Just In
- 38 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 17 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- News
ఒక కూతురి కోసం రూ.10 వేలకు మరో కూతురి అమ్మకం కథ ... ఏపీలో మనసును పిండేసిన వ్యధ
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Sports
'అనుకోకుండా క్రికెటర్ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఉత్పత్తి ప్రారంభం, ఫిబ్రవరిలో ఆవిష్కరణ
ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన సిట్రోయెన్ తమ తొలి కారు 'సి5 ఎయిర్‌క్రాస్'ను ఆవిష్కరించనుంది. కంపెనీ ఇప్పటికే ఈ కారు ఉత్పత్తిని కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది.

తమిళనాడులోని తిరువళ్లూర్ ప్లాంట్‌లో కంపెనీ ఈ కారును తయారు చేస్తోంది. సిట్రోయెన్ ఈ ఎస్‌యూవీని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా విజయంవంతగా పరీక్షించింది. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతనే కంపెనీ దీని ఉత్పత్తి ప్రారంభించింది.

సిట్రోయెన్ భారతదేశంలో తమ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందే, అందుకు తగిన డీలర్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే, కంపెనీ భారతదేశంలో తమ మొట్టమొదటి కార్ షోరూమ్‌ను అహ్మదాబాద్‌లో ప్రారంభించింది.
MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి నుంచి మార్చ్ 2021) నాటికి సిట్రోయెన్ తమ మొట్టమొదటి కారు సి5 ఎయిర్‌క్రాస్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఈ కారుని ఆవిష్కరించిన తర్వాత, అప్పటి నుండే దీని బుకింగ్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. అదే సమయంలో కంపెనీ ఈ కారు ధర మరియు ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌లో హైడ్రాలిక్ కుషన్ అమర్చిన సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుందని, తద్వారా ఇది కఠినమైన భూభాగాలపై సైతం సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారులో ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్ మరియు వెనుక వరుసలో 3 పర్సనల్ అండ్ రిక్లైనింగ్ అడ్జస్టబల్ మాడ్యులర్ సీట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.
MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

బూట్ స్థలాన్ని పెంచడానికి ఇందులోని వెనుక సీట్లను పూర్తిగా మడుచుకునే వీలు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ టాప్ ఎండ్ వేరియంట్లలో పానరోమిక్ సన్‌రూఫ్ కూడా లభించే అవకాశం ఉంది. ఈ కారులో ప్రత్యేకమైన గ్రిప్ కంట్రోల్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ వంటి అధునాత ఫీచర్లు లభించనున్నాయి.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ టాప్ ఎండ్ వేరియంట్‌లలో ఫుట్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ ఫంక్షన్, 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

సిట్రోయెన్ తమ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని పవర్‌ఫుల్ 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో ఆఫర్ చేయనుంది. ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఎఫెక్టివ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మెరుగైన మైలేజీతో పాటు సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మార్కెట్లో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ధర రూ.25 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ టూసాన్, స్కొడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

కాగా, రానున్న రోజుల్లో సిట్రోయెన్ తమ లా మైసన్ థీమ్‌తో కూడిన షోరూమ్‌లను ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ మరియు కొచ్చి నగరాలలో కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ప్రతి సంవత్సరం ఓ కొత్త మోడల్‌ను విడుదల చేయాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.