ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

గత సెప్టెంబర్ 2021 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఫుల్ సైజ్ ఎస్‌యూవీల వివరాలు వెల్లడయ్యాయి. ఈ విభాగం నుండి ఫోర్డ్ ఎండీవర్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ నిష్క్రమించడంతో, టొయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఈ జాబితాలో టొయోటా ఫార్చ్యూనర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

సెప్టెంబర్ 2020 నెలలో టొయోటా భారత మార్కెట్లో 1,045 ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను విక్రయించింది. కాగా, అవి ఈ ఏడాది సెప్టెంబర్ 2021 నెలలో 1,869 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో టొయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలు 79 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇప్పటి వరకూ ఈ మోడల్ కి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫోర్డ్ ఎండీవర్ భారత మార్కెట్ నుండి తొలగిపోవడంతో, ఎండీవర్ కస్టమర్లు కూడా ఫార్చ్యూనర్ వైపుకు మొగ్గు చూపుతున్నారు.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

భారత కార్ మార్కెట్లోని ఇతర విభాగాల్లో అమ్మకాలు తగ్గుముఖం పడుతుంటే, టొయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలు మాత్రం ఇంతటి భారీ వృద్ధిని సాధించడం విశేషం. రాబోయే నెలల్లో కూడా టొయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఫోర్డ్ భారత మార్కెట్‌ ని విడిచిపెట్టడమే.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

భారతదేశంలో వచ్చిన భారీ నష్టాల కారణంగా ఫోర్డ్ తన కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఇకపై టొయోటా ఫార్చ్యూనర్‌ కు అమ్మకాలలో పోటీగా ఉండదు. టొయోటా కూడా దీనిని చక్కగా ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు. ఫలితంగా, టొయోటా ఫార్చ్యూనర్ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

గత సెప్టెంబర్‌ 2021 లో అత్యధికంగా అమ్ముడైన ఫుల్ సైజ్ ఎస్‌యూవీలలో ఎమ్‌జి గ్లోస్టర్ ద్వితీయ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 2021 లో ఎమ్‌జి మోటార్, మొత్తం 292 గ్లోస్టర్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విక్రయించింది. ఎమ్‌జి గ్లోస్టర్ అక్టోబర్ 2020 లో భారత మార్కెట్లో విడుదలైంది కాబట్టి, సెప్టెంబర్ 2020 నెల అమ్మకాలతో ఈ మోడల్ ని పోల్చలేము.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్, భారతదేశంలో ఎస్‌యూవీని మార్కెట్ ని ప్రధానంగా టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి హెక్టర్, హెక్టర్ ప్లస్, జెడ్ఎస్ ఎలక్ట్రిక్ మరియు గ్లోస్టర్ అనే మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఇటీవలే ఈ కంపెనీ ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీ (ఆస్టర్) ను కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

భారత మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీని కంపెనీ రూ. 9.78 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయిస్తోంది. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో కంపెనీ అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ టూసాన్ (టక్సన్) అమ్మకాల పరంగా ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 2020 లో, హ్యుందాయ్ భారత మార్కెట్లో 85 టూసాన్ కార్లను మాత్రమే విక్రయించింది. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో (2021లో) ఈ సంఖ్య 139 యూనిట్లకు పెరిగింది. ఈ సమయంలో ఇది 64 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అల్ట్యురాస్ జి4, ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. మహీంద్రా సెప్టెంబర్‌ 2020 లో మొత్తం 73 యూనిట్ల ఆల్ట్యూరాస్ ఎస్‌యూవీలను విక్రయించగా, గడచిన సెప్టెంబర్ 2021 లో కేవలం 51 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో మహీంద్రా ఆల్ట్యురాస్ జి4 అమ్మకాలు 30 శాతం తగ్గాయి. కొత్తగా వచ్చిన ఎక్స్‌యూవీ700 కారణంగా ఈ మోడల్ అమ్మకాలు తగ్గినట్లుగా భావిస్తున్నారు.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

కాగా, గత నెలలో అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, ఒక్క ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీని కూడా విక్రయించలేదు. కానీ, సెప్టెంబర్ 2020 లో మాత్రం కంపెనీ మొత్తం 694 యూనిట్ల ఫోర్డ్ ఎండీవర్ కార్లను విక్రయించింది. ఫోర్డ్ ఎండీవర్ మార్కెట్ నుండి తొలగిపోయిన నేపథ్యంలో, ఈ మోడల్ కోరుకునే కస్టమర్లు ఇప్పుడు టొయోటా ఫార్చ్యూనర్ లేదా ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలను ఎంచుకునే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఎండీవర్ వెళ్లిపోయింది.. పండుగ చేసుకుంటున్న టొయోటా ఫార్చ్యూనర్..

భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఫుల్-సైజ్ ఎస్‌యూవీల కంటే ఎక్కువగా మిడ్-సైజ్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇక్కడి మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే మిడ్-సైజ్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీలు కొంత చౌకగా ఉంటాయి. ఇవి చవకగా ఉన్నప్పటికీ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్ల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిత్యం కొత్త కార్లు పరిచయం చేయబడుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సెగ్మెంట్ లో మరిన్ని కొత్త ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Full size suv sales in september 2021 toyota fortuner tops the list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X