జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) లగ్జరీ కార్ బ్రాండ్‌ను భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసినదే. అయితే, గత రెండేళ్లుగా మార్కెట్‌ను వేధిస్తున్న కరోనా మహమ్మారి మరియు సెమీ కండక్టర్ల కొరత కారణంగా ఇతర ఆటోమొబైల్ సంస్థల మాదిరిగానే జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపారం కూడా దెబ్బతినింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగం ముగిసే నాటికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆదాయం 36 శాతం తగ్గవచ్చని కంపెనీ అంచనా వేసింది. ఈ అంచనాలు టాటా మోటార్స్ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. జులై 8వ తేదీన స్టాక్ మార్కెట్ ఆరంభమైన కొద్దిసేపటికే టాటా మోటార్స్ షేర్లు 2 శాతం పడిపోయాయి.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ స్టాక్స్ ఎక్కువగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. టాటా మోటార్స్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా, ఇన్వెస్టర్లు టాటా మోటార్స్ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

అయితే, గడచిన మంగళవారం నుండి టాటా మోటార్స్ షేర్లు వరుసగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, టాటా మోటార్స్ గడచిన బుధవారం తమ పెట్టుబడిదారులతో వారి మనోభావాలను పునరుద్ధరించడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించింది. ఈ కాల్‌లో కంపెనీ ఎదుర్కుంటున్న ఎలక్ట్రానిక్ చిప్స్ కొరతను ప్రస్థావించింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

ప్రస్తుత 2021-2022 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో యుకెకు చెందిన తమ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) ప్రతికూల ఇబిఐటి మార్జిన్‌ను చూస్తుందని, అలాగే ఈ ప్రీమియం వాహన సంస్థలో కూడా సెమీకండక్టర్ చిప్ కొరత కొనసాగుతోందని కంపెనీ మంగళవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ సెమీకండక్టర్ చిప్స్ కొరతను ఎదుర్కుంటోంది. వాహనాల ఇన్ఫోటైన్‌మెంట్ మరియు పలు కీలకమైన ఎలక్ట్రానికి పరికరాల్లో ఈ చిప్స్‌ను ఉపయోగిస్తారు. వీటి కొరత కారణంగా, అధిక ధరల వద్ద వీటిని కొనుగోలు చేయటం లేదా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటం జరుగుతోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉత్పత్తి ప్రభావితమై, అమ్మకాలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో జెఎల్ఆర్ ఆదాయం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లకు డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, ఈ చిప్స్ సమస్య బిలియన్ పౌండ్ల విలువైన వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని టాటా మోటార్స్ అంచనా వేసింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

ఇదిలా ఉంటే, ఈ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూ గుబుల్.. టాటా మోటార్స్ షేర్లు ఢమాల్..

భారత్‌లో కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ బుకింగ్స్, డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎస్‌యూవీ ప్రఖ్యాత రేంజ్ రోవర్ లగ్జరీ బ్రాండ్ యొక్క అధునాతన డిజైన్ డీటేలింగ్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు మోడ్రన్ లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Jaguar Land Rover May Register Negative Growth In First Half; Tata Motors Shares Fell. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X