UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Kia India (గతంలో కియా మోటార్స్) తమ కార్లలో అందిస్తున్న యూవీఓ కనెక్ట్ ( UVO Connect) కార్ కనెక్టింగ్ టెక్నాలజీ పేరును కియా కనెక్ట్ (Kia Connect) గా మార్చినట్లు ప్రకటించింది. ఈ మార్పు మొదటగా యూరోపియన్ మోడళ్లలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఏషియన్ మోడళ్లలో అందుబాటులోకి వస్తుంది.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

కియా తమ కనెక్టింగ్ టెక్నాలజీకి ఒక కొత్త పేరు ఇవ్వడం ద్వారా, కస్టమర్, వాహనం మరియు పర్యావరణం మధ్య మెరుగైన కనెక్షన్ కోసం దీనిని రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ కియా కార్లలో అందించబడుతోంది మరియు దీని సహాయంతో డ్రైవర్ డ్రైవింగ్ సమయంలో అనేక రకాల సేవలకు సంబంధించిన ప్రయోజనాలను పొందవచ్చు.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

కియా ఇండియా (Kia India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న అన్ని మోడళ్లలో కంపెనీ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది మరియు ఈ కార్లకు కస్టమర్ల నుండి మంచి స్పందన కూడా లభిస్తోంది. కియా నుండి విక్రయించబడే కార్ల సగానికి పైగా కార్లు కనెక్టింగ్ టెక్నాలజీతో కూడుకున్నవేనని కంపెనీ తెలిపింది.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

యువో కనెక్ట్ (UVO Connect) కింద కంపెనీ 50 కి పైగా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కార్ కనెక్టింగ్ ఫీచర్లను అందించింది. కంపెనీ ఇటీవల దీనికి ఓ కొత్త అప్‌డేట్ ను కూడా ఇచ్చింది, ఇందులో వాయిస్ అసిస్ట్ వేక్-అప్ కమాండ్ 'హలో కియా' (Hello Kia) సపోర్ట్ ఉంటుంది. దీనితో, మొత్తం 9 వాయిస్ కమాండ్‌లు ఇప్పుడు ఈ లేటెస్ట్ కనెక్ట్ టెక్నాలజీలో చేర్చబడ్డాయి.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

కొత్తగా జోడించిన వాయిస్ కమాండ్స్ ఫీచర్స్ లో కాలింగ్, వాతావరణ సమాచారం, రోజు మరియు తేదీ, భారతీయ సెలవు దినాల సమాచారం, క్రికెట్ స్కోరు, మీడియా కంట్రోల్స్, నావిగేషన్ కంట్రోల్ మరియు టెంపరేచర్ కంట్రోల్ సదుపాయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, యువో స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ ఆప్షన్‌ సాయంతో స్మార్ట్ వాచ్ నుండి అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

ఇంకా ఈ టెక్నాలజీలో వెహికల్ ట్రాకింగ్, ఆటో కొల్లైజన్ నోటిఫికేషన్, SOS ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రిమోట్ ఆపరేటెడ్ ఎయిర్ ప్యూరిఫయర్, ఎయిర్ క్వాలిటీ మానిటర్, జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్స్, స్పీడ్ అలర్ట్, వాలెట్ మరియు ఐడిల్ అలర్ట్స్ లంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

ఈ టెక్నాలజీ విషయంలో కియా మోటార్స్ ముందున్నందున దేశవ్యాప్తంగా కనెక్ట్ చేయబడిన కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కియో మోటార్స్ గత సంవత్సరం భారతదేశంలో లక్షకి పైగా కనెక్ట్ చేయబడిన కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. కంపెనీ తన మోడళ్లను యువో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో విక్రయిస్తోంది. కంపెనీ విక్రయించిన మొత్తం కార్లలో 55 శాతం యువో కనెక్ట్ టెక్నాలజీ కలిగిన కార్లే కావటం విశేషం.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే, దేశంలో చాలా మంది కస్టమర్లు లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కలిగిన కార్లనే ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ టెక్నాలజీకి కియా కనెక్ట్ అనే కొత్త పేరును పెట్టింది. భారతదేశంలో కియా మాదిరిగానే, అనేక ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా కనెక్టింగ్ టెక్నాలజీని తీసుకురావడం ప్రారంభించాయి. ఇప్పుడు టూవీలర్లు మరియు చిన్న కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

పెరిగిన సెల్టోస్, సోనెట్ కార్ల ధరలు

ఇదిలా ఉంటే, కియా ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న సోనెట్ (Kia Sonet) మరియు సెల్టోస్ (Kia Seltos) ఎస్‌యూవీల ధరలను మరోసారి పెంచింది. తాజాగా వీటి ధరలు రూ. 10,000 మరియు రూ. 20,000 మేర పెరిగాయి. ఈ ఏడాది (2021) లో కంపెనీ తమ కియా సెల్టోస్ మరియు కియా సోనెట్ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

ఈ రెండు ఎస్‌యూవీల ధరల పెరుగుదలకు ఇన్‌పుట్ మెటీరియల్ మరియు రవాణా వ్యయం పెరగడమే కారణమని కంపెనీ చెబుతోంది. ఇంతకుముందు, కియా ఇండియా జనవరి నెలలో మరియు ఆ తరువాత మే నెలలో ఈ కార్ల ధరలను పెంచింది. ధరల పెరుగుదల తర్వాత, కియా సెల్టోస్ బేస్ పెట్రోల్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 9.95 లక్షలకు చేరుకుంది. అలాగే, కియా సోనెట్ యొక్క బేస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు బేస్ డీజిల్ వేరియంట్ ధర రూ. 8.55 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.

UVO Connect టెక్నాలజీ పేరును Kia Connect గా మార్చిన కియా ఇండియా!

కొత్త 2021 Kia Carnival విడుదల..

కియా ఇండియా తాజాగా తమ కొత్త 2021 కియా కార్నివాల్ (2021 Kia Carnival) ఎమ్‌పివిని దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ లగ్జరీ ఎమ్‌పివి ప్రారంభ ధర రూ. 24.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది ఈ విభాగంలో టొయోటా ఇన్నోవాకి నేరుగా పోటీ ఇస్తుంది. - ఈ కొత్త 2021 మోడల్ కార్నివాల్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Kia india changes uvo connect name as kia connect details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X