హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన జూలై 2021లో అమ్మకాల పరంగా 25.8 శాతం వృద్ధిని సాధించి, దేశీయ మార్కెట్లో 48,042 యూనిట్ల కార్లను విక్రయించింది. కాగా, ఇప్పుడు ఆగష్టు 2021 నెలలో కూడా ఇదే జోరును కొనసాగించడానికి కంపెనీ తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

హ్యుందాయ్ ఔరా

హ్యుందాయ్ విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ ఔరాపై కంపెనీ ఈ నెలలో మొత్తం రూ.50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో రూ.35,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి. మరోవైపు, ఇందులోని సిఎన్‌‌జి వేరియంట్‌లపై కంపెనీ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

ఆగస్ట్ నెలలో ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి. ఇందులో కూడా సిఎన్‌‌జి వేరియంట్‌లపై కంపెనీ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను కంపెనీ అందిస్తోంది.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

హ్యుందాయ్ శాంత్రో

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'శాంత్రో'పై ఈ నెలలో కంపెనీ మొత్తం రూ.40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ మోడల్‌లోని ఎరా మరియు సిఎన్‌జి వేరియంట్‌లపై కంపెనీ రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 పై కంపెనీ ఈ నెలలో రూ.40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో టర్బో ఐఎమ్‌టి వేరియంట్‌పై రూ.25,000 క్యాష్‌బ్యాక్, రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నారు. అలాగే, ఇందులోని డీజిల్ వేరియంట్‌లపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

పైన పేర్కొన్న మోడళ్లు మినహా, ఇతర హ్యుందాయ్ కార్లపై కంపెనీ ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు. కంపెనీ ఇటీవలే తమ సరికొత్త 6/7-సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కాజార్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో హ్యుందాయ్ అల్కాజార్ ధరలు రూ.16.30 లక్షల నుండి రూ.20.14 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

హ్యుందాయ్ నుండి అత్యంత పాపులర్ అయిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అల్కజార్‌ను రూపొందించారు. ఈ ప్రీమియం ఎస్‌యూవీ ప్రెస్టీజ్, ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే మూడు ట్రిమ్‌లలో విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

ఈ కారులో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్, మాన్యువల్ సన్ బ్లైండ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మోనిటర్, బోస్ ప్రీమియం స్పీకర్ సిస్టమ్, పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టాన్ లెదర్ సీట్స్ మరియు డాష్‌బోర్డ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, అల్కజార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 2.0-లీటర్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్‌ను మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లోని 1.5-లీటర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

హ్యుందాయ్ అల్కాజార్‌ను కోసం కంపెనీ ఇటీవలే అధికారిక యాక్ససరీ ప్యాక్స్ వివరాలను కూడా వెల్లడి చేసింది. ఈ యాక్ససరీ ప్యాక్స్‌తో కస్టమర్లు తమ ఫేవరెట్ హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీని మరింత అందంగా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ కార్లపై ఆగస్ట్ 2021 ఆఫర్స్.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?

ఈ యాక్ససరీ ప్యాక్‌లలో డార్క్ ప్యాక్, సుప్రీం ప్యాక్, మెజెస్టిక్ ప్యాక్ మరియు ఎలివేట్ ప్యాక్ అనే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. ఈ యాక్ససరీ ప్యాక్‌ల ధరలు వరుసగా రూ.12,715, రూ.30,898, రూ.24,900 మరియు రూ.15,502 గా ఉన్నాయి. - పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Article Published On: Tuesday, August 10, 2021, 14:08 [IST]
English summary
August 2021 offers and discounts on hyundai santro i20 grand i10 nios and aura details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+