రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 600 డీజిల్ ఇంజన్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ క్వాలిటీ చెక్స్‌లో భాగంగా, ఈ కార్లలో ఉపయోగించిన డీజిల్ ఇంజన్లలో సాంకేతిక లోపం గుర్తించబడిందని, వాటిని ఉచితంగా సరిచేస్తామని కంపెనీ తెలిపింది.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

జూన్ 21, 2021వ తేదీ నుండి జూలై 2, 2021వ తేదీ మధ్యలో నాసిక్ ప్లాంట్లో తయారు చేసిన కార్లను మహీంద్రా రీకాల్ చేసింది. ప్రస్తుతానికి, రీకాల్ చేసిన కార్లలో ఏయే మోడల్స్ ఉన్నాయనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

కలుషిత ఇంధనం (కంటామినేటెడ్ ఫ్యూయెల్) కారణంగా ఈ డీజిల్ ఇంజన్లు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని, రీకాల్‌కు వర్తించే డీజిల్ వాహనాలను ఉచితంగా తనిఖీ చేసి, సమస్యలు ఏవైనా ఉంటే సరిచేస్తామని మహీంద్రా తమ ప్రకటనలో తెలిపింది.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

ఈ మరమ్మతు కోసం వినియోగదారుల నుండి ఎటువంటి చార్జీలు వసూలు చేయబడవని, ఈ రీకాల్ విషయంలో తామే వ్యక్తిగతంగా తమ కస్టమర్లను సంప్రదించి, వారి వాహనాన్ని కార్ సర్వీస్ సెంటర్‌కు తీసుకురావల్సిందిగా సూచిస్తామని మహీంద్రా పేర్కొంది.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

భారతదేశంలో ఐదవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ500, ఎక్స్‌యూవీ300, థార్, స్కార్పియో, బొలెరో వంటి ప్రముఖ ఎస్‌యూవీ మోడళ్లను విక్రయిస్తోంది.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

మహీంద్రా ఇటీవలే బొలెరో నియో పేరుతో ఓ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. గతంలో కంపెనీ విక్రయించిన టియూవీ300 ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కొత్త 2021 బొలెరో నియో ఎస్‌యూవీని తయారు చేశారు. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్-షోరూమ్‌)గా ఉంది. మహీంద్రా బొలెరో నియో పూర్తి టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

కొత్త మహీంద్రా బొలెరో నియో ఓవరాల్‌గా చూడటానికి పాత మహీంద్రా టియూవీ300 మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే, బొలెరో నియో ఎస్‌యూవీకి కొత్త అప్పీల్ ఇవ్వడానికి కొన్ని దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

మహీంద్రా బొలెరో నియో ఎన్4, ఎన్8 మరియు ఎన్10 అనే మూడు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ కారులో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ (మాన్యువల్), కీలెస్ ఎంట్రీ మరియు పవర్-అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

ఇంకా ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఏబిడి విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

రీకాల్ అలెర్ట్.. మహీంద్రా డీజిల్ కార్లలో ఇంజన్ సమస్యలు, 600 కార్లు వెనక్కి!

మహీంద్రా బొలెరో నియో 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంధనం ఆదా చేయటం కోసం ఇందులో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, ఎకో డ్రైవ్ మోడ్ కూడా ఉంటాయి.

Most Read Articles

English summary
Diesel Engine Issues: Mahidra Recalls 600 Cars, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X