 2300 కిలోలుగా ఉంటుంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఈ ఎలక్ట్రిక్ కూప్ లో 2 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది మరియు ఇది బ్యాటరీ నుండి వచ్చే శక్తిని వెనుక యాక్సిల్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌ కు శక్తిని అందిస్తుంది. అధిక రేంజ్ మరియు వేగవంతమైన పనితీరును అందిచడానికి ఈ గేర్‌బాక్స్ మొదటి కారక నిష్పత్తి మరియు దీర్ఘ కారక నిష్పత్తి అని రెండు గేర్లను కలిగి ఉంటుంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఈ కారు ఆడి యొక్క క్వాట్రో ఆల్ -వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనున్నట్లు సమాచారం. ఈ కారులో లభించబోయే ప్రధాన ఫీచర్ల గమనిస్తే, ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, మల్టిపుల్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ మరియు 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

అంతేకాకుండా, Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారులో వివిధ రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు మరియు అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. మొదటి చూపులోనే ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఓ ఫోర్డ డోర్ వెర్షన్ కూప్ మాదిరిగా కనిపిస్తుంది. ఆడి సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ లో ఇ-ట్రోన్ జిటి యొక్క డీటేలింగ్స్ నూ కూడా గమనించవచ్చు.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఈ కారులోని ఇతర డిజైన్ ఎలిమెంట్స్ ను గమనిస్తే, వాలుగా ఉండే పైకప్పు, వైడ్ ట్రాక్, బ్రాడ్ షోల్డర్ లైన్ మరియు తక్కువ ఎత్తులో ఉన్న బోనెట్ వంటి అంశాలు ఉన్నాయి. ఇంకా ఇందులో పూర్తిగా ఎల్‌ఈడి లైట్లు (హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ అన్నీ కూడా) ఉపయోగించబడ్డాయి.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

భారత మార్కెట్లో Audi e-Tron GT ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.6 కోట్లు ఉంటుందని అంచనా. బహుశా, ప్రస్తుతానికి ఇదే భారతదేశంలో కెల్లా అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనంగా ఉండే అవకాశం ఉంది. Audi 2025 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో కనీసం 15 శాతం మార్కెట్ వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

భారత మార్కెట్లో Audi e-Tron GT డెలివరీలు అక్టోబర్ 2021 నుండి ప్రారంభం అవుతాయని అంచనా. Audi e-Tron GT అంతర్జాతీయ మార్కెట్లలో Tesla Model S, Mercedes Benz EQC మరియు Porsche Taycan EV వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

అప్పుడే అమ్ముడైపోయిన Audi e-Tron ఫస్ట్ బ్యాచ్...

ఇదిలా ఉంటే, Audi భారత మార్కెట్లో విడుదల చేసిన తమ e-Tron ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చిన మొదటి 20 రోజుల్లోనే ఫస్ట్ బ్యాచ్ పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. Audi e-Tron 50 మరియు e-Tron 55 మరియు e-Tron Sportback అనే మూడు వేరియంట్లలో విడుదల చేసింది.

Audi e-Tron GT కోసం బుకింగ్స్ షురూ.. అడ్వాన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

భారత మార్కెట్లో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధలు రూ.99.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంటుంది. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 8, 2021, 17:46 [IST]
English summary
Audi e tron gt bookings officially opened in india details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+