MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India), నేడు (అక్టోబర్ 11) తమ సరికొత్త ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీని రూ. 9.78 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఎమ్‌జి ఆస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను అందిస్తోంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

ఈ విభాగంలో లభిస్తున్న ఇతర ఎస్‌యూవీలలో లభించని ఫీచర్లు ఎమ్‌జి ఆస్టర్ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, భారత మార్కెట్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో లభిస్తున్న మొదటి ఎస్‌యూవీ కూడా ఇదే. డ్రైవర్‌కి మరియు ప్రయాణీకులకు అన్ని రకాల సమాచారాన్ని అందించేందుకు ఈ కారులో ఏఐ అసిస్టెంట్ ఫీచర్ ఇవ్వబడింది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ఎమ్‌జి ఆస్టర్ రావడంతో, ఈ విభాగంలో పోటీ మరింత పెరగనుంది. ప్రస్తుతం, ఈ విభాగంలో భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్రెటాతో ఎమ్‌జి ఆస్టర్ పోటీపడుతుంది. అలాగే, ఈ విభాగంలోని ఇతర మోడళ్లయిన కియా సెల్టోస్, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు లేటెస్ట్‌గా వచ్చిన స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లతో కూడా ఇది (ఆస్టర్) పోటీపడుతుంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

మరి ఈ విభాగంలోని ఇతర ఎస్‌యూవీలతో పోల్చినప్పుడు, ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని విభిన్నంగా మార్చే టాప్ 10 ప్రత్యేక విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

1. MG Astor - ఇంజన్ ఆప్షన్స్

ఎమ్‌జి ఆస్టర్‌ను కంపెనీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేసింది. వీటిలో మొదటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్. దీని టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

ఇకపోతే, ఇందులోని న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

ఈ కారులోని 1.3-లీటర్ టర్బో ఇంజన్ ఈ విభాగంలో లభిస్తున్న హ్యుందాయ్ క్రెటా యొక్క 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్, కియా సెల్టోస్ 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు రెనో డస్టర్, కుషాక్ మరియు టైగన్ లలోని1.3-లీటర్ ఇంజన్‌తో పోటీపడుతుంది.

Specs MG Astor Volkswagen Taigun Kia Seltos
Engine 1.5L Petrol / 1.3L Turbo Petrol 1.0L Turbo Petrol/1.5L Turbo Petrol 1.5L Petrol / 1.4L turbo petrol
Power 110bhp / 140bhp 115bhp / 150bhp 115bhp / 148bhp
Torque 144Nm / 220Nm 178Nm / 250Nm 144Nm / 250Nm
Gearbox 6MT & 8-speed CVT (1.5L) / 6-speed AT (1.3L) 6MT / 6-AT (1.0L ) 6MT / 7DSG (1.5L Turbo Petrol) 6MT / CVT(1.5L Petrol) / 6iMT (1.5L petrol) /7 DCT (1.4L Turbo Petrol)
MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

2. MG Astor - డిజైన్

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ డిజైన్ అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించబడుతున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. అయితే, దీనిని మరింత తాజాగా కనిపించేలా చేయడం కోసం కంపెనీ దీని డిజైన్‌లో కొన్ని చిన్నపాటి మార్పులను చేసింది. ఇందులో ఎమ్‌జి సిగ్నేచర్ హెక్సాగనల్ 'సెలెస్టియల్' ఫ్రంట్ గ్రిల్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయబడింది. ఇంకా ఇందులో సన్నని బంపర్లు, షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ని కలిగి ఉంటుంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

3. MG Astor - ఇంటీరియర్

ఎమ్‌జి ఆస్టర్ ఇంటీరియర్స్ వివరాలను గమనిస్తే, క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లలో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌ను ఉపయోగించారు, ఇవి మంచి ప్రీమియం ఫీల్‌ను అందిస్తాయి. వినోదం కోసం ఇందులో పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్రైవర్ సమాచారం కోసం 7.0 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు క్యాబిన్‌లో అక్కడక్కడా బ్రష్డ్ అల్యూమినియం యాక్సెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

4. MG Astor - కలర్ ఆప్షన్స్

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని కంపెనీ మొత్తం 5 కలర్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంచింది. వీటిలో స్పైస్డ్ ఆరెంజ్, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్ మరియు స్టారీ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

5. MG Astor - కొలతలు

Dimensions MG Astor Volkswagen Taigun Kia Seltos
Length 4323mm 4221mm 4315mm
Width 1809mm 1760mm 1800mm
Height 1653mm 1612mm 1790mm
Wheelbase 2580mm 2651mm 2610mm
MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

6. MG Astor - ఏఐ అసిస్టెంట్

ఎమ్‌జి ఆస్టర్ కారులో వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్ (పర్సనల్ ఏఐ అసిస్ట్) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. దీనిని క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చిన చిన్న రోబో అని చెప్పొచ్చు. ఇది డ్రైవర్ యొక్క గొంతుక (వాయిస్) ను గుర్తించి, కొన్ని రకాల వాయిస్ కమాండ్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ వాయిస్ కమాండ్స్ సాయంతో, డ్రైవర్ కారులోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు మరియు యాక్సెస్ చేయవచ్చు.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

ఆస్టర్ కారులోని ఈ లేటెట్స్ ఏఐ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ఆధారంగా సమాచారం మరియు వార్తలను అందిస్తుంది, అదే సమయంలో లోపల కూర్చున్న వ్యక్తులను అలరిస్తుంది. ఏఐ సంబంధిత ఉత్పత్తుల తయారీకి ప్రసిద్ధి చెందిన స్టార్ డిజైన్ ఆఫ్ అమెరికా ఈ ఎమ్‌జి ఆస్టర్ యొక్క ఏఐ అసిస్ట్ ఫీచర్‌ను డెవలప్ చేసింది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

7. MG Astor - అటానమస్ డ్రైవింగ్ లెవల్-2 (ADAS)

ఇతర ఎమ్‌జి కార్లలో మాదిరిగానే ఈ సరికొత్త ఆస్టర్ ఎస్‌యూవీ కూడా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీతో లభిస్తుంది. కాకపోతే, అవన్నీ లెవల్-1, కాగా ఇది అంతకన్నా అడ్వాన్స్డ్ అయిన లెవల్-2 సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ADAS వ్యవస్థ అనేది రాడార్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది మరియు ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

ఎమ్‌జి మోటార్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్లోస్టర్‌లో తొలిసారిగా కంపెనీ ఈ తరగా ఏడిఏఎస్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఎమ్‌జి ఆస్టర్‌లో లభిస్తున్న లెవల్-2 అటానమస్ టెక్నాలజీ ఈ విభాగంలోనే మొట్టమొదటి మరియు వేరే ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలోనూ ఇలాంటి ఫీచర్ లభించదు. ఇదొక అధునాతన ఆటోమేటిక్ టెక్నాలజీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈది కారును ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

8. MG Astor - కంఫర్ట్ ఫీచర్లు

ఎమ్‌జి అస్టర్ కారులో కంపెనీ అనేక హై-ఎండ్ కంఫర్ట్ ఫీచర్లను అందిస్తోంది. వీటిలో మూడు ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉంటాయి, అవి - నార్మల్, అర్బన్ మరియు డైనమిక్. ఇంకా ఈ కారులో పానోరమిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్మార్ట్ ఎంట్రీ, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ 60:40 స్ప్లిట్ సీట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, PM 2.5 ఫిల్టర్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్‌లు, 5 యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు 1 పవర్ అవుట్‌లెట్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

9. MG Astor - సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయంలో కూడా ఎమ్‌జి ఆస్టర్ ఏమాత్రం వెనుకబడి లేదు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), HHC (హిల్ హోల్డ్ కంట్రోల్), HDC (హిల్ డీసెంట్ కంట్రోల్), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు నాలుగు చక్రాలపై 4 డిస్క్ బ్రేకులు అందుబాటులో ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీలో లభించే ఇతర సేఫ్టీ ఫీచర్లలో ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, కార్నింగ్ అసిస్ట్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, సెక్యూరిటీ అలారం, రియర్ డీఫోగర్, హీటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు అల్ట్రా-హై స్టీల్ కేజ్ బాడీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MG Astor ఎస్‌యూవీని కొనడానికి ముందు తెలుసుకోవాల్సిన టాప్ 10 విషయాలు

10. MG Astor - ధరలు

ఎమ్‌జి ఆస్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో ఎంట్రీ లెవల్ ట్రిమ్ అయిన స్టైల్ ధర రూ. 9.78 లక్షలు. కాగా, సూపర్ ట్రిమ్ ధరలు రూ. 12.28 లక్షల నుండి రూ.12.68 లక్షలు, స్మార్ట్ ట్రిమ్ ధరలు రూ. 12.98 లక్షల నుండి రూ. 15.88 లక్షలు మరియు టాప్-ఎండ్ షార్ప్ ట్రిమ్ ధరలు రూ. 13.98 లక్షల నుండి రూ. 16.78 లక్షల మధ్యలో అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Top 10 things to know about mg astor suv before you decide to buy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X