పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ధరలను పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1, 2021వ తేదీ నుండే అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను కియా సొనెట్, సెల్టోస్ వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.20,000 వరకూ పెరిగాయి. దీనిని ఆన్-రోడ్ ధరకు కన్వర్ట్ చేసుకుంటే సుమారు రూ.70,000 వరకూ పెరుగుతుంది.

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

కియా సొనెట్ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వీటిలో 1.2 లీటర్ పెట్రోల్ హెచ్‌టిఈ ధరను రూ.8000, హెచ్‌టికె మరియు హెచ్‌టికె ప్లస్ వేరియంట్ల ధరలను రూ.10,000 మేర పెంచారు. కాగా, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ల ధరలను మాత్రం కంపెనీ పెంచలేదు.

MOST READ:ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

అలాగే, కియా సోనెట్ డీజిల్ 1.5 లీటర్ ఇంజన్‌తో లభించే అన్ని వేరియంట్ల ధరలను రూ.20,000 మేర పెంచారు. తాజా ధరల పెంపుతో ప్రస్తుతం, మార్కెట్లో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు రూ.6.79 లక్షల నుండి రూ.13.13 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). గతేడాది మార్కెట్లో విడుదలైన కియా సోనెట్ మార్కెట్లో అద్భుతంగా అమ్ముడవుతోంది.

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

ఇక కియా సెల్టోస్ విషయానికి వస్తే, ఇది కూడా మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే హెచ్‌టిఈ వేరియంట్ ధరను కంపెనీ పెంచలేదు. అయితే, హెచ్‌టికె మరియు హెచ్‌టికె ప్లస్ ధరలను రూ.10,000 మేర పెంచారు. ఇతర వేరియంట్ల ధరలను రూ.11,000 మేర పెంచారు.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 బుకింగ్స్ హవా.. ఇప్పటికీ తగ్గని జోరు

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

ఇందులో 1.4-లీటర్ టర్బో ఇంజన్‌తో లభించే జిటిఎక్స్ వేరియంట్ ధర రూ.11,000 మేర పెరగగా, జిటిఎక్స్ ప్లస్ మరియు జిటిఎక్స్ ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్ ధరను రూ.10,000 మేర పెంచారు. ఇందులో జిటిఎక్స్ ప్లస్ డిసిటి మరియు జిటిఎక్స్ ప్లస్ డిసిటి డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలను మాత్రం మార్చలేదు.

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

కియా సెల్టోస్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభించే హెచ్‌టిఇ వేరియంట్ ధరను రూ.1000 పెంచారు. ఇందులోని హెచ్‌టికె, హెచ్‌టికె ప్లస్, హెచ్‌టికె ప్లస్ ఏటి, హెచ్‌టిఎక్స్ ప్లస్, హెచ్‌టిఎక్స్ ప్లస్ డ్యూయల్ టోన్, హెచ్‌టిఎక్స్ ప్లస్ ఏటి, హెచ్‌టిఎక్స్ ప్లస్ ఏటి డ్యూయల్ టోన్ వేరియంట్ల ధరలను రూ.10,000 మేర పెంచారు.

MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

అలాగే, సెల్టోస్ హెచ్‌టిఎక్స్, హెచ్‌టిఎక్స్ ఏఈ, జిటిఎక్స్ ప్లస్ ఏటి, జిటిఎక్స్ ప్లస్ ఏటి డ్యూయల్ టోన్ వేరియంట్ల ధరలను రూ.11,000 మేర పెంచారు. తాజా ధరల పెంపుతో ప్రస్తుతం మార్కెట్లో కియా సెల్టోస్ ధరలు రూ.9.89 లక్షల నుండి రూ.17.65 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

కియా సెల్టోస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసి ఒక సంవత్సరం పూర్తయింది. భారత కార్ మార్కెట్లోకి కియా మోటార్స్ నిలదొక్కుకోవటానికి ఈ మోడల్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ విభాగంలో పోటీ పెరుగుతుండటంతో, సెల్టోస్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మరి 2021లో ఈ మోడల్ ఎలా పెర్ఫార్మ్ చేయనుందో చూడాలి.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

పెరిగిన కియా సోనెట్, కియా సెల్టోస్ ధరలు; ఇవే కొత్త ధరలు..

ఇదిలా ఉంటే, భారతదేశంలో లక్ష యూనిట్ల కనెక్టెడ్ కార్ల అమ్మకాలను సాధించిన మొట్టమొదటి కార్ల తయారీ సంస్థగా కియా మోటార్స్ నిలిచింది. యూవీఓ కనెక్ట్ ఇన్-కార్ టెక్నాలజీతో కూడిన కియా వాహనాలు భారతదేశంలో బ్రాండ్ మొత్తం అమ్మకాలలో 55 శాతం కంటే అధికంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Kia Motors Increased Sonet And Seltos Prices; New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X