హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎస్‌యూవీ అల్కాజార్‌ను కోసం కంపెనీ అధికారిక యాక్ససరీ ప్యాక్స్ వివరాలను వెల్లడించింది. ఈ యాక్ససరీ ప్యాక్స్‌తో కస్టమర్లు తమ ఫేవరెట్ హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీని మరింత అందంగా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

జూన్ 18న హ్యుందాయ్ తమ అల్కజార్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ 6 సీట్లు లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభ్యమవుతుంది. దేశీయ విపణిలో హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ ధరలు రూ.16.30 లక్షల నుంచి రూ.20.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇధి ప్రెస్టీజ్, ప్రీమియం మరియు సిగ్నేచర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

తాజాగా, హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీ కోసం అఫీషియల్ యాక్ససరీ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైన యాక్ససరీ ప్యాకేజీలతో పాటుగా, కంపెనీ ఇతర రిటైల్ యాక్ససరీస్ వివరాలను కూడా వెల్లడి చేసింది. ఈ యాక్ససరీ ప్యాక్‌లలో మొత్తం నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. అవి: డార్క్ ప్యాక్, సుప్రీం ప్యాక్, మెజెస్టిక్ ప్యాక్ మరియు ఎలివేట్ ప్యాక్.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

వీటిలో మొదటగా డార్క్ యాక్సెసరీస్ ప్యాక్ విషయానికి వస్తే, ఇందులో అల్కజార్ ఎస్‌యూవీ కోసం కంపెనీ 3డి ఫ్లోర్ మాట్, హెడ్‌ల్యాంప్ గార్నిష్, నంబర్ ప్లేట్ గార్నిష్, టెయిల్ లాంప్ గార్నిష్, క్రోమ్ డోర్ సైడ్ మోల్డింగ్ వంటి యాక్ససరీలను అందిస్తోంది. మార్కెట్లో ఈ ప్యాక్ ధర రూ.12,715 లుగా ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

ఇక సుప్రీం యాక్సెసరీస్ ప్యాక్ విషయానికి వస్తే, ఇందులో డార్క్ యాక్ససరీస్ ప్యాక్‌లో లభించే వాటితో పాటుగా బూట్ మ్యాట్, సైడ్ ఫెండర్ క్రోమ్, డోర్ వైజర్, సన్‌షేడ్ (రియర్ క్వార్టర్ గ్లాస్ మరియు రియర్ విండ్‌షీల్డ్ కోసం), ప్రీమియం సీట్ కవర్, కార్ పెర్ఫ్యూమ్ మరియు కార్ పిల్లోలు లభిస్తాయి. ఈ ప్యాక్ ధర రూ.30,898 లుగా ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

మెజెస్టిక్ యాక్ససరీ ప్యాక్‌లో కంపెనీ బూట్ మ్యాట్, హెడ్‌ల్యాంప్ గార్నిష్, నంబర్ ప్లేట్ గార్నిష్, టెయిల్ లాంప్ గార్నిష్, డోర్ విజర్, క్రోమ్ డోర్ సైడ్ మోల్డింగ్, టూ-టోన్ ఫ్లోర్ మ్యాట్, సన్‌షేడ్ (రియర్ క్వార్టర్ గ్లాస్ మరియు రియర్ విండ్‌షీల్డ్ కోసం) మరియు కార్ పెర్ఫ్యూమ్‌లను అందిస్తోంది. ఈ ప్యాక్ ధర రూ.24,900 లుగా ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

ఇక చివరగా, ఎలివేట్ యాక్సెసరీస్ ప్యాక్‌లో కంపెనీ 3డి ఫ్లోర్ మ్యాట్, 3డి బూట్ మ్యాట్, డోర్ వైజర్, హెడ్‌ల్యాంప్ గార్నిష్, టెయిల్ లాంప్ గార్నిష్, క్రోమ్ డోర్ సైడ్ మోల్డింగ్, కార్ పెర్ఫ్యూమ్ మరియు కార్ పిల్లోలను అందిస్తోంది. ఈ ప్యాక్‌ను రూ.15,502 ధర అందిస్తున్నారు.

Accessories Price
Headlamp garnish ₹919
Fog lamp garnish ₹599
Chrome door side moulding ₹4,999
Black door side moulding ₹1,799
ORVM garnish ₹699
Chrome window beltline ₹2,599
Side fender chrome ₹999
Number plate garnish ₹1,299
Tail lamp garnish ₹2,499
Rear reflector garnish ₹999
Chrome bumper corner garnish ₹1,699
Rear boot garnish ₹1,299
Mud guard ₹199
Door visor ₹1,549
Rear aero diffuser ₹899
Finger guard ₹799
Door edge guard ₹399
Bonnet scoops (dummy) ₹999
Body cover ₹1,599 to ₹3,799
Seat covers ₹8,899 to ₹10,999
Two-tone mat ₹8,999
3D mat ₹2,999
Designer floor mats (all weather) ₹2,799
Floor mats ₹4,999
Designer floor mats ₹1,399 to ₹3,999
All weather mats ₹1,599 to ₹1,999
Boot mat ₹499
3D boot mat ₹899
Rear sill guard ₹1,299
Sunshades ₹1,499 to ₹3,499
Emergency safety kit ₹4,999
Car vacuum cleaner ₹1,999
Mobile charger ₹688
Back seat organiser ₹799
Boot organiser ₹1,652
Tyre inflator ₹3,043
Tyre puncture repair kit ₹299
Seatbelt cover ₹379
Car care kit ₹1,399
Tissue box ₹599
Air purifier ₹5,999
హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

కేవలం ఈ యాక్ససరీ ప్యాక్‌లే కాకుండా, హ్యుందాయ్ అల్కాజార్ కోసం కంపెనీ రిటైల్ యాక్ససరీలను కూడా అందిస్తోంది. కస్టమర్లు తమకు నచ్చిన యాక్ససరీలను విడిగా కొనుగోలు చేసుకోవచ్చు. వీటిలో హెడ్‌ల్యాంప్ గార్నిష్ - రూ.919, ఫాగ్ లాంప్ గార్నిష్ - రూ.599, క్రోమ్ డోర్ సైడ్ మోల్డింగ్ - రూ.4,999, బ్లాక్ డోర్ సైడ్ మోల్డింగ్ - రూ.1,799, ఓఆర్‌విఎం గార్నిష్ - రూ.699, క్రోమ్ విండో బెల్ట్‌లైన్ - రూ.2,599 ఉన్నాయి.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

ఇంకా సైడ్ ఫెండర్ క్రోమ్ - రూ.999, నంబర్ ప్లేట్ గార్నిష్ - రూ.1,299, టెయిల్ లాంప్ గార్నిష్ - రూ.2,499, రియర్ రిఫ్లెక్టర్ గార్నిష్ - రూ.99, క్రోమ్ బంపర్ కార్నర్ గార్నిష్ - రూ.199, డోర్ వైజర్ - రూ.1,549 మరియు రియర్ ఏరో డిఫ్యూజర్ - రూ.899 లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ అల్కజార్ అఫీషియల్ యాక్ససరీ ప్యాక్స్ వెల్లడి: ధరలు, వివరాలు

హ్యుందాయ్ అల్కజార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్‌ను మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

Most Read Articles

English summary
Hyundai Alcazar SUV Official Accessory Packs Revealed: Price Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X