కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.64.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ బుకింగ్స్‌ను ఆన్‌లైన్‌లో ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, నేటి నుండే ఈ ఎస్‌యూవీ డెలివరీలు కూడా ప్రారంభం అవుతాయని కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తెలిపింది.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

ఈ కొత్త 2021 మోడల్ ఎవోక్ ఎస్‌యూవీ ప్రఖ్యాత రేంజ్ రోవర్ లగ్జరీ బ్రాండ్ యొక్క అధునాతన డిజైన్ డీటేలింగ్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు మోడ్రన్ లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

ఈ కారు గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ.. రేంజ్ రోవర్ ఎవోక్ తన ప్రత్యేకమైన, ఆధునిక మరియు స్మార్ట్ డిజైన్‌తో ఎల్లప్పుడూ తలలు తిప్పుకునేలా చేస్తుందని, ఈ కారులో కొత్త ఇంటీరియర్ డిజైన్, సరికొత్త ల్యాండ్ రోవర్ టెక్నాలజీలు మరియు శక్తివంతమైన ఇంజన్లను ప్రవేశపెట్టడంతో, ఇది మునుపటి కన్నా మరింత శక్తివంతంగా మరియు సమర్థవంతంగా ఉంటుందని అన్నారు.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఆర్-డైనమిక్ ఎస్ఈ వేరియంట్ (ఇంజినియం 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్) మరియు ఎస్ వేరియంట్ (2.0 లీటర్ డీజిల్ ఇంజన్) ఆప్షన్లలో లభిస్తుంది. భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.64.12 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 184 కిలోవాట్ శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 150 కిలోవాట్ల శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

రేంజ్ రోవర్ ఎవోక్ లగ్జరీ ఎస్‌యూవీలో కంపెనీ 3డి సరౌండ్ కెమెరా, పిఎమ్ 2.5 ఫిల్టర్‌తో క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్, ఫోన్ సిగ్నల్ బూస్టెరాండ్‌తో కూడిన వైర్‌లెస్ డివైస్ ఛార్జింగ్ మరియు కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తోంది.

కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల; ధర రూ.64.12 లక్షలు

ఈ ఎస్‌యూవీలో మొట్టమొదటిసారిగా డీప్ గార్నెట్ / ఎబోనీ అని పిలువబడే కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కలర్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఈ విభాగంలో వోల్వో ఎక్స్‌సి60 మరియు మెర్సిడెస్ జిఎల్‌సి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New 2021 Range Rover Evoque SUV Launched In India; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X