మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా బొలెరో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన మోడల్. మహీంద్రా బొలెరో యొక్క ఫస్ట్ జనరేషన్ 2000 లో ప్రారంభించబడింది. ఈ మోడల్ ప్రారంభమైనప్పటి నుండి ప్రజల దృష్టికి బాగా ఆకర్షించగలిగింది. ముఖ్యంగా ఈ మోడల్ గ్రామీణ ప్రాతాల్లోని వారిని ఎక్కువగా ఆకర్షించగలిగి మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలోని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మార్కెట్లో ఇటీవల 'మహీంద్రా బొలెరో నియో' అనే కొత్త మోడల్ ని విడుదల చేసింది.

బొలెరో నియో సమర్థవంతమైన డ్రైవింగ్ కోసం ఎకో డ్రైవ్ మోడ్ మరియు ESS (ఎలక్ట్రానిక్ స్టార్ట్-స్టాప్) తో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. అదనంగా, SUV బ్రాండ్ యొక్క మల్టీ-టెర్రైన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. బొలెరో నియో రియర్-వీల్-డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇటీవల మహారాష్ట్రలోని చకాన్ వద్ద ఉన్న మహీంద్రా తయారీ కేంద్రానికి మమ్మల్ని ఆహ్వానించారు. మేము రెండు గంటలు పాటు ఈ కొత్త మహీంద్రా బొలెరో నియోని డ్రైవ్ చేసాము, ఈ కారు గురించి మరింత సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

డిజైన్ అండ్ స్టైల్:

మహీంద్రా యొక్క కొత్త బొలెరో నియో దాని సాధారణ బొలెరో మాదిరిగానే ఓల్డ్ బాక్సీ సిల్హౌట్‌ను అనుసరిస్తుంది. అయితే కాంపాక్ట్ ఎస్‌యూవీకి కొత్త అప్పీల్ ఇవ్వడానికి కొంత వరకు కొత్త డిజైన్ ఇవ్వబడింది. అయితే దీనిపై పాత మహీంద్రా టియువి 300 యొక్క డిజైన్ ప్రభావం కనిపిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బొలెరో నియో యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. ఇది హై బీమ్ మరియు లో బీమ్ కోసం రిఫ్లెక్టర్‌ను కలిగి ఉంటుంది. క్లస్టర్‌లో ఒక కార్నరింగ్ లైట్ కూడా ఉంటుంది. అంతే కాకుండా క్లస్టర్ పైన ప్రకాశవంతమైన ఎల్ఈడీ డిఆర్ఎల్ లను కలిగి ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులో 6 వర్టికల్ స్లాట్లతో ఒక మహీంద్రా సిగ్నేచర్ గ్రిల్ ను కూడా పొందుతారు, దీనితో పాటు ముందు భాగంలో క్రోమ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బంపర్ యొక్క దిగువ భాగంలో, ఫాగ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హుడ్‌లో కొన్ని లైన్స్ అండ్ క్రీజెస్ ఉన్నాయి. మీరు కారు నుండి దూరంగా ఉన్నప్పుడు గమనించినట్లయితే, ఫ్రంటెండ్ X షేప్ కలిగి ఉన్నట్లు గమనించవచ్చు.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 15 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కారు మొత్తం పరిమాణంతో బాగా సాగుతుంది. ఇది బాడీ-కలర్ ORVM లతో వస్తుంది. ఈ కారు యొక్క ముందు మరియు వెనుక భాగంలో ఫుట్ స్టెప్స్ ఉంటాయి. వీటి వల్ల మీరు వాహనం లోపలికి వెళ్లడం మరియు బయటికి రావడం చాలా సులభతరంగా ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కొత్త బొలెరో నియో చుట్టూ బాడీ క్లాడింగ్ లభిస్తుంది. దానితో పాటు కొన్ని డీప్ లైన్స్ మరియు క్రీజెస్ హెడ్ లైట్ నుండి టైల్ లైట్ వరకు విస్తరించి ఉంటాయి.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇక బొలెరో యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీకి ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ లభిస్తుంది, అది చాలా స్పోర్టిగా కనిపిస్తుంది. దాని క్రింద ఎల్‌ఈడీ స్టాప్ లైట్ బార్ ఉంటుంది. టైల్ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ ఒక X షేప్ కవర్ మరియు దాని పైన ‘బొలెరో' అని చెక్కబడి ఉంటుంది. టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ పక్కన బొలెరో నియో బ్యాడ్జింగ్‌ మరియు టెయిల్‌గేట్ యొక్క కుడి వైపున N10 (వేరియంట్) బ్యాడ్జింగ్‌ చూడవచ్చు. ఇది రివర్స్ పార్కింగ్ సెన్సార్లను కూడా కలిగి ఉంది. కానీ కెమెరా ఉండదు.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్:

కొత్త మహీంద్రా బొలెరో నియో యొక్క క్యాబిన్లోకి అడుగు పెట్టగానే మీకు విశాలమైన మరియు రిఫ్రెష్ క్యాబిన్ లభిస్తుంది. ఎందుకంటే ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లను ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ ఆటోమోటివ్ డిజైన్ సంస్థ పినిన్‌ఫరీనా రూపొందించింది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులోని డాష్‌బోర్డ్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్ పొందుతుంది. ఇది మంచి క్వాలిటీ గల ప్లాస్టిక్‌లతో తయారు చేయబడి ఉంటుంది. డోర్ ట్రిమ్ మరియు సెంటర్ కన్సోల్‌లో కూడా అదే ప్లాస్టిక్‌లు కనిపిస్తాయి. డాష్‌బోర్డ్ మధ్యలో స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇందులో మీరు వాలెట్ లేదా మొబైల్ ఫోన్ వంటివి ఉంచుకోవచ్చు.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇందులోకి క్యూబిహోల్ క్రింద 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. క్లైమేట్ కంట్రోల్ బటన్లు స్క్రీన్ క్రింద ఉంచబడ్డాయి, డీఐతో పాటు కొన్ని ఛార్జింగ్ సాకెట్లు కూడా ఉన్నాయి. పవర్ విండో కోసం స్విచ్‌లు హ్యాండ్‌బ్రేక్ పక్కన మరియు ఆ ప్రాంతం చుట్టూ ఉన్నాయి, మీకు స్మాల్ స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బొలెరో నియోకు మంచి స్టీరింగ్ వీల్ లభిస్తుంది, ఇది సాఫ్ట్-టచ్ మెటీరియల్‌తో చుట్టబడి ఉంటుంది, కావున ఇది మంచి పట్టుని అందిస్తుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎమ్ఐడి స్క్రీన్ ద్వారా టోగుల్ చేసే కొన్ని స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ పొందుతుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మధ్యలో ఉన్న ఎమ్ఐడి స్క్రీన్ 3.5 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉటుంది. ఇది వాహనం గురించి కావలసిన సమాచారం అందిస్తుంది. క్లస్టర్ సెమీ డిజిటల్. MID స్క్రీన్‌కు ఇరువైపులా టాకోమీటర్ మరియు స్పీడోమీటర్ ఉటాయి.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

కొత్త మహీంద్రా బొలెరో నియోలో డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు రెండూ మ్యాన్యువల్ గా అడ్జస్ట్ చేయబడతాయి, కాని డ్రైవర్ వైపు హైట్ అడ్జస్ట్ పొందుతుంది. ముందు సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి, కాని అండర్ థాయ్ సఫోర్ట్ లేదు. స్టీరింగ్ వీల్‌కు టిల్ట్ ఆప్సన్ మాత్రమే ఉండటం వల్ల, సరైన డ్రైవింగ్ పొజిషన్ కనుగొనటానికి కొంత సమయం పడుతుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

రెండవ వరుస సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముందు రెండు సీట్ల కంటే మెరుగైన అండర్-థాయ్ సఫోర్ట్ ఉంది. ఇక్కడ ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తుంటే, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను పొందవచ్చు. అయితే ఇక్కడ కప్ హోల్డర్లతో ఆర్మ్‌రెస్ట్ ఉంటే బాగుటుందని మేము ఆశిస్తున్నాము.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బొలెరో నియో యొక్క వెనుక భాగంలో ఒకదానికొకటి ఎదురుగా రెండు జంప్ సీట్లను పొందుతుంది మరియు అవి పిల్లలకు లేదా తక్కువ ఎత్తు ఉన్న వారికి సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి. లగేజ్ కోసం ఎక్కువ స్థలం కావాలనుకున్నప్పుడు జంప్‌సీట్లను ఫోల్డ్ చేయవచ్చు. ఈ ఎస్‌యూవీకి 384 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది మరియు ఇది రెండవ వరుసలో ఉంటుంది. లగేజ్ కోసం మీకు ఎక్కువ స్థలం అవసరమైతే, రెండవ వరుసను కూడా ఫోల్డ్ చేయవచ్చు.

Dimensions Mahindra Bolero Neo
Length 3,995mm
Width 1,795mm
Height 1,817mm
Wheelbase 2,680mm
Boot Space 384 Litres
Ground Clearance 160mm
మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

మహీంద్రా బొలెరో నియో 1.5 లీటర్ ఎంహాక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది టర్బో-డీజిల్ మోటారు, ఇది 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 260 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్టాండర్డ్ గా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. నియోలో పవర్ డెలివరీ మొదట కొత్త మందగించినట్లు అనిపిస్తుంది, కాని ఇందులో మంచి టార్క్ ఉన్నందున సజావుగా ముందుకు సాగుతుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బొలెరో నియో సమర్థవంతమైన డ్రైవింగ్ కోసం ఎకో డ్రైవ్ మోడ్ మరియు ESS (ఎలక్ట్రానిక్ స్టార్ట్-స్టాప్) తో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. అదనంగా, SUV బ్రాండ్ యొక్క మల్టీ-టెర్రైన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. బొలెరో నియో రియర్-వీల్-డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

క్లచ్ తేలికైనది, మరియు త్రో పొడవుగా ఉన్నప్పటికీ గేర్‌లను మార్చడం సులభం. స్టీరింగ్ వీల్ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉటుంది. ఈ కారు యొక్క పొడవైన వైఖరిని బట్టి, బాడీ రోల్ ఇవ్వబడుతుంది. టార్క్ గణాంకాలు కూడా బాగుంటాయి, కావున మీరు తక్కువ వేగంతో హై గేర్‌లో ఉన్నప్పుడు కూడా ఎస్‌యూవీ వేగాన్ని పెంచుతుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బొలెరో నియో ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. కావున ఎస్‌యూవీ కూడా ట్రిపుల్ డిజిట్ వేగంలో ఉన్నప్పుడు కూడా ఆపవచ్చు.

బొలెరో నియోలో సస్పెన్షన్ సెటప్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కావునా ఎలాంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

మేము ఈ కారుతో తక్కువ సమయం మాత్రమే ఉండటం వల్ల మైలేజ్ గణాంకాలను టెస్ట్ చేయలేదు. కానీ ఇది అర్బన్ ప్రాంతాల్లో ఒక లీటరుకు 12 కి.మీ మైలేజ్ అందించగా, హైవేపై 15 కి.మీ అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. అయితే వాస్తవ గణాంకాలను రోడ్ టెస్ట్ చేసినప్పుడు తెలియజేస్తాము. అప్పటివరకు వేచి ఉండక తప్పదు.

మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

సేఫ్టీ ఫీచర్స్:

మహీంద్రా బొలెరో నియోలోకి సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో

 • హై స్ట్రెంత్ స్టీల్ బాడీ షెల్
 • డ్రైవర్ మరియు కో డ్రైవర్ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు
 • ఏబీఎస్ విత్ ఈబీడీ
 • ఆటోమాటిక్ డోర్ లాక్
 • హై-స్పీడ్ అలెర్ట్ వార్ణింగ్
 • మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

  మహీంద్రా బొలెరో నియో కీ ఫీచర్స్:

  • 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 3.5 ఇంచెస్ MID డిస్ప్లే
  • అనలాగ్ డయల్స్
  • డ్రైవర్ & కో-డ్రైవర్ కోసం ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్
  • ఎసి వెంట్స్ పై కలర్ యాక్సెంట్స్
  • బ్లూటూత్
  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
  • క్రూయిజ్ కంట్రోల్స్
  • 6-స్పీకర్ ఆడియో సిస్టమ్
  • మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

   డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

   కొత్త మహీంద్రా బొలెరో నియో 5 డిఫరెంట్ షేడ్స్ మరియు నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. కావున కస్టమర్లు వారికి నచ్చిన దానిని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బొలెరో నియోలో నచ్చని కొన్ని విషయాలు ఏమిటంటే, డోర్ ఒకేసారి మూసివేయబడదు, కావున దీనికి కొంత శక్తిని ప్రయోగించాలి.

   మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

   NVH మరియు ఇన్సులేషన్ లెవల్స్ మెరుగ్గా ఉంటాయి మరియు 3,000 ఆర్‌పిఎమ్ మార్క్ తర్వాత ఇంజిన్ బే నుండి చాలా శబ్దం క్యాబిన్లోకి వస్తుంది. గేర్ లివర్ తటస్థంగా ఉన్నప్పుడు కూడా చాలా వైబ్రేషన్ కలిగి ఉంటుంది. దీనితో పాటు డోర్ ప్యానల్స్ కొంచెం గట్టిగా ఉండాలి. ఈ ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్‌లో ప్రత్యక్ష పోటీదారులు లేదు.

   మహీంద్రా బొలెరో నియో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

   ఇవి కాకూండా బొలెరో నియో నిజంగా చాలా అద్భుతమైన వెహికల్, ఇది కొన్ని ఆఫ్-రోడింగ్ కూడా చేయగలదు. రియర్ వీల్-డ్రైవ్ సెటప్‌తో ల్యాడర్-ఆన్-ఫ్రేమ్ చాసిస్ ద్వారా దీనికి భారత మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థిని కలిగి లేదు. కావున మీరు ఒక మంచి కారు కోసం ఎదురు చూస్తున్నట్లైతే కొత్త మహీంద్రా బొలెరో నియో తప్పకుండ మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Mahindra Bolero Neo First Drive Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X