2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

గతేడాది దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కూడా చిదిమేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆటో పరిశ్రమ నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. సంపూర్ణ లాక్‌డౌన్ కారణంగా గడచిన ఏప్రిల్ 2021 నెలలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి.

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

మే 2020 నెలలో లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించినప్పటికీ, ఆ పరిణామాల నుండి ఆటోమొబైల్ పరిశ్రమ తిరిగి కోలుకోవాటనికి చాలానే సమయం పట్టింది. గత ఆర్థిక సంవత్సరం (2020-2021)లో మొత్తం 27,06,924 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

ఇందులో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,93,840 యూనిట్ల కార్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 1,20,506 యూనిట్లు తగ్గాయి. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ అమ్మకాలు 8.52 శాతం తక్కువగా నమోదయాయ్యి.

MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీ XUV700; వివరాలు

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,71,535 యూనిట్ల కార్లను విక్రయించగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 13,774 యూనిట్లు తక్కువగా ఉన్నాయి. ఇవి 2020 ఆర్థిక సంవత్సరం యొక్క మొత్తం అమ్మకాల కంటే 2.84 శాతం తక్కువగా ఉన్నాయి. గతేడాది మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త తరం క్రెటా కారణంగా కంపెనీ అమ్మకాలు మెరుగుపడ్డాయి.

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

గడచిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధిని నమోదు చేసిన కొన్ని కంపెనీలలో టాటా మోటార్స్ కూడా ఒకటి. టాటా మోటార్స్ 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,22,011 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కంపెనీ 90,814 యూనిట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 69.22 శాతం ఎక్కువగా ఉంది.

OEM TY Total Growth Growth (%)
Maruti Suzuki 12,93,840 -1,20,506 -8.52
Hyundai 4,71,535 -13,774 -2.84
Tata Motors 2,22,011 90,814 69.22
Kia 1,55,539 70,515 82.79
Mahindra 1,55,539 -24,724 -13.72
Toyota 93,124 -20,957 -18.37
Renault 92,268 2,734 3.05
Honda 82,074 -19,942 -19.55
Ford 48,042 -58,669 -54.98
MG 35,597 13,643 62.14
Volkswagen 20,440 -5,296 -20.58
Nissan 18,884 845 4.68
Skoda 11,331 -3,110 -21.54
Fiat 6,553 -2,026 -23.62

MOST READ: భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

కొరియన్ కార్ బ్రాండ్ వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరంలో కూడా అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కియా సోనెట్ కారణంగా, కంపెనీ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. కియా మోటార్స్ 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,55,686 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 70,515 యూనిట్లు అధికంగా ఉన్నాయి. గత 2020 ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలతో పోలిస్తే, ఇవి 82.79 శాతం ఎక్కువగా ఉన్నాయి.

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా గడచిన 2021 ఆర్థిక సంవత్సరంలో 1,55,539 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 24,724 యూనిట్లు తక్కువగా ఉన్నాయి. ఇది 2020 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అమ్మకాల కంటే 13.72 శాతం తక్కువ. టొయోటా అమ్మకాలు కూడా 18.37 శాతం తక్కువగా నమోదయ్యాయి.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో తమ వార్షిక అమ్మకాలలో 3.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 92,268 యూనిట్లను విక్రయించింది. అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ గత ఆర్థిక సంవత్సరంలో 48,042 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో ఫోర్డ్ అమ్మకాలు కూడా 54.98 శాతం తగ్గాయి.

2020-2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల వారీగా కార్ల అమ్మకాలు

గడచిన ఆర్థిక సంవత్సరంలో చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ అమ్మకాలు అనూహ్యంగా 62 శాతం పెరగగా, ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు 20 శాతం తగ్గాయి. ఇదే సమయంలో నిస్సాన్ ఇండియా అమ్మకాలు 4 శాతం పెరిగగా, స్కొడా మరియు ఫియట్ బ్రాండ్ల అమ్మకాలు వరుసగా 21 శాతం మరియు 23 శాతం తగ్గాయి. ఈ ఏడాది కొత్తగా సిట్రోయెన్ అనే కార్ కంపెనీ భారత్‌లోకి ప్రవేశించింది.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

Source: Autopunditz

Most Read Articles

English summary
Company Wise Car Sales In FY20-21, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X