Just In
Don't Miss
- Sports
BWF World Tour Finals 2021: టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ గురి
- News
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
- Movies
పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమేజింగ్ ఆఫర్..: హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీపై రూ.1.5 లక్షల డిస్కౌంట్!
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న మొట్టమొదటి మరియు ఏకైక ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ కోనా'పై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. హ్యుందాయ్ కోనా 2020 మోడల్‌పై కంపెనీ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

అయితే, ఇందులో వైట్ కలర్ వేరియంట్‌పై మాత్రం కేవలం రూ.50,000 డిస్కౌంట్‌నే అందిస్తున్నారు. ఇతర కలర్ వేరియంట్లపై రూ.1.5 లక్షల వరకూ తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ.23.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి (డిస్కౌంట్‌కి మునుపు).

హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. అందుకే, పాత మోడల్ (2020)పై కంపెనీ ఇంత భారీ మొత్తంలో తగ్గింపులను అందిస్తోంది.
MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును తమిళనాడులోని హ్యుందాయ్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తుంది. ఈ కారులో పవర్‌ఫుల్ 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 134 బిహెచ్‌పి శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కోనా ఈవి కేవలం 9.7 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. పూర్తి ఛార్జీపై హ్యుందాయ్ కోనా 452 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
MOST READ:22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

ఇందులోని 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఏసి ఛార్జర్ ఉపయోగించి 100 శాతం ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే, కేవలం 57 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది.

ఈ ఎలక్ట్రిక్ కారులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడ్జస్టబల్ స్టీరింగ్, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, యాక్సెసరీ పవర్ అవుట్‌లెట్, రియర్ రీడింగ్ ల్యాంప్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మరియు స్టోరేజ్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

ఇంకా ఇందులో బటన్-టైప్ షిఫ్ట్-బై-వైర్ టెక్నాలజీ, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ వెంటిలేషన్ డక్ట్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో ఎకో, ఎకో ప్లస్, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. మరింత స్పోర్టీ ఫీల్ కోసం ఇందులో పాడిల్ షిఫ్టర్లు కూడా ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఈబిడితో కూడిన ఏబిఎస్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, బహుళ ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, సీట్ బెల్ట్ అలెర్ట్ అలారం, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనం రెండు వేరియంట్లు మరియు తొమ్మిది రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధరలు రూ.23.75 లక్షలు మరియు రూ.23.94 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా)గా ఉన్నాయి. ఇది మార్కెట్లో ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి పోటీగా నిలుస్తుంది.

ఈ కారుకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కోన ఎలక్ట్రిక్ కారులో కొన్ని సాంకేతికపరమైన సమస్యల దృష్ట్యా కంపెనీ వాటిని రీకాల్ చేసింది. ఏప్రిల్ 1, 2019 నుండి అక్టోబర్ 31, 2020 మధ్య కాలంలో తయారైన కార్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయి. హై-వోల్టేజ్ బ్యాటరీ వ్యవస్థలలోని విద్యుత్ లోపం కారణంగా వీటిని రీకాల్ చేశారు - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.