మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా (Ford India) భారతదేశానికి బైబై చెప్పిన సంగతి తెలిసినదే. భారతదేశంలోని తమ ప్లాంట్‌లు అన్నింటినీ త్వరలోనే మూసివేస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

ఈ పరిస్థితుల్లో Ford India చెన్నై ప్లాంట్ ఉద్యోగులు సహాయం కోసం తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగాలు పోకుండా చూసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించినట్లు వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

భారతదేశంలో పెరుగుతున్న నష్టాలు మరియు తగ్గుముఖం పడుతున్న కార్ల అమ్మకాల నేపథ్యంలో, Ford India దేశంలో తమ స్థానిక తయారీ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. బారత్‌‍లో సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టం రావటం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు Ford India తెలిపింది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

ఈ మేరకు 2021 నాల్గవ త్రైమాసికంలో గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌ ను మరియు 2022 రెండవ త్రైమాసికంలో చెన్నైలోని ప్లాంట్‌ ను మూసివేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 4,000 ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, తమ ఉద్యోగాల భద్రత కోసం Ford India చెన్నై ప్లాంట్ ఉద్యోగులు సహాయం కోరుతూ తమిళనాడు రాష్ట్ర మంత్రి టిఎమ్ అన్బరసన్ కు లేఖ రాశారు.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

Ford తమ చెన్నై ఫ్యాక్టరీని మూసివేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు నష్టపోవచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. ఫోర్డ్ ఆకస్మిక ప్రకటన వల్ల 2,600 మందికి పైగా శాశ్వత కార్మికులు మరియు 1,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది యొక్క జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని యూనియన్ సభ్యులు తెలిపారు.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

కాబట్టి, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వర్కర్లు తమ లేఖలో పేర్కొన్నారు. కార్మికులు డబ్బు సంపాదించగలిగే కొత్త ఉద్యోగాలను సృష్టించడం ద్వారా వారి జీవనోపాధిని కాపాడాలని వర్కర్స్ యూనియన్ అన్బరసన్‌ ను కోరింది. కాగా, చెన్నైలోని మరొక యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU), గత సోమవారం నాడు కంపెనీ నిర్వహణ మరియు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేసింది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

ఇదిలా ఉంటే, ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) భారతదేశంలో తమ డీలర్ నెట్‌వర్క్‌ను తిరిగి నింపడానికి Ford India చర్యలు తీసుకోవచ్చునని తెలియజేసింది. Ford తన ప్రస్తుత కస్టమర్లకు సేవను కొనసాగిస్తుందని కూడా తెలిపింది. Ford సర్వీస్ సెంటర్లు మరియు కస్టమర్ పాయింట్లు ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లను కలిగి ఉన్న కస్టమర్లకు సకాలంలో సర్వీస్ అందించడానికి ఫ్యాకట్రీ షట్డౌన్ తర్వాత కూడా తెరిచి ఉంటాయని పేర్కొంది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

ప్రస్తుతం Ford భారతదేశంలోని సనంద్ (గుజరాత్) మరియు చెన్నై (తమిళనాడు) ప్లాంట్లలో కార్లను తయారు చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ రెండు తయారీ ప్లాంట్లలో దేశీయ మార్కెట్ కోసం కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే, ఈ ప్లాంట్లలో ఫోర్డ్ కంపెనీ విదేశాలకు ఎగుమతి చేసే ఇంజన్ ల తయారీ మాత్రం కొనసాగిస్తూనే ఉంటుందని చెబుతున్నారు.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, Ford India గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో నష్టాను చవిచూస్తోందని, దీని కారణంగా కంపెనీ ఇప్పటి వరకూ 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయిందని తెలిపింది. భారతదేశంలో ఈ బ్రాండ్ అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్నాయి మరియు గత కొన్ని సంవత్సరాలుగా కార్ల మార్కెట్ మందగమనం కారణంగా, వ్యాపారంలో ఎటువంటి వృద్ధికి అవకాశం లేకుండా పోయింది. ఈ అన్ని కారణాల వల్ల భారతదేశం నుండి నిష్క్రమించాలని ఫోర్డ్ నిర్ణయం తీసుకుంది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

Ford India ప్రస్తుతం భారతదేశంలో Endeavour (ఎండీవర్), EcoSport (ఎకోస్పోర్ట్), Figo (ఫిగో), Figo Aspire (ఫిగో ఆస్పైర్) మరియు Freestyle (ఫ్రీస్టైల్) మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఫోర్డ్ కార్ల కోసం వేచి ఉన్న కస్టమర్ల ఆర్డర్లు మరియు డీలర్ల వద్ద స్టాక్ క్లియర్ కాగానే, కంపెనీ తమ ఫ్యాక్టరీలలో కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

అయితే, ఫోర్డ్ భారతదేశంలో వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, కంపెనీ తమ హై-ఎండ్ కార్లను భారతదేశానికి ఎగుమతి చేస్తామని తెలిపింది. అంటే, దేశంలో ప్రత్యక్ష వ్యాపారానికి స్వస్తి పలికి, పరోక్షంగా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఫోర్డ్ సిద్ధంగా ఉంది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో ఫోర్డ్ తమ కార్లను విదేశాలను భారతదేశానికి ఎగుమతి చేసి, ఇక్కడి మార్కెట్లో వ్యాపారం చేయనుంది.

మేం రోడ్డున పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: Ford India వర్కర్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ తమ Mustang Mach-e (మస్టాంగ్ మాక్-ఇ) ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా భారత్‌ కి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో దీని అమ్మకాలు 2022 నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. - ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india chennai plant workers seek tamilnadu government intervention details
Story first published: Wednesday, September 15, 2021, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X